
శేఖర్‌రెడ్డి (ఫైల్) ధనలక్ష్మమ్మ(ఫైల్) రఘుమారెడ్డి (ఫైల్)
చందానగర్/లింగాలఘణపురం: బంధువుల ఇంట్లో అంత్యక్రియల కోసం తల్లి, తండ్రి, కుమారడు బయల్దేరారు. కుమారుడు కారు నడుపుతున్నాడు. మార్గమధ్యలో కారు టైరు అకస్మాత్తుగా పేలింది. అంతే.. కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొంది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం సూర్యాపేట ప్రధాన రహదారిపై శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది.
వెనుక టైరు పేలడంతో..
శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీలో ఉంటున్న జెన్న శేఖర్‌రెడ్డి (67), ధనలక్ష్మమ్మ (60) దంపతుల కుమారుడు రఘుమారెడ్డి (27). గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో హెచ్‌ఆర్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ధనలక్ష్మమ్మ ఇంట్లో కుట్టు మిషన్‌పై బట్టలు కుడుతుంటుంది. శేఖర్‌రెడ్డి అనారోగ్య కారణాల వల్ల ఇంట్లోనే ఉంటున్నాడు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో శేఖర్‌రెడ్డి మేనమామ సంకపల్లి నర్సింహారెడ్డి మృతి చెందడంతో అంత్యక్రియలకు వెళ్లేందుకు శుక్రవారం ఉదయం 8.30 గంటలకు శేఖర్‌రెడ్డి, ధనలక్ష్మమ్మ, రఘుమారెడ్డి కారులో బయలుదేరారు.
కుమారుడు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జనగామ దాటి సూర్యాపేట రోడ్డులోని వనపర్తి స్టేజీ సమీపంలోకి రాగానే కారు వెనుక టైరు పే లడంతో తిరుమలగిరి తు మ్మలగూడెం నుంచి పశువుల లోడుతో వస్తు న్న బొలేరో గూడ్స్ వాహనాన్ని ఢీకొట్టింది. రెండు వాహనాలు అతివేగంగా ఢీకొనడంతో బొలేరో బోల్తా పడింది. కారు నుజ్జునుజ్జయింది. శేఖర్‌రెడ్డి, ధనలక్ష్మమ్మ, రఘుమారెడ్డి మృతి చెం దాడు. ముగ్గురి మృతదేహాలు కారులోనే ఇరుక్కు పోయాయి. బొలేరో డ్రైవర్‌కు చేతులు విరిగాయి.
మరో ఇద్దరు వెళ్దామనుకున్నారు.. కానీ..
శేఖర్‌రెడ్డి సోదరుడు లక్ష్మారెడ్డి చందానగర్‌లోని శివాజీనగర్‌లో నివాసం ఉంటు న్నాడు. అంత్యక్రియల నిమిత్తం తిరుమలగిరికి వెళ్తున్నట్లు చెప్పి ఉంటే లక్ష్మారెడ్డి కూడా శేఖర్‌రెడ్డి కారులోనే వెళ్లేవారని, ఆయన కూడా ప్రమాదానికి గురయ్యే వారని కుటుంబీకులు అంటున్నారు. శేఖర్‌రెడ్డి రెండో భార్య మాణెమ్మ కూడా తిరుమలగిరిలో జరిగే అంత్యక్రియలకు వెళ్లేందుకు సిద్ధమయింది.
అయితే అప్పటికే శేఖర్‌రెడ్డి కుటుంబం బయల్దేరడంతో ఇక్కడే ఆగిపోయింది. రఘుమారెడ్డికి గతేడాది నవంబర్ 18న మహబూబాబాద్ జిల్లా, నర్సింçహాపేట మండలం, వంతడుపుల గ్రామానికి చెందిన దివ్యతో వివాహం జరిగింది. శేఖర్‌రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని న్యా యం చేయాలని బంధువులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment