
ప్రమాదం జరిగిన స్థలంలో రైల్వే సిబ్బంది
జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో వ్యాగన్ పాయింట్ లైన్‌పై గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. శనివారం వేకువజామున 2 గంటల సమయంలో 17 బోగీలు పట్టాలు తప్పడంతో హుటాహుటిన సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులు జనగామకు చేరుకున్నారు. జనగామలో బియ్యం లోడ్ చేసుకుని సికింద్రాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పిన బోగీలను వదిలేసి మిగతా బోగీలను సికింద్రాబాద్‌కు పంపించేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.