హిమ క్రీములు..అదేనండి చలచల్లని ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారుండరు. చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు అందరికీ ఇష్టమైనది ఈ ఐస్‌క్రీమ్. అయితే ఇది తింటే కొలస్ట్రాల్ వస్తుందన్న భయంతో తినడానికి భయపడుతుంటారు చాలామంది. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు వాటి జోలికి వెళ్లను కూడా వెళ్లరు. ఇందులో చక్కెర కంటెంట్ ఎక్కు ఉంటుందని, అది కాస్త చెడు కొలస్ట్రాల్‌గా మారుతుందని రకరకాల భయాలు ఉన్నాయి. కానీ అదేమీ నిజం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా తాజా అధ్యయనంలో ఐస్‌క్రీమ్ ఏమీ ఆరోగ్యానికి అంత భయానక నష్టం చేయదని తేలింది కూడా. నిజంగానే ఆరోగ్యానికి ఐస్‌క్రీమ్ మంచిదా? ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి తదితరాలు గురించి సవివరంగా తెలుసుకుందాం.
ఐస్‌క్రీమ్ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి మూడు విధాలుగా అధ్యయనం చేశారు హార్వర్డ్ డాక్టరల్ విద్యార్థులు. ఆ పరిశోధనలో ఐస్‌క్రీం ఆరోగ్యానికి హానికరం కాదని, మంచి ప్రయోజనాల ఉన్నాయని తెలింది. చెప్పాలంటే ఈ పరిశోధన ఫలితాలు ఐస్‌క్రీంలా చల్లటి తియ్యని వార్తని అందించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు ఐస్‌క్రీం తోపాటు ఇంకా ఏమీ తీసుకుంటున్నారో గమనించి మరీ విశ్లేషించింది. పాల కొవ్వులు డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయా అనే దిశగా కూడా పరిశోధనలు చేశారు. ఈ అధ్యయనంలో డైరీ కొవ్వుల కంటే మాంసం, శుద్ధి చేసిన పిండి పదార్ధాలతో కార్డియోవాస్కులర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. అంతేగాదు దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడించింది. అవేంటంటే..
మెదడు అభివృద్ధికి
రోజూ ఓ స్కూప్ ఐస్‌క్రీమ్ తీసుకోవడం వ్లల ప్రతికూల ప్రభావం ఉండదని పేర్కొంది. అంతేకాకుండా దీనివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఈ పరిశోధన తేల్చింది. ఐస్‌క్రీమ్ కాల్షియం, మెగ్నీషియం, బి12 విటమిన్లు, రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసే ప్రోటీన్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. పాలు, క్రీమ్ అనేవి ఐస్‌క్రీమ్‌లో ప్రధానంగా వినియోగిస్తారు. విటమిన్ ఎ, కోలిన్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంతో పాటు.. రోగనిరోధక శక్తి, మెదడు అభివృద్ధికి తోడ్పడుతున్నాయి వెల్లడించింది.
ఒత్తిడి తగ్గించి మానసిక స్థితిని మెరుగుస్తుంది
ఐస్‌క్రీమ్‌లు న్యూట్రీషియన్ రిచ్ ఫుడ్‌గా చెప్తున్నారు. దీనిలో న్యూట్రిషియన్లు, కాల్షియం, ప్రోటీన్, విటమిన్స్ ఉంటాయని ఇవి పూర్తి ఆరోగ్యానికి మంచివని చెప్తున్నారు. మానసికంగా దీనివల్ల ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. ఇది ఒత్తిడిని తగ్గించి మూడ్‌ని లిఫ్ట్ చేస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. సమ్మర్లో ఇవి శరీరానికి హైడ్రేషన్‌ని అందిస్తాయట. దీనివల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. బోన్స్‌ను హెల్తీగా మార్చడంలోనూ, స్కిన్ హైడ్రేషన్‌కి, జీర్ణక్రియలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.
హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం..
తాజా పరిశోధనలో పాలు డెయిరీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచవని తేలింది. అయినప్పటికీ.. పాలు, చీజ్, పెరుగు, ఐస్‌క్రీమ్ వంటి ఆరోగ్యకరమన ఎంపికల మధ్య తేడాను గుర్తించాలని చెప్తున్నారు. అయితే ఈ ఉత్పత్తుల్లో చక్కెర ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పెద్ద మొత్తంలో చక్కెర, ఫ్యాట్, కృత్రిమ స్వీటెనర్లు, గట్టిపడే పదార్థాలు వాటిలో వినియోగిస్తారని తెలిపారు. అందువల్ల స్వీట్ తక్కువగా ఉన్న బ్రాండెడ్ ఐస్‌క్రీంలు ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
మితంగా తింటే సమస్యల నిల్..
ఇవి ఆరోగ్యానికి ఎంత మంచివే అయినా.. వాటిని కంట్రోల్‌గా తీసుకోవడం మంచిది అంటున్నారు. డైటీషియన్లు రోజుకు గరిష్ఠంగా అరకప్పు తీసుకోవచ్చని చెప్తున్నారు. ఐస్ క్రీమ్‌ను మితంగా తీసుకుంటే.. ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు. ఏదీఏమైన దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే మాత్రం తీసుకునే క్వాంటింటీపై కచ్చితంగా శ్రద్ధ చూపించాలని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు ఈ పరిశోధన కేవలం ఐస్‌క్రీం ఆరోగ్యానికి హానికరం కాదని లేదా లాభలు ఉన్నాయని చెప్పడానికే చేసిందే తప్ప ఐస్‌క్రీం తినమని చెప్పేందుకు కాదు. అలాగే పరిశోధనలో ఎక్కువగా ఐసీక్రీం తింటే మధుమేహం, ప్రీడయాబెటిస్ మరియు PCOS తో ఉన్నవారికి సమస్యలను కలిగిస్తుందని, కేన్సర్‌లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గ్రహించాలని చెప్పారు నిపుణులు.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. డైట్‌లో చేర్చుకునే ముందు మీ వ్యక్తిగత వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించి ఫాలో అవ్వడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment