icecream
-
హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీమ్ దందా..
-
'ఐసైపోతారు'..! సహజ రుచులకు ఆహారప్రియులు ఫిదా..
సాక్షి, సిటీబ్యూరో: ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? చిన్న పిల్లల నుంచి పండు ముసలి దాకా ఎగిరి గంతేస్తారు.. అనారోగ్య కారణాల రీత్యా, కృత్రిమ రంగుల వినియోగం వల్ల కొందరు దీనికి దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యం, ఆహారంపై కరోనా నేరి్పన గుణపాఠాన్ని నగరవాసులు బాగానే ఒంటబట్టించుకున్నారు. దీన్ని గ్రహించిన అమ్మకం దారులను నయా ట్రెండ్‌లో తమ వ్యాపారాలను అందిపుచ్చుకుంటున్నారు.ఆహార ప్రియుల మనసును గెలుచుకునేందుకు కొత్త తరహాలో సహజమైన పళ్ల రసాల నుంచి ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నారు. వీటిని ఆరగించిన ఆహార ప్రియులు ఐస్ ఐపోతున్నారంటే నమ్మండి.. కొత్త తరహాలో మార్కెట్‌ను ఆక్రమించికుంటున్న ఆ ఆర్టిసానల్ ఉత్పత్తులపైనే ఈ కథనం...మనకు గతంలో ఇంపల్స్ ఐస్ క్రీమ్, టేక్–హోమ్ ఐస్ క్రీం అనే రెండు రకాలు అందుబాటులో ఉండేవి. వీటిలో టేక్–హోమ్ ఐస్ క్రీం మెజారిటీని మార్కెట్ వాటా కలిగి ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో పుట్టుకొచి్చన ఆర్టిసానల్ ఐస్ క్రీమ్‌లు శరవేగంగా పుంజుకుంటున్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం కరోనా అనంతరం చలా కాలం తర్వాత గత వేసవిలో ఆర్టిసానల్ ఐస్‌క్రీమ్స్ తమ మార్కెట్‌ని భారీగా ఆక్రమించాయి. అదే ఊపు ఈ వేసవిలోనూ కొనసాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.ఆర్టిసానల్ అదుర్స్...ఆర్టిసానల్ ఉత్పత్తులు కొన్నేళ్ల క్రితమే నగరవాసులకు అందుబాటులకి వచ్చాయి. ఇందులో పాలు, క్రీమ్, చక్కెర వంటి నాణ్యమైన, సహజమైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. వివిధ ప్లేవర్లు, కలర్ల కోసం పప్పులు, పండ్లను మాత్రమే ఉపయోగిస్తారు. ఉదాహరణకు స్ట్రాబెర్రీ అయితే స్ట్రాబెర్రీ పండ్లను, స్వీట్ పాన్ ఐస్‌క్రీమ్ అయితే స్వీట్పాన్ను, మ్యాంగో ఐస్‌క్రీమ్‌లో మామిడి పండ్లను వినియోగిస్తారు.అయితే ఫ్లేవర్డ్ ఉత్పత్తుల్లా ఇవి 6–24 నెలల వరకూ నిల్వ ఉండవు. కేవలం 5–10 వారాలు మాత్రమే ఉంటాయి. ఈ ఐస్‌క్రీమ్‌లలో ఎలాంటి రసాయనాలూ లేవని నిర్ధారించడానికి వీలుగా అధిక–గ్రేడ్ ప్యాకేజింగ్‌లో వస్తాయి. గడ్డకట్టే ముందు, ఐస్‌క్రీం మిశ్రమాన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం వల్ల ఇవి సురక్షితంగా బ్యాక్టీరియా రహితంగా మారతాయి.ఆర్టిసానల్కే ఆదరణ.. రుచితోపాటు ఆరోగ్యానికీ ప్రాధాన్యత ఇస్తున్నారు ఆహారప్రియులు. ఖరీదులో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆర్టిసనాల్ ఐస్క్రీమ్లనే ఇష్టపడుతున్నారు. ఒబెసిటీ సహా మరే ఇతర సమస్యలకూ దోహదం చేసే అవకాశం లేకపోవడం, పైగా పండ్లు, నట్స్ (పప్పులు) వంటివి వీటిలో విరివిగా వాడడం ఆరోగ్యానికి లాభదాయకం.– ఎ. ప్రవీణ్‌కుమార్, సి గుస్తా ఐస్‌క్రీమ్ పార్లర్విస్తృత శ్రేణి రుచులు..ఎటువంటి భయాలు లేకుండా వినియోగదారులు తమ ఉత్పత్తులనే ఎంచుకోవాలనే లక్ష్యంతో పలు ఐస్‌క్రీమ్ బ్రాండ్స్ ఇప్పుడు ఇదే బాట పట్టాయి. దీంతో ఇవి 1–2 రుచులకు మాత్రమే పరిమితం కాకుండా వి్రస్తుతశ్రేణిలో లభ్యమవుతున్నారు. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఐస్ క్రీం తయారీదారులు డైరీ–ఫ్రీ నుంచి షుగర్–ఫ్రీ వరకూ ఆరోగ్యకరమైన ఉత్పత్తులపై దృష్టి సారిస్తున్నారు.ఆరోగ్య స్పృహ కలిగిన యువత, మంచి రుచిని ఆస్వాదించాలనే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, తక్కువ కేలరీల ఐస్‌క్రీమ్ బార్లను కూడా పలు బ్రాండ్స్ అందిస్తున్నాయి. అలాంటి ఉత్పత్తుల్లో ప్రతి సరి్వంగ్కు కేవలం 89–99 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇతర సాధారణ ఐస్‌క్రీమ్‌లతో పోలిస్తే వీటిలో కొవ్వు 60% తక్కువగా ఉంటుంది. రకరకాల థీమ్‌లతో..నాంపల్లిలో రద్దీగా ఉండే ముజంజాహీ మార్కెట్ ప్రాంతంలో హ్యాండ్‌మేడ్ ఐస్‌క్రీమ్స్ లభిస్తున్నాయి. విశేషమేమిటంటే ఇక్కడ నాలుగు తరాల నుంచి నడుస్తున్న ఐస్ క్రీమ్ పార్లర్లు ఉన్నాయి. అంతేగాకుండా ఇక్కడ సీటింగ్ యూరప్ దేశాలను గుర్తుకుతెస్తోంది. అదే విధంగా జూబ్లీహిల్స్‌లోని డా.ఐస్ క్రీం పార్లర్, దాని పేరుకు తగ్గట్టుగా డాక్టర్ థీమ్‌తో ఉండే ఈ పార్లర్లో ఇక్కడ కొన్ని టాపింగ్స్ సిరంజిలను ఉపయోగించి మరీ అందిస్తారు.వనిల్లా, చాక్లెట్ తదితర రుచుల నుంచి బిర్యానీ ఫ్లేవర్ వరకూ వెరైటీ రుచులకు ఇది ప్రసిద్ధి. అలాగే జూబ్లీహిల్స్లోనే ఉన్న మిలానో ఐస్‌క్రీమ్, అబిడ్స్‌లోని సాఫ్ట్ డెన్, రోస్ట్, సిగుస్తా, ఆల్మండ్ హౌస్.. వంటివి హెల్ధీ ఐస్క్రీమ్స్కి చిరునామాగా ఉన్నాయి. యూరోపియన్ శైలిలో అందిస్తే వీటినే ఇటాలియన్ నామం జిలాటోగా పేర్కొంటారు.వీటితో ప్రమాదం..సాధారణంగా మనకు పరిచయమున్న ఐస్‌క్రీమ్స్ ఒబెసిటీ తదితర జీవనశైలి వ్యాధులతో పాటు మరిన్ని ఆరోగ్య సమస్యలను తెచి్చపెట్టే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వీటికి రకరకాల రసాయనాలను మేళవించాల్సి ఉంటుంది. అలాగే ఐస్ స్ఫటికాలు ఏర్పడకుండా ఉండేందుకు ఐస్ క్రీములకు కారాజెనన్, ఎల్బిజి, గ్వార్, అకేసియా వంటివి కలుపుతారు. కొన్నిసార్లు మోనో–డిగ్లిజరైడ్స్ను కూడా కలుపుతారు.ఇవి చదవండి: బోటీ.. లొట్టలేసీ..! 25 ఏళ్లుగా చెరగని టేస్ట్..!! -
ఐస్‌క్రీంలో ఆ ‘ముక్క’ చూసి డాక్టర్‌కు కక్కొచ్చినంత పనైంది!
Human Finger Inside Cone Ice Cream ఫింగర చిప్స్ గురించి విన్నాం కానీ, ఐస్ కీంలో ఫింగర్ గురించి విన్నారా?ఆన్లైన్ ఆర్డర్ చేసుకొని చల్ల..చల్లగా.. ఐస్‌క్రీం తింటూ ఉండగా, గట్టిగా ఏదో తగిలినట్టైంది. దీంతో పరిశీలనగా చూడగా తెగిన మనిషి వేలు ముక్క కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాకైన సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. చదువుతోంటేనే.. యాక్ అనిపిస్తోంది కదా.. ముంబైలో జరిగిన ఈ షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. ముంబైలోని మలాడ్ ప్రాంత నివాసి డా. ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావ్ (27) బుధవారం ఆన్లైన్ డెలివరీ యాప్ ద్వారా బటర్‌స్కాచ్ కోన్ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేశాడు. ఆర్డర్ అందుకొని ఉత్సాహంగా తింటున్న సమయంలో నాలుకకు ఏదో గట్టిగా తగలడంతో ఏంటా? అని పరికించి చూశారు. అంతే ఒక్కసారిగా వాంతి వచ్చినంత పనైంది. 2 సెంటీమీటర్ల పొడవు ఉన్న మనిషి వేలి ముక్కను చూసి దిగ్భాంతికి లోనయ్యారు. దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఐస్‌క్రీం కంపెనీపై కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం ఐస్‌క్రీమ్‌లో లభించిన మానవ అవయవాన్ని పోలీసులు ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్)కు పంపినట్లు మలాడ్ పోలీసు అధికారులు తెలిపారు. This #Butterscotch ice cream was ordered online by a 27-year-old doctor in Mumbai, Orlem Brendan Serrao.He found a 2 cm piece of a human finger. Serrao had asked his sister to include the ice cream in her online grocery order. While enjoying the treat, he felt something… https://t.co/3uHXqorYIu pic.twitter.com/gbXFBqtH6U— Sneha Mordani (@snehamordani) June 13, 2024 తన అనుభవాన్ని బ్రెండన్ ఇలా షేర్ చేశారు. ‘ఉదయం నాసోదరి ఆన్లైన్ డెలివరీ యాప్ ద్వారా కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేస్తోంది.. దీంతో నేను మూడు బటర్‌స్కాచ్ కోన్ ఐస్‌క్రీమ్‌లను జాబితాలో చేర్చమని చెప్పాను. డెలివరీ రాగానే ఐస్‌క్రీం కోను ఆస్వాదిస్తుండగా ఈ భయంకరమైన అనుభవం ఎదురైంది’ అంటూ తెలిపారు. అయితే నిజంగానే ఇది మనషి ఫింగర్ ముక్కా, లేక మరేదైనా అనేది విచారణలో తేలనుంది. మరోవైపు ఈ వ్యవహారంపై ఐస్ క్రీం తయారీదారు ఇంకా స్పందించలేదు. -
ఐస్ క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిదా? పరిశోధన ఏం చెబుతోందంటే.!.
హిమ క్రీములు..అదేనండి చలచల్లని ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారుండరు. చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు అందరికీ ఇష్టమైనది ఈ ఐస్‌క్రీమ్. అయితే ఇది తింటే కొలస్ట్రాల్ వస్తుందన్న భయంతో తినడానికి భయపడుతుంటారు చాలామంది. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు వాటి జోలికి వెళ్లను కూడా వెళ్లరు. ఇందులో చక్కెర కంటెంట్ ఎక్కు ఉంటుందని, అది కాస్త చెడు కొలస్ట్రాల్‌గా మారుతుందని రకరకాల భయాలు ఉన్నాయి. కానీ అదేమీ నిజం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా తాజా అధ్యయనంలో ఐస్‌క్రీమ్ ఏమీ ఆరోగ్యానికి అంత భయానక నష్టం చేయదని తేలింది కూడా. నిజంగానే ఆరోగ్యానికి ఐస్‌క్రీమ్ మంచిదా? ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి తదితరాలు గురించి సవివరంగా తెలుసుకుందాం. ఐస్‌క్రీమ్ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి మూడు విధాలుగా అధ్యయనం చేశారు హార్వర్డ్ డాక్టరల్ విద్యార్థులు. ఆ పరిశోధనలో ఐస్‌క్రీం ఆరోగ్యానికి హానికరం కాదని, మంచి ప్రయోజనాల ఉన్నాయని తెలింది. చెప్పాలంటే ఈ పరిశోధన ఫలితాలు ఐస్‌క్రీంలా చల్లటి తియ్యని వార్తని అందించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు ఐస్‌క్రీం తోపాటు ఇంకా ఏమీ తీసుకుంటున్నారో గమనించి మరీ విశ్లేషించింది. పాల కొవ్వులు డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయా అనే దిశగా కూడా పరిశోధనలు చేశారు. ఈ అధ్యయనంలో డైరీ కొవ్వుల కంటే మాంసం, శుద్ధి చేసిన పిండి పదార్ధాలతో కార్డియోవాస్కులర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. అంతేగాదు దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడించింది. అవేంటంటే.. మెదడు అభివృద్ధికి రోజూ ఓ స్కూప్ ఐస్‌క్రీమ్ తీసుకోవడం వ్లల ప్రతికూల ప్రభావం ఉండదని పేర్కొంది. అంతేకాకుండా దీనివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఈ పరిశోధన తేల్చింది. ఐస్‌క్రీమ్ కాల్షియం, మెగ్నీషియం, బి12 విటమిన్లు, రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసే ప్రోటీన్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. పాలు, క్రీమ్ అనేవి ఐస్‌క్రీమ్‌లో ప్రధానంగా వినియోగిస్తారు. విటమిన్ ఎ, కోలిన్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంతో పాటు.. రోగనిరోధక శక్తి, మెదడు అభివృద్ధికి తోడ్పడుతున్నాయి వెల్లడించింది. ఒత్తిడి తగ్గించి మానసిక స్థితిని మెరుగుస్తుంది ఐస్‌క్రీమ్‌లు న్యూట్రీషియన్ రిచ్ ఫుడ్‌గా చెప్తున్నారు. దీనిలో న్యూట్రిషియన్లు, కాల్షియం, ప్రోటీన్, విటమిన్స్ ఉంటాయని ఇవి పూర్తి ఆరోగ్యానికి మంచివని చెప్తున్నారు. మానసికంగా దీనివల్ల ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. ఇది ఒత్తిడిని తగ్గించి మూడ్‌ని లిఫ్ట్ చేస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. సమ్మర్లో ఇవి శరీరానికి హైడ్రేషన్‌ని అందిస్తాయట. దీనివల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. బోన్స్‌ను హెల్తీగా మార్చడంలోనూ, స్కిన్ హైడ్రేషన్‌కి, జీర్ణక్రియలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం.. తాజా పరిశోధనలో పాలు డెయిరీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచవని తేలింది. అయినప్పటికీ.. పాలు, చీజ్, పెరుగు, ఐస్‌క్రీమ్ వంటి ఆరోగ్యకరమన ఎంపికల మధ్య తేడాను గుర్తించాలని చెప్తున్నారు. అయితే ఈ ఉత్పత్తుల్లో చక్కెర ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పెద్ద మొత్తంలో చక్కెర, ఫ్యాట్, కృత్రిమ స్వీటెనర్లు, గట్టిపడే పదార్థాలు వాటిలో వినియోగిస్తారని తెలిపారు. అందువల్ల స్వీట్ తక్కువగా ఉన్న బ్రాండెడ్ ఐస్‌క్రీంలు ఎంపిక చేసుకోవడం ఉత్తమం. మితంగా తింటే సమస్యల నిల్.. ఇవి ఆరోగ్యానికి ఎంత మంచివే అయినా.. వాటిని కంట్రోల్‌గా తీసుకోవడం మంచిది అంటున్నారు. డైటీషియన్లు రోజుకు గరిష్ఠంగా అరకప్పు తీసుకోవచ్చని చెప్తున్నారు. ఐస్ క్రీమ్‌ను మితంగా తీసుకుంటే.. ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు. ఏదీఏమైన దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే మాత్రం తీసుకునే క్వాంటింటీపై కచ్చితంగా శ్రద్ధ చూపించాలని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు ఈ పరిశోధన కేవలం ఐస్‌క్రీం ఆరోగ్యానికి హానికరం కాదని లేదా లాభలు ఉన్నాయని చెప్పడానికే చేసిందే తప్ప ఐస్‌క్రీం తినమని చెప్పేందుకు కాదు. అలాగే పరిశోధనలో ఎక్కువగా ఐసీక్రీం తింటే మధుమేహం, ప్రీడయాబెటిస్ మరియు PCOS తో ఉన్నవారికి సమస్యలను కలిగిస్తుందని, కేన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గ్రహించాలని చెప్పారు నిపుణులు. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. డైట్లో చేర్చుకునే ముందు మీ వ్యక్తిగత వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించి ఫాలో అవ్వడం ఉత్తమం. (చదవండి: అత్యంత ఖరీదైన టీకప్పు..ధర వింటే షాకవ్వుతారు!) -
టేస్టీగా..కూల్..కూల్‌గా, ఐస్ క్రీమ్స్ ఇలా చేస్తే పిల్లలు ఫిదా!
ఇంకా మార్చి నెల రాకముందే ఎండ సుర్రుమంటోంది. దీనికి తోడు పిల్లలకు గుర్తు రాకపోయినా సరే... మనింట్లో ఇడియట్స్‌బాక్స్ అదేనండీ.. టీవీ, రకరకాల ఐస్ క్రీమ్‌ల యాడ్స్‌తో ఊరిస్తూ ఉంటుంది. ఇక పిల్లలు ఊరుకుంటారా? అందుకే పిల్లలను పార్లర్‌కు పరుగు పెట్ట నివ్వకుండా.. ఇంట్లోనే కూల్ కూల్‌గా.. టేస్టీగా ఈజీగా ఐస్ క్రీమ్స్ తయారు చేసేద్దాం..! ఇంట్లోనే హెల్దీగా ఇలా ట్రై చేయండి ఆరెంజ్ ఐస్ క్రీమ్ కావలసినవి: చల్లటి పాలు – అర లీటరు (ఫుల్ క్రీమ్ టిన్డ్ మిల్క్); చక్కెర – 100 గ్రాములు; కార్న్‌ఫ్లోర్ – టేబుల్ స్పూన్; ట్యాంగ్ పౌడర్ – 3 టేబుల్ స్పూన్లు (ఆరెంజ్ ఫ్లేవర్); మీగడ – వంద గ్రాములు; ఆరెంజ్ ఎసెన్స్ – నాలుగు చుక్కలు. తయారీ: అర కప్పు పాలలో కార్న్‌ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బీటర్ లేదా ఫోర్క్‌తో బాగా కలపాలి. మరో పాత్రలో మిగిలిన పాలను పోసి చక్కెర వేసి అడుగు పట్టకుండా గరిటతో కలుపుతూ ఐదు నిమిషాల సేపు మరిగించాలి. ఇప్పుడు కార్న్‌ఫ్లోర్ కలిపిన పాలను వేసి కలుపుతూ మీడియం మంట మీద మరో ఐదు నిమిషాల సేపు మరిగించి దించేయాలి. పాలు చల్లారిన తర్వాత అందులో ట్యాంగ్ పౌడర్, క్రీమ్ వేసి బీటర్‌తో బాగా చిలకాలి. మృదువుగా తయారైన మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. ఆరు గంటల తర్వాత తీసి మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసి తిరిగి అదే పాత్రలో పోసి మళ్లీ అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. పది గంటల సేపు ఉంచితే ఐస్‌క్రీమ్ గట్టిగా సెట్ అయి ఉంటుంది. ఇప్పుడు కప్పులో వేసి సర్వ్ చేయాలి. చాక్లెట్ చిప్ ఐస్ క్రీమ్ కావలసినవి: మీగడ 2 కప్పులు; పాలు 3 టేబుల్ స్పూన్లు; కోకో పౌడర్-3 టేబుల్ స్పూన్లు; కండెన్స్డ్ మిల్క్- అర కప్పు; చాకొలెట్ చిప్స్ -కప్పు; బ్రౌన్ షుగర్-కప్పులో మూడవ వంతు (బ్లీచ్ చేయని చక్కెర, అది లేకపోతే మామూలు చక్కెర తీసుకోవచ్చు) తయారీ: ∙మీగడను పన్నెండు గంటల సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ∙వెడల్పుగా ఉన్నపాత్రలో పాలు పోసి చిన్న మంట మీద వేడి చేయాలి. పాలు మరగాల్సిన అవసరం లేదు, వేడయితే చాలు (పాశ్చరైజేషన్ జరగని పాలయితే మరిగించి వేడి తగ్గే వరకు పక్కన ఉంచి గోరువెచ్చగా ఉన్నప్పుడు వాడాలి). అందులో కోకో పౌడర్ వేసి బీటర్‌తో కలపాలి. ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేసి మొత్తం కలిసే వరకు బీటర్‌తో చిలకాలి. ఇప్పుడు చక్కెర వేసి చిన్న మంట మీద వేడి చేస్తూ కరిగే వరకు చిలకాలి. చక్కెర కరిగిన తర్వాత దించేసి చల్లారే వరకు మిశ్రమాన్ని పక్కన ఉంచాలి. ఫ్రిజ్‌లో ఉన్న మీగడను బయటకు తీసి సమంగా కలిసే వరకు చిలకాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసుకుని పక్కన ఉంచిన కోకో మిశ్రమాన్ని మీగడలో వేసి చిలికినట్లు కాకుండా నిదానంగా కలపాలి. ఇప్పుడు చాకొలెట్ చిప్స్ వేసి ఒకసారి కలిపి (చాకొలెట్ చిప్స్ అన్నీ ఐస్‌క్రీమ్‌లో ఒకచోట చేరకుండా అక్కడొకటి అక్కడొకటి వచ్చేటట్లు కలిపితే చాలు) మిశ్రమం మొత్తాన్ని ఒక ట్రేలో పోసి అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. పది గంటల తర్వాత ట్రేని బయటకు తీసి ఐదారు నిమిషాల తర్వాత అల్యూమినియం ఫాయిల్ తొలగించి ఐస్‌క్రీమ్‌ని కప్పుల్లో వేసి సర్వ్ చేయాలి. వెనీలా ఐస్ క్రీమ్ కావలసినవి: కండెన్స్డ్ మిల్క్ -400 గ్రా; చిక్కటి మీగడ – 200 గ్రా; వెనీలా ఎక్స్ట్రాక్ట్ - 2 టీ స్పూన్లు. తయారీ: ఐస్‌క్రీమ్ తయారు చేయడానికి ముందు రోజు రాత్రి మీగడను ఫ్రీజర్‌లో పెట్టాలి. అలాగే ఒక ఖాళీ పాత్రను కూడా ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరచాలి. కనీసం పది లేదా పన్నెండు గంటలసేపు ఉంచాలి. ∙ఫ్రిజ్‌లో నుంచి తీసిన తరవాత మీగడను ఫ్రిజ్‌లో చల్లబరిచిన పాత్రలో వేసి ఏడు లేదా ఎనిమిది నిమిషాల సేపు చిలకాలి. చిలికేటప్పుడు మొదట మెల్లగా చిలుకుతూ క్రమంగా వేగం పెంచాలి. ఆ తరవాత అందులో కండెన్స్డ్ మిల్క్ వేసి మెల్లగా చిలకాలి. ఈ మిశ్రమాన్ని ఒక ట్రేలో పోసి సమంగా సర్ది అల్యూమినియం ఫాయిల్ పేపర్ అమర్చి అంచులకు క్లిప్ పెట్టాలి. పేపర్ ఐస్ క్రీమ్ మిశ్రమంలోకి జారి పోకుండా ఈ ఏర్పాటు. ఈ ట్రేని పన్నెండు గంటల సేపు ఫ్రీజర్‌లో ఉంచాలి. ఫ్రీజర్‌లో నుంచి బయటకు తీసిన తర్వాత ఐదారు నిమిషాల సేపు కదిలించకూడదు. ఆ తర్వాత ట్రే మీద కవర్ చేసిన అల్యూమినియం ఫాయిల్‌ని తొలగించి ఐస్‌క్రీమ్‌ని పెద్ద స్పూన్‌తో తీసి కప్పుల్లో వేసి సర్వ్ చేయాలి. ఈ ఐస్ క్రీమ్ కోసం స్టవ్ వెలిగించే పనే లేదు. కావలసిన వస్తువులన్నీ రెడీమేడ్‌గా దొరికేవే కాబట్టి పిల్లలు కూడా పెద్దవాళ్ల సహాయం లేకుండా సొంతంగా చేసుకోవచ్చు. -
ఎవరూలేని సమయంలో.. 'డెత్‌నోట్' రాసి.. విషాద నిర్ణయం!
సాక్షి, కర్ణాటక: వరకట్న వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన మహిళా టెక్కీ కేసులో శుక్రవారం గోవిందరాజనగర పోలీసులు ఐదుమందిని అరెస్ట్‌చేశారు. భర్త రాజేశ్, మామ గిరియప్ప, అత్త సీతా, విజయ్, తస్మితాను కటకటాల వెనక్కు పంపారు. అమెరికాలో ఎంబీఏ చదివిన ఐశ్వర్య(26)కు డైరీరీచ్ ఐస్‌క్రీమ్ కంపెనీ యజమాని రాజేశ్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఐశ్వర్య తండ్రి సుబ్రమణి చెల్లెలి భర్త రవీంద్ర.. రాజేశ్ కంపెనీలో ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇతనే రాజేశ్‌కు పెళ్లి సంబంధం చూశాడు. మూడునాలుగేళ్లు ఇరుకుటుంబాలు సంతోషంతో అన్యోన్యంగా ఉన్నాయి. ఆస్తి విషయంలో రవీంద్ర, సుబ్రమణి కుటుంబాల్లో గొడవలు ఏర్పడ్డాయి. ఐశ్వర్య తండ్రిపై కోపంతో రవీంద్ర ఐశ్వర్య సంసారంలో నిప్పులు పోశారు. ఐశ్వర్యపై రాజేశ్‌కు లేనిపోని అబద్దాలు చెప్పి దంపతుల మధ్య గొడవలు పెట్టాడు. దీంతో రాజేశ్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యను వేధించారు. అయినప్పటికీ ఐశ్వర్య సహనం కోల్పోలేదు. ఉద్యోగం చేసిన సంపాదనలో భర్తకు విలాసవంతమైన బైకు, బంగారు ఆభరణాలు అందించింది. కానీ కుటుంబ సభ్యులు మాటలు విని రాజేశ్ దూషణలకు పాల్పడటంతో ఐశ్వర్య 20 రోజుల క్రితం విజయనగరలోని పుట్టింటికి చేరుకుంది. గతనెల 26 తేదీన ఇంట్లో ఎవరూలేని సమయంలో డెత్‌నోట్‌రాసి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె మృతికి అల్లుడు, కుటుంబసభ్యులే కారణమని పలువురు పేర్లతో గోవిందరాజనగర పోలీస్‌స్టేషన్‌లో ఐశ్వర్య తండ్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐశ్వర్య భర్తతో పాటు కుటుంబసభ్యులను అరెస్ట్‌చేసి విచారణ చేపడుతున్నారు. ఐశ్వర్య ఆత్మహత్యకు పాల్పడిన అనంతరం భర్త రాజేశ్, తల్లిదండ్రులు గిరియప్ప, సీతా, విజయ్, తస్మిన్ గోవా, ముంబైలో పార్టీ చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: వివాహేతర సంబంధంతో.. ప్రియురాలి మోజులో.. భార్యను కిరాతకంగా.. -
అనుమతులు లేకుండా ఐస్‌క్రీములు తయారుచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్
-
ఐస్‌క్రీం కొనడానికి వచ్చి ఏం చేశాడో తెలుసా... నవ్వాగదు!
చాలా సార్లు దుకాణాల్లో అమ్మే వ్యక్తులను ఏదోరకంగా వస్తువులను పట్టుకువెళ్లిపోయే వాళ్లను చూసే ఉంటాం. అంతేందుకు చాలా మటుకు అమ్మేవాణ్ణి ఏదోరకంగా మాయ చేసి ఇచ్చిన రేటుకుంటే ఎక్కవ వస్తువులను తీసుకుపోయే వాళ్లను కూడా చూసి ఉంటాం. ఇలా బహిరంగంగా అందరూ చూస్తుండగా, అదీ కూడా షాపింగ్ మాల్లో ఒక టర్కీష్ ఐసీక్రీంని పట్టుకుపోతాడు. అది ఎక్కడ జరిగిందో ఏంటో అని ఆలోచింకండి చదివేయండి. (చదవండి: బంపర్ ఆఫర్....వ్యాక్సిన్ తీసుకో..బహుమతి పట్టు) ఒక షాపింగ్ మాల్లో ఒక టర్కిష్ ఐస్‌క్రీం దుకాణదారుడు అత్యంత నైపుణంగా ఐస్‌క్రీం కోన్‌పై ఐస్క్రీంని చాలా వెరైటీగా అలంకరిస్తాడు. అందుకోసం అని ఒక కస్టమర్ ఆ దుకాణదారుడు వద్దకు వచ్చి నిలబడతాడు. ఆ వ్యాపారి ఒక కోన్ తీసుకుని పట్టుకోమని సదరు వ్యక్తికి ఇస్తాడు. ఇంతలో సదరు వ్యాపారి చాలా నైపుణ్యంతో ఐస్క్రీ పెడదామని చూస్తుండగానే కొనడానికి వచ్చిన ఆ వ్యక్తి ఆ ఐస్క్రీంని మొత్తం తీసుకుని పట్టకుపోతాడు. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా చప్పట్లు కొడతూ నవ్వుతుంటారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి చూడండి. (చదవండి: యాహూ! నేను పగలుగొట్టేశాను) -
దెబ్బకు ఠా.. ఐస్‌క్రీమ్ తూటా!
ఓ పోలీసు అధికారి చేతిలో ఐస్‌క్రీమ్ కోన్‌తో దొంగలను తరిమికొట్టినట్లు ఉన్న ఒక వీడియో ఇటీవల నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఉరుగ్వేలోని ఓ ఐస్‌క్రీమ్ షాప్‌లో ఆఫ్ డ్యూటీ పోలీసు అధికారి తన కొడుకుతో కలిసి ఐస్‌క్రీమ్ తింటున్నాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చి వారి టేబుల్ వద్ద కూర్చున్నారు. వారిలో ఒకడు తన జేబులో చెయ్యిపెట్టి దేనికోసమో వెదుకుతున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఆ పోలీస్ వెంటనే అప్రమత్తమయ్యి తుపాకీతో ఇద్దరిపై కాల్పులు జరిపాడు. ఇంత చేస్తున్నా మరో చేతిలోని ఐస్‌క్రీమ్‌ను వదలక పోవడంతో ఈ వీడియో తెగ వైరలయ్యింది. సయాగో పరిసర ప్రాంతంలో రాత్రి 11.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై రావడాన్ని గమనించానని, ఇది దోపిడి కావచ్చని అనుమానం రావడంతో తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీస్ అధికారి సుబ్రాయాడో తెలిపారు. కాల్పులు తరువాత దొంగలు ఇద్దరూ మోటారు సైకిల్ వదిలి పారిపోయారన్నారు. అయితే, వారిలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో కొద్దిదూరంలోనే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. గాయపడిన అతడిని హాస్పటల్‌కు తరలించామని, ఛాతీకి తగిలిన బుల్లెట్‌ను వైద్యులు తొలగించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని సుబ్రాయాడో తెలిపారు. చికిత్స పొందుతున్న స్నేహితుడిని చూసేందుకు వచ్చిన సహచరుడిని కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. -
తెలంగాణలో హట్సన్ ఐస్‌క్రీమ్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చెన్నైకి చెందిన పాలు, పాల ఉత్పత్తుల కంపెనీ హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్... తెలంగాణలో అతిపెద్ద ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. రూ.207 కోట్ల పెట్టుబడులతో సంగారెడ్డి జిల్లాలోని గోవింద్‌పూర్‌లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 250 మందికి ఉద్యోగాలతో పాటు, పరోక్షంగా మరో 250 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, స్థానికంగా ఉన్న సుమారు 4 వేల మంది పాడి రైతులు ప్రయోజనం పొందుతారని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ప్లాంట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది అక్టోబర్ నాటికి ప్లాంట్ కార్యకలాపాలు ఆరంభమవుతాయని పేర్కొంది. హట్సన్ సంస్థ అరుణ్ ఐస్ క్రీమ్, హట్సన్, ఆరోక్య మిల్క్, ఐబాకో ఐస్‌క్రీమ్స్, ఓయాలో, అనీవా, సంటోసా బ్రాండ్లతో పాలు, పెరుగు, ఐస్‌క్రీమ్స్, నెయ్యి, పన్నీర్ వంటి అన్ని రకాల పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ కార్యకలాపాల్లో ఉంది. మన దేశంలో విక్రయించడంతో పాటు అమెరికా, మధ్యప్రాచ్యం వంటి 38 దేశాలకు ఎగుమతులూ చేస్తోంది. -
ఐస్‌క్రీమ్ అమ్మిన మంత్రి కేటీఆర్
-
ఐస్‌క్రీమ్ అమ్మిన మంత్రి కేటీఆర్
-
ఐస్‌క్రీమ్ అమ్మిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : టీఆర్ఎస్ కూలీ దినాల్లో భాగంగా ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు కూలీ పని చేశారు. కొంపల్లిలోని ఓ ఐస్‌క్రీమ్ పార్లర్లో శుక్రవారం ఆయన ఐస్‌క్రీమ్ అమ్మి రూ.లక్షలు సంపాదించారు. ఒక ఐస్‌క్రీమ్‌కు ఎంపీ మల్లారెడ్డి రూ.5 లక్షలకు కొనగా, మరో ఐస్‌క్రీమ్‌కు స్థానిక నేత శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి రూ.లక్ష చెల్లించారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్‌లో ఈనెలలో జరగనున్న బహిరంగ సభకు విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ ఐస్ క్రీమ్ అమ్మారు. అలాగే కుత్బుల్లాపూర్‌లో కేటీఆర్ జ్యూస్, ఐస్‌క్రీమ్ అమ్మారు. ఓ భవన నిర్మాణంలో కాసేపు ఇంజినీర్‌గా పనిచేశారు. మొత్తం 25 నిమిషాల పనికి మంత్రి కేటీఆర్‌కు రూ.7.30 లక్షల కూలి గిట్టుబాటు అయింది. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, బాల్క సుమన్, వివేకానంద, శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ఆనంతరం అక్కడి బస్తీవాసులతో ముచ్చటించారు. టీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పార్టీ నేతలను, ప్రజలను కోరారు. కాగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గులాబీ కూలీ దినాలుగా పాటించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. 21న టీఆర్ఎస్ ప్లీనరీని అదేవిధంగా 27వ తేదీన వరంగల్‌లో భారీ బహిరంగ సభ సందర్భంగా కార్యకర్తలు, పార్టీ నేతలు శ్రమదానం చేసి ప్లీనరీ, బహిరంగ సభకు విచ్చేసే నిమిత్తం ఎవరి సొంత ఖర్చులకు వారే సంపాదించుకోవాలని సూచించారు. దీంతో మంత్రి కేటీఆర్ మరో రెండు రోజులు నగరంలో కూలీ పనులు చేయనున్నారు. -
రామ్ గోపాల్ వర్మ' ఐస్ క్రీమ్ మూవీ పోస్టర్స్
-
'రామ్ గోపాల్ వర్మ' ఐస్ క్రీమ్ మూవీ స్టిల్స్