
పాలకుర్తి టౌన్: జనగామ జిల్లా పాలకుర్తి మండలకేంద్రంలో ఎలుగుబంటి సంచారం అలజడి రేపింది. బుధవారం రాత్రి ఎలుగబంటి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ నుంచి డివైడర్ దాటుతుండగా మారం శ్రీనివాస్ తన కారులో వెళ్తూ వీడియో తీశాడు. గురువారం ఉదయం రాజీవ్ చౌరస్తా నుంచి లక్ష్మీనారాయణపురం గ్రామంలోని పంట పొలాల్లో సంచరించింది. దీంతో స్థానికులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. అచూకీ కోసం పోలీసులు వెదకడం మొదలుపెట్టారు. పాలకుర్తి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అఖిలేశ్ ఎలుగుబంటి పాదముద్రలను సేకరించారు.