సభలో మాట్లాడుతున్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
రఘునాథపల్లి: ‘ప్రపంచం అబ్బురపడే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినం.. ఇంటింటికీ నీళ్లిచ్చే మిషన్ భగీరథ చేపట్టినం.. అన్ని రంగాల్లో నంబర్ వన్ తెలంగాణ’అని చెప్పుకొనే సీఎం కేసీఆర్‌కు పీకే ఎందుకు? ప్రకాష్‌రాజ్ ఎందుకు? అని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. బీఎస్పీ ఏనుగులాగ ఘీంకరించగానే కాం ట్రాక్టర్ల వద్ద కమీషన్ల రూపంలో తీసుకున్న రూ.600కోట్లతో పీకేను తెచ్చుకున్నారని ఆయన ఆరోపించారు.
బహుజన రాజ్యాధికార యాత్ర సందర్భంగా ఆదివారం రాత్రి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో బహిరంగ సభ జరిగింది. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన సభలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ... ఇది ప్రవీణ్‌కుమార్ యాత్ర కాదు, తెలంగాణలో మూడు కోట్ల మంది బహుజనులు చేస్తోన్న దండయాత్ర అన్నారు.
కేసీఆర్ కుయుక్తులు పసిగట్టి జనం ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపు నిచ్చారు. సభలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, రాష్ట్ర కోఆర్డినేటర్లు దేవోళ్ల గంగాధర్, మల్లేశం, బాలస్వామి చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మహతి రమేష్, గంధం శివ, శేఖర్, వెంకన్న, రాష్ట్ర కార్యర్శులు అనితారెడ్డి, వెంకటేష్, నాయకులు సమ్మయ్య, కందికంటి విజయ్‌కుమార్, శివరాజ్, రంగు రాజశేఖర్‌గౌడ్, ప్రేమ్‌సాగర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment