
సాక్షి, హైదరాబాద్: హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి తరఫున సీపీఐ ప్రచారం చేయనుంది. కాగా ఉప ఎన్నికలో తమ అభ్యర్థికి మద్దతు ప్రకటించాలని కోరుతూ.. టీఆర్‌ఎస్ నేతలు కేశవరావు, నామా నాగేశ్వరరావు ఇటీవల చాడను కలిసిన విషయం తెలిసిందే.
అయితే వారి భేటీ జరిగిన మరసటి రోజే.. తమకు మద్దతు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు కూడా సీపీఐ నేతలతో సమావేశమయ్యారు. అయితే నేడు జరిగిన సమావేశంలో మద్దతుపై చర్చించిన కామ్రెడ్లు.. సీఎం కేసీఆర్ అభ్యర్థన మేరకు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావు నామినేషన్ అధికారులు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఉప ఎన్నికల బరిలో కామ్రెడ్లు బరిలో లేకుండా అయింది. దీంతో వారి ఓట్లు ఎవరివైపు పడతాయనేది ఆకక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment