
తిరుపతి– భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండ లం పోచన్నపేట శివారులో శనివారం భార్యాభర్తలు బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి భార్యను కిడ్నాప్ చేశారు. భర్త బండ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా పారుపెల్లి గ్రామానికి చెందిన బండ తిరుపతి భార్య భాగ్యలక్షి్మకి ఇటీవల ఆరోగ్యం బాగోలేకపోవడంతో జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయిం చుకుంది. ఇలా భాగ్యలక్ష్మి వారం రోజులుగా ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకుంటోంది.
ఈ క్రమంలో శనివారం ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా జనగామ జిల్లా పెద్దరామన్‌చర్ల శివారులో వెనక నుంచి వచి్చన కారు వాళ్ల బైక్‌ను ఢీకొట్టింది. వారిద్దరికీ గాయాలు కాగా.. ఢీకొట్టిన కారులోని వ్యక్తులు వారిని కారులో ఎక్కించుకున్నారు. ఈ క్రమంలో తిరుపతి గొంతును నులమడంతో స్పృహ కోల్పో గా చనిపోయాడని నిర్ధారించుకున్న దుండగులు బచ్చన్నపేట మండలం పోచన్నపేట శివారులో తిరుపతిని కారు నుంచి తోసేసి భాగ్యలక్షి్మని కిడ్నా‹ ప్ చేసి తీసుకెళ్లారు. గమనించిన చుట్టు పక్క ల రైతులు గాయపడిన తిరుపతిని 108 వాహనంలో జనగామ ఏరియా ఆçస్పత్రికి తరలించారు.
బాధి తుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్‌రావు తెలిపారు. దుండగులు కారు నుంచి తిరుపతిని తోసేయగా.. ఏమి జరుగుతుందో అని పలువురు ఆ కారు ఫొటోలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. కారు రాజపేట మండలం బొందుగుల గ్రామానికి చెందినదని, కిడ్నాప్‌కు గురైన భాగ్యలక్ష్మి రాత్రి వేళ ఇంటికి చేరుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment