
సమావేశంలో మాట్లాడుతున్న తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు
సాక్షి, జనగామ: తెలంగాణలోపాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీకి చెక్‌పెట్టేందుకే హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావు అన్నారు. బుధవారం పట్టణంలోని గబ్బెట్ట గోపాల్‌రెడ్డి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమాశంలో ఆయన స్పష్టం చేశారు. బీజేపీని ఎదురుకునే శక్తి కాంగ్రెస్‌కు లేదని ఆయన అన్నారు. ఈ ఒక్క ఎన్నికల్లోనే టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తామని, ప్రజా సమస్యల విషయంలో టీఆర్‌ఎస్‌తో ఎలాంటి రాజీ లేదని, ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఆర్టీసీ సమ్మెను విరమించేందుకు ముఖ్యమత్రి చొరవ చూపాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. సీపీఐ సంస్తాగత నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు డిసెంబర్ 21, 22 తేదీల్లో మంచిర్యాలలో మహాసభలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, బర్ల శ్రీరాములు, పాతూరి సుగుణమ్మ, ఆది సాయన్న, వెంకన్న,నిర్మల తదతరులు పాల్గొన్నారు.