ప్రతీకాత్మకచిత్రం
స్టేషన్‌ఘన్‌పూర్: పాలకుర్తి మండలంలోని ఓతండాకు చెందిన విద్యార్థిని మండలంలోని నమిలిగొండ శివారు మోడల్ స్కూల్‌లో ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మోడల్ స్కూల్‌లో హాస్టల్ సౌకర్యం లేకపోవడంతో శివునిపల్లిలోని ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ విద్యనభ్యసిస్తోంది. అయితే మోడల్ స్కూల్‌లో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసే రేణుకుంట్ల శ్యామ్ కన్ను ఆవిద్యార్థినిపై పడింది.
ఈక్రమంలో ఈనెల 17న జాతీయ జెండావిష్కరణలో సదరు అధ్యాపకుడు పాల్గొన్నాడు. అనంతరం హాస్టల్‌కు వెళ్లిన విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఆమెను తీసుకుని బయటకు వెళ్లాడు. సాయంత్రం అయినా.. విద్యార్థిని హాస్టల్‌కు రాకపోవడంతో వార్డెన్ విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో హాస్టల్ వద్దకు ఆమె తల్లిదండ్రులు చేరుకున్నారు. 17న రాత్రి విద్యార్థిని హాస్టల్‌కు రాగా.. తల్లిదండ్రులు నిలదీశారు.
మాయమాటలు చెప్పి అధ్యాపకుడు శ్యామ్ బయటకు తీసుకెళ్లాడని బాలిక చెప్పింది. దీంతో ఈనెల18న బాలిక తల్లి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సదరు అధ్యాపకుడిని అరెస్టు చేశారు. అనంతరం జనగామ సబ్‌జైల్‌కు తరలించినట్లు ఏసీపీ రఘుచందర్ తెలిపారు. సదరు అధ్యాపకుడి ప్రవర్తనపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి.
బాలికను గర్భవతిని చేసిన యువకుడు
నడికూడ: మండల కేంద్రానికి చెందిన బాలికను అదే ప్రాంతానికి చెందిన యువకుడు మాయమాటలు చెప్పి లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. కొద్ది నెలల నుంచి జరుగుతున్న ఈవ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గర్భం దాల్చిన విషయాన్ని సదరు బాలిక కుటుంబ సభ్యులకు చెప్పలేదు. నెలలు నిండక ముందే నొప్పులు రావడంతో కుటుంబీకులు బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కడుపులోనే శిశువు మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో ఏసీపీ శివరామయ్య గ్రామంలో వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment