
సాక్షి, హైదరాబాద్: బహుజనులకు ఏళ్ల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని చాటి చెప్పేందుకు బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ విభాగం బహుజన రాజ్యాధికార యాత్రకు శ్రీకా రం చుట్టింది. ఈ క్రమంలో 300 రోజుల పాటు సుదీర్ఘంగా బహుజన రాజ్యాధికార యాత్ర చేపడుతున్నట్టు బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ చీఫ్ కో–ఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
బడుగుల రాజకీయ అధికారం కోసం మూడు శతాబ్దాల క్రితం మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాడిన బహుజన యోధుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 4గంటలకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ నుంచి యాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. ముందుగా అక్కడే ప్రారంభ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment