సాక్షి,పాలకుర్తి: ఆస్తి పంపకాల్లో వచ్చిన విభేదాల కారణంగా కన్నతండ్రి అంత్యక్రియలను సొంత కూతుళ్లే అడ్డుకున్నారు. ఆస్తిని సమానంగా పంచాల్సిందేనంటూ పట్టుబట్టారు. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన దీకొండ చంద్రయ్య(74)కు నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుమారులు లేరు. చంద్రయ్య అనారోగ్యానికి గురైనప్పటి నుంచి మూడో కుమార్తె ఆయన బాగోగులు చూస్తోంది. ఈ క్రమంలో చంద్రయ్య అనారోగ్యంతో మంగళవారం ఉదయం మృతి చెందారు.
తండ్రి ఆస్తి మొత్తం మూడో కుమార్తె తీసుకుందని ఆరోపిస్తూ మిగతా కూతుళ్లు దహన సంస్కారాలను అడ్డుకున్నారు. ఆస్తిని సమానంగా పంచాలన్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్‌ఐ గండ్రాతి , పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంతరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దహన సంస్కారాలు పూర్తయ్యాక మాట్లాడుదామని నచ్చజెప్పడంతో కూతుళ్లు అంగీకరించారు. తల్లిదండ్రుల ఆస్తి కోసం కుమార్తెలు గొడవకు దిగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment