చుట్టుముట్టే ఆరోగ్య సమస్యలు మనకు పరోక్షంగా మంచి జీవనశైలి అవలంభించమని సంకేతమిస్తుంటాయి. మన శరీరం చెప్పే మాట వింటే ఆరోగ్యం, బరువు మన చేతిలో ఉంటుంది. లేదంటే అధిక బరువుతో లేనిపోని అనారోగ్య సమస్యలతో సతమతమవ్వక తప్పదు. కనీసం అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడే మేల్కొని మంచి ఆహారపు అలవాట్లతో బరువు తగ్గేందుకు ఉపక్రమించి ఎందరికో స్ఫూరిగా నిలుస్తున్నారు కొందరు. అచ్చం అలానే బరువు తగ్గి ఆరోగ్యంలో రాజీ ఉండకూడదని చాటి చెప్పి శెభాష్ అనిపించుకుంది ఈ మహిళ.
ఆ మహిళ పేరు రాజీ ఘంఘాస్. ఆమె జనవరి 2024లో సుమారు 155 కిలోల బరువుతో పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతుండేది. భారీకాయం వల్ల కొద్ది దూరం నడకకే ఆయాస పడిపోతుండేది. అలాగే ఈ అధిక బరువు కారణంగా ఆమె రూపం అసహ్యంగా మారడమే గాక ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయి. అధిక బరువు, హర్మోన్ల అసమతుల్యత, క్రమరహిత రుతుక్రమం, ప్రీ డయాబెటిక్ వంటి సమస్యలను ఎదుర్కొంది.
ఆమెను చూస్తే పెద్దన్నాళ్లు ఈ బరువుతో బతకదేమో అనేంతలా ఇబ్బందులుపడింది. అప్పుడే రాజీ అనుకుంది భగవంతుడి ఇచ్చిన రూపం మార్చలేను, కానీ అనారోగ్యాన్ని భరిస్తూ మాత్రం చావలేను అని గట్టిగా నిర్ణయించుకుంది. ముందు అందం కంటే ఆరోగ్యంగా ఉండటమే ప్రధానం, పైగా అది తన చేతిలో ఉన్న అవకాశం అని గ్రహించింది రాజీ.
ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మంచి ఆహారపు అలవాట్లను అనుసరించింది. ముఖ్యంగా ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చింది. "రోజుని మెంతులు, యాలకులతో ఉడికించిన గోరువెచ్చని డిటాక్స్ వాటర్‌తో ప్రారంభించేది. అల్పహారంగా కూరగాయలతో నిండిన పోహా వంటివి తీసుకునేది. మధ్యాహ్నం చియా గింజల నీరు, ఓట్స్ తీసుకునేది. సాయంత్రం: గ్రీన్ టీ, మొక్కజొన్న చాట్. ఇక రాత్రికి కూరగాయలతో చేసిన శాండ్‌విచ్‌లు, డిటాక్స్ నీరు తీసుకునేది.
క్రమం తప్పకుండా ఈ డైట్‌ని అనుసరించింది. తన అధిక బరువుతో ఎదురవ్వుతున్న ఆరోగ్య సమస్యలు గుర్తొచ్చి చీట్‌మీల్‌కి చోటివ్వకుండా నిబద్ధతతో ఆరోగ్యకరమైన డైట్‌ని అనుసరించింది రాజీ". అలా ఒక్క ఏడాదికే 60 కిలోలు తగ్గి 95కిలోల బరువుకి చేరింది.
అయితే వెయిట్ లాస్ జర్నీ మగియలేదని అంతలా 155 కిలోల బరువు ఉన్న తాను ఇంతలా బరువు తగ్గుతానని కలలో కూడా ఊహించలేదని ఆనందంగా చెబుతోంది రాజీ. ఆరోగ్యకరమైన బరువు చేరుకునేవరకు తన వెయిట్ లాస్ జర్నీ ఆగదని సోషల్ మీడియా వేదికగా తన అనుభవాల్ని షేర్ చేసుకుంది.
(చదవండి: సింగిల్ పేరెంటింగ్ సవాలుని సులభంగా అధిగమించండిలా..!)
Comments
Please login to add a commentAdd a comment