సహజ రుచులకు ఆహారప్రియులు ఫిదా
ఆరోగ్యకరమైన ఉత్పత్తులకే ఓటు
నగరవాసుల్లో పెరిగిన అవగాహన
ట్రెండ్ మారుస్తున్న అమ్మకందారులు
సాక్షి, సిటీబ్యూరో: ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? చిన్న పిల్లల నుంచి పండు ముసలి దాకా ఎగిరి గంతేస్తారు.. అనారోగ్య కారణాల రీత్యా, కృత్రిమ రంగుల వినియోగం వల్ల కొందరు దీనికి దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యం, ఆహారంపై కరోనా నేరి్పన గుణపాఠాన్ని నగరవాసులు బాగానే ఒంటబట్టించుకున్నారు. దీన్ని గ్రహించిన అమ్మకం దారులను నయా ట్రెండ్‌లో తమ వ్యాపారాలను అందిపుచ్చుకుంటున్నారు.
ఆహార ప్రియుల మనసును గెలుచుకునేందుకు కొత్త తరహాలో సహజమైన పళ్ల రసాల నుంచి ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నారు. వీటిని ఆరగించిన ఆహార ప్రియులు ఐస్ ఐపోతున్నారంటే నమ్మండి.. కొత్త తరహాలో మార్కెట్‌ను ఆక్రమించికుంటున్న ఆ ఆర్టిసానల్ ఉత్పత్తులపైనే ఈ కథనం...
మనకు గతంలో ఇంపల్స్ ఐస్ క్రీమ్, టేక్–హోమ్ ఐస్ క్రీం అనే రెండు రకాలు అందుబాటులో ఉండేవి. వీటిలో టేక్–హోమ్ ఐస్ క్రీం మెజారిటీని మార్కెట్ వాటా కలిగి ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో పుట్టుకొచి్చన ఆర్టిసానల్ ఐస్ క్రీమ్‌లు శరవేగంగా పుంజుకుంటున్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం కరోనా అనంతరం చలా కాలం తర్వాత గత వేసవిలో ఆర్టిసానల్ ఐస్‌క్రీమ్స్ తమ మార్కెట్‌ని భారీగా ఆక్రమించాయి. అదే ఊపు ఈ వేసవిలోనూ కొనసాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆర్టిసానల్ అదుర్స్...
ఆర్టిసానల్ ఉత్పత్తులు కొన్నేళ్ల క్రితమే నగరవాసులకు అందుబాటులకి వచ్చాయి. ఇందులో పాలు, క్రీమ్, చక్కెర వంటి నాణ్యమైన, సహజమైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. వివిధ ప్లేవర్లు, కలర్ల కోసం పప్పులు, పండ్లను మాత్రమే ఉపయోగిస్తారు. ఉదాహరణకు స్ట్రాబెర్రీ అయితే స్ట్రాబెర్రీ పండ్లను, స్వీట్ పాన్ ఐస్‌క్రీమ్ అయితే స్వీట్‌పాన్‌ను, మ్యాంగో ఐస్‌క్రీమ్‌లో మామిడి పండ్లను వినియోగిస్తారు.
అయితే ఫ్లేవర్డ్ ఉత్పత్తుల్లా ఇవి 6–24 నెలల వరకూ నిల్వ ఉండవు. కేవలం 5–10 వారాలు మాత్రమే ఉంటాయి. ఈ ఐస్‌క్రీమ్‌లలో ఎలాంటి రసాయనాలూ లేవని నిర్ధారించడానికి వీలుగా అధిక–గ్రేడ్ ప్యాకేజింగ్‌లో వస్తాయి. గడ్డకట్టే ముందు, ఐస్‌క్రీం మిశ్రమాన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం వల్ల ఇవి సురక్షితంగా బ్యాక్టీరియా రహితంగా మారతాయి.
ఆర్టిసానల్‌కే ఆదరణ..
రుచితోపాటు ఆరోగ్యానికీ ప్రాధాన్యత ఇస్తున్నారు ఆహారప్రియులు. ఖరీదులో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆర్టిసనాల్ ఐస్‌క్రీమ్‌లనే ఇష్టపడుతున్నారు. ఒబెసిటీ సహా మరే ఇతర సమస్యలకూ దోహదం చేసే అవకాశం లేకపోవడం, పైగా పండ్లు, నట్స్ (పప్పులు) వంటివి వీటిలో విరివిగా వాడడం ఆరోగ్యానికి లాభదాయకం.
– ఎ. ప్రవీణ్‌కుమార్, సి గుస్తా ఐస్‌క్రీమ్ పార్లర్
విస్తృత శ్రేణి రుచులు..
ఎటువంటి భయాలు లేకుండా వినియోగదారులు తమ ఉత్పత్తులనే ఎంచుకోవాలనే లక్ష్యంతో పలు ఐస్‌క్రీమ్ బ్రాండ్స్ ఇప్పుడు ఇదే బాట పట్టాయి. దీంతో ఇవి 1–2 రుచులకు మాత్రమే పరిమితం కాకుండా వి్రస్తుతశ్రేణిలో లభ్యమవుతున్నారు. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఐస్ క్రీం తయారీదారులు డైరీ–ఫ్రీ నుంచి షుగర్–ఫ్రీ వరకూ ఆరోగ్యకరమైన ఉత్పత్తులపై దృష్టి సారిస్తున్నారు.
ఆరోగ్య స్పృహ కలిగిన యువత, మంచి రుచిని ఆస్వాదించాలనే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, తక్కువ కేలరీల ఐస్‌క్రీమ్ బార్‌లను కూడా పలు బ్రాండ్స్ అందిస్తున్నాయి. అలాంటి ఉత్పత్తుల్లో ప్రతి సరి్వంగ్‌కు కేవలం 89–99 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇతర సాధారణ ఐస్‌క్రీమ్‌లతో పోలిస్తే వీటిలో కొవ్వు 60% తక్కువగా ఉంటుంది.
రకరకాల థీమ్‌లతో..
నాంపల్లిలో రద్దీగా ఉండే ముజంజాహీ మార్కెట్ ప్రాంతంలో హ్యాండ్‌మేడ్ ఐస్‌క్రీమ్స్ లభిస్తున్నాయి. విశేషమేమిటంటే ఇక్కడ నాలుగు తరాల నుంచి నడుస్తున్న ఐస్ క్రీమ్ పార్లర్‌లు ఉన్నాయి. అంతేగాకుండా ఇక్కడ సీటింగ్ యూరప్ దేశాలను గుర్తుకుతెస్తోంది. అదే విధంగా జూబ్లీహిల్స్‌లోని డా.ఐస్ క్రీం పార్లర్, దాని పేరుకు తగ్గట్టుగా డాక్టర్ థీమ్‌తో ఉండే ఈ పార్లర్‌లో ఇక్కడ కొన్ని టాపింగ్స్ సిరంజిలను ఉపయోగించి మరీ అందిస్తారు.
వనిల్లా, చాక్లెట్ తదితర రుచుల నుంచి బిర్యానీ ఫ్లేవర్ వరకూ వెరైటీ రుచులకు ఇది ప్రసిద్ధి. అలాగే జూబ్లీహిల్స్‌లోనే ఉన్న మిలానో ఐస్‌క్రీమ్, అబిడ్స్‌లోని సాఫ్ట్ డెన్, రోస్ట్, సిగుస్తా, ఆల్మండ్ హౌస్.. వంటివి హెల్ధీ ఐస్‌క్రీమ్స్‌కి చిరునామాగా ఉన్నాయి. యూరోపియన్ శైలిలో అందిస్తే వీటినే ఇటాలియన్ నామం జిలాటోగా పేర్కొంటారు.
వీటితో ప్రమాదం..
సాధారణంగా మనకు పరిచయమున్న ఐస్‌క్రీమ్స్ ఒబెసిటీ తదితర జీవనశైలి వ్యాధులతో పాటు మరిన్ని ఆరోగ్య సమస్యలను తెచి్చపెట్టే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వీటికి రకరకాల రసాయనాలను మేళవించాల్సి ఉంటుంది. అలాగే ఐస్ స్ఫటికాలు ఏర్పడకుండా ఉండేందుకు ఐస్ క్రీములకు కారాజెనన్, ఎల్‌బిజి, గ్వార్, అకేసియా వంటివి కలుపుతారు. కొన్నిసార్లు మోనో–డిగ్లిజరైడ్స్‌ను కూడా కలుపుతారు.
ఇవి చదవండి: బోటీ.. లొట్టలేసీ..! 25 ఏళ్లుగా చెరగని టేస్ట్..!!
Comments
Please login to add a commentAdd a comment