మూడు మండలాల్లో 144 సెక్షన్‌ | 144 section in three mandals at jangaon district | Sakshi
Sakshi News home page

మూడు మండలాల్లో 144 సెక్షన్‌

Published Mon, Oct 17 2016 2:44 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

144 section in three mandals at jangaon district

జనగామ: జనగామ జిల్లాలోని మూడు మండలాలను వరంగల్‌ జిల్లాలో కలపాలని ఆందోళనలు జరగుతున్న నేపథ్యంలో మూడు మండలాల పరిధిలో 144 సెక్షన్‌ను విధించారు. కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌, జఫర్గడ్‌, చిల్పుర్‌ మండలాలను తిరిగి వరంగల్‌ జిల్లాలో కలపాలని గత కొన్ని రోజులుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు మూడు పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో నేటి నుంచి 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు ఖాజీపేట ఏసీపీ ఓ ప్రకటనలో తెలిపారు. 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున నిరసనలు, ధర్నాలు, సమావేశాలు, రోడ్ల మీద వంటా వార్పు వంటి కార్యక్రమాలు నిషేదమని అధిగమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement