డ్రగ్స్ వలన కలిగే దుష్పరిమాణాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు స్టేషన్‌ఘన్‌పూర్ సీపీ
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్ధాం.
స్టేషన్‌ఘన్‌పూర్: ఎవరైనా సరె డ్రగ్స్ తీసుకున్నా.. విక్రయించినా, నిల్వ ఉంచుకున్నా శిక్షలు తప్పవని స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీంశర్మ అన్నారు. మండలంలోని శివునిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం సీపీ ఆదేశాల మేరకు డ్రగ్స్ వలన కలిగే దుష్పరిమాణాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం యువత డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని, ఇలా వాడుతూ దొరికితే జీవితంలో ప్రభుత్వ ఉద్యోగానికి పనికి రాకుండా అవుతారన్నారని, అందుకు డ్రగ్స్ వాడి జీవితాలను నాషనం చేసుకోవద్దని సూచించారు. సీఐ రాజు, ఎస్సైలు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
రఘునాథపల్లి: విద్యార్థులు గంజాయి లాంటి మత్తు పరార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని జనగామ రూరల్ సీఐ శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. సోమవారం మండలంలోని వెల్ది మోడల్ స్కూల్ విద్యార్థులకు గంజాయి, ఇతర మత్తు పదార్థాలతో కలిగే అనర్దాలపై ప్రిన్సిపాల్ వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
మత్తు పదార్థాలు సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలతో పాటు విలువైన జీవితం అందకారం కానుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఎస్సై దూదిమెట్ల నరేశ్ ఉన్నారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్ధాం.
పాలకుర్తి టౌన్: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని పాలకుర్తి సీఐ గట్ల మహేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్ సీపీ అదేశాల మేరకు మండలంలోని గూడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment