Station ghanpur
-
పాత రోజులు మర్చిపో.. కడియంకు రాజయ్య వార్నింగ్
సాక్షి, జనగామ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంత చూసే వరకు నిద్రపోను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం పప్పులు కాంగ్రెస్‌లో ఉడకడం లేదు.. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.తాజాగా స్టేషన్ ఘనపూర్‌లో రైతు దీక్షలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజయ్య మాట్లాడుతూ..‘నా నోటికాడి బుక్కను గుంజుకొని తిన్న వ్యక్తి కడియం శ్రీహరి. ఆయన అంత చూసే వరకు నిద్రపోను. నియోజకవర్గంలో అభివృద్ధి ఏమాత్రం లేదు. ఉన్నది అవకాశవాదం మాత్రమే ఉంది. పార్టీ మారిన పది మంది కుక్కిన పేనులా ఉంటే.. కడియం మాత్రం కుమ్మరి పురుగుల తిరుగుతున్నాడు. కడియం పప్పులు కాంగ్రెస్ పార్టీలో ఉడకవు.పాత రోజులు మర్చిపో.. అక్రమ కేసులు పెడితే సహించేది లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది. మంత్రులు ఎవరికి వారే దుకాణాలు తెరుచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి సైతం వసూళ్లు కొనసాగిస్తున్నారు. క్యాబినెట్ మొత్తం తోడుదొంగలే ఉన్నారు. తెలంగాణను దోచుకుంటున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.ఇదిలా ఉండగా.. స్టేషన్ ఘనపూర్‌లో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు సీటు విషయంలో వీరి మధ్య గట్టి పోటీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్‌పై పోటీ చేసిన కడియం విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కడియం బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తం గూటికి చేర్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుడు రాజయ్య.. కడియంను టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. -
డ్రగ్స్ తీసుకున్నా.. విక్రయించినా శిక్షలు తప్పవు
స్టేషన్‌ఘన్‌పూర్: ఎవరైనా సరె డ్రగ్స్ తీసుకున్నా.. విక్రయించినా, నిల్వ ఉంచుకున్నా శిక్షలు తప్పవని స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీంశర్మ అన్నారు. మండలంలోని శివునిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం సీపీ ఆదేశాల మేరకు డ్రగ్స్ వలన కలిగే దుష్పరిమాణాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం యువత డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని, ఇలా వాడుతూ దొరికితే జీవితంలో ప్రభుత్వ ఉద్యోగానికి పనికి రాకుండా అవుతారన్నారని, అందుకు డ్రగ్స్ వాడి జీవితాలను నాషనం చేసుకోవద్దని సూచించారు. సీఐ రాజు, ఎస్సైలు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.రఘునాథపల్లి: విద్యార్థులు గంజాయి లాంటి మత్తు పరార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని జనగామ రూరల్ సీఐ శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. సోమవారం మండలంలోని వెల్ది మోడల్ స్కూల్ విద్యార్థులకు గంజాయి, ఇతర మత్తు పదార్థాలతో కలిగే అనర్దాలపై ప్రిన్సిపాల్ వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.మత్తు పదార్థాలు సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలతో పాటు విలువైన జీవితం అందకారం కానుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఎస్సై దూదిమెట్ల నరేశ్ ఉన్నారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్ధాం.పాలకుర్తి టౌన్: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని పాలకుర్తి సీఐ గట్ల మహేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్ సీపీ అదేశాల మేరకు మండలంలోని గూడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నాన్నే నా ధైర్యం
‘సాధించాలన్న పట్టుదల, ఆశయ సాధన కోసం శ్రమించే తీరు.. ఇవన్నీ నాన్న నాకు ఇచ్చిన ఆస్తులు. ముక్కుసూటిగా మాట్లాడే నాన్నంటే ఇప్పటికీ ఎంతో ఇష్టం. ఆయనే నా ధైర్యం.. నాన్న పక్కన ఉంటే కొండంత అండ ఉంటుందనిపిస్తుంది’ అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అంటున్నారు. కూతురిని తన వారసురాలిగా రాజకీయాల్లోకి తీసుకురావాలని, తనలా ప్రజాప్రతినిధి చేయాలన్న తండ్రి కల నెరవేరింది. మొదటినుంచి తన వెన్నెముకగా నిలిచి కూతురిని రాజకీయ అరంగ్రేటం చేయించి పక్కా ప్రణాళికతో విజయం సాధించారు. తండ్రి ఆశయం మేరకు కూతురు కావ్య ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి వరంగల్ రెండో మహిళా పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికై చట్టసభల్లో అడుగుపెట్టారు. నేడు (ఆదివారం) ఫాదర్స్ డేని పురస్కరించుకుని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఆమె తండ్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో ఉన్న ఆప్యాయత, అనుబంధాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. హన్మకొండ చౌరస్తా: మేము నాన్నకు ముగ్గురు కావ్య, దివ్య, రమ్య కూతుళ్లం. నాన్న హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహించేవారు. సరిగ్గా నేను ఏడో తరగతి చదువుతున్న సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో వచ్చారు. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినప్పటికీ నాన్న మా ముగ్గురిని చాలా గారాబంగా పెంచి, చదివించారు. ముగ్గురు ఆడపిల్లలు అన్న సామాజిక అంశం అక్కడక్కడ ప్రస్తావన వచ్చేది. అప్పుడు మానాన్న ఒక్కటే చెప్పేవారు నాకు ముగ్గురు మహాలక్ష్మీలు పుట్టారని చాలా సంతోషించేవాడు. నాన్న రాజకీయాల్లోకి వచ్చాక మాతో గడిపేందుకు ఎక్కువ సమయం ఉండేది కాదు. కానీ మా అవసరాలను ఎన్నడూ కాదనలేదు. ఎంత రాత్రి అయిన, ఉదయమైనా మా ముఖ కవళికలను బట్టే మాకు ఏం కావాలో తెలుసుకుని ఇచ్చేవారు. పదవ తరగతి పూర్తయ్యాక, ఇంటర్ ఆ తర్వాత హైదరాబాద్‌లోని డెక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత నాన్నతో అన్నీ విషయాలను పంచుకునేదాన్ని. జీవితంలో ఏ స్టెప్ తీసుకోవాలన్న నాన్నతో చర్చించి, నిర్ణయం తీసుకోవడమే. ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే నా భర్త(నజీర్) పరిచయం అయ్యాడు. ఇద్దరం ఇష్టపడ్డాం. ఈ విషయాన్ని నాన్నకు చెప్పా. రెండు రోజులు ఆలోచించి నీ సంతోషమే నాకు ముఖ్యమంటూ మా పెళ్లికి అంగీకరించారు. పెళ్లి.. ఆ తర్వాత జాబ్ రీత్యా ఇద్దరం ఇక్కడే స్థిరపడిపోయాం. మాకు ఇద్దరు ఆడపిల్లలు దియా, మెహిరా.సమయం వచ్చినప్పుడు చెబుతా అన్నారు..ప్రజాప్రతినిధి హోదా ఉంటే ప్రజలకు, సామాజిక సేవ మరింత ఎక్కువ చేయొచ్చని అనిపించింది. ఈ విషయాన్ని 2016లో నాన్న డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో ఆయన దృష్టికి తీసుకెళ్లాను. అప్పుడు నాన్న రాజకీయాలంటే అంత సులువు కాదు.. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతా అని సర్దిచెప్పారు. ఎనిమిది సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇందులో సమయ స్ఫూర్తి, ఓర్పు ఉండాలని పదే పదే చెబుతుంటారు.మానసిక ధైర్యం నూరిపోశారు..నా జీవితంలో ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికలు మరిచిపోలేని తీపి గురుతులు. కడియం శ్రీహరి కూతురిగా రాజకీయాల్లోకి వచ్చిన నాపై ప్రత్యర్థులు చేసిన ఆరోపణలు కొంత బాధగా అనిపించాయి. అప్పుడు నాన్న ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయని పట్టించుకోవద్దని మానసిక ధైర్యం నూరిపోశారు. ఆత్మస్థైర్యంతో రాజకీయ ప్రచారంలో పాల్గొన్నా. ఎంపీగా నా విజయం కోసం నాన్న ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేను.ప్రతీక్షణం నా వెనుకాలే..రాజకీయ అరంగేట్రం చేస్తున్న సమయంలో నాన్న ప్రతీక్షణం నా వెనుకాలే ఉన్నారు. ఎంపీ టికెట్ వచ్చిన మొదలు గెలిచే వరకు ఒకటీరెండు మీటింగులు తప్పితే అత్యధిక సమావేశాలు, సభలకు నాన్న నా వెంటే ఉంటూ నా వెన్నెముకలా నిలిచారు. సభల్లో ఎలా మాట్లాడాలి.. ఏయే అంశాలు ప్రస్తావించాలి.. మొదలు ప్రతిదీ చిన్నపిల్లలకు మాదిరిగా చెప్పేవారు. మడికొండలో సీఎం రేవంత్‌రెడ్డి సభలో ప్రసంగించే సమయంలో నాన్న ఉన్నాడన్న ధైర్యమే నన్ను నిలబెట్టింది. డాక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆ కేసులతోనే.. డాక్టర్‌గా పనిచేస్తున్నప్పుడే ఎక్కువ శాతం మహిళలు గర్భసంచి సమస్యతో బాధపడేవారు వచ్చేవారు. ఎందుకీ సమస్య అంటూ ఆరా తీయగా కౌమారదశలో వచ్చే పీరియడ్స్‌కు సరైన ప్యాడ్లు వినియోగించకపోవడమని తెలిసింది. ఆ సమస్యకు పరిష్కారం కోసం వెంటనే కడియం ఫౌండేషన్ ద్వారా బాలికలకు ప్యాడ్లు పంపిణీ చేయడం ప్రారంభించా. సంవత్సరంలో పదివేల మందికి ప్యాడ్లు పంచా. నాన్న విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే అప్పటి ప్రభుత్వం ఒకే సంవత్సరంలో 6.5లక్షల మంది బాలికలకు పంపిణీ చేసినట్లు తెలిసింది. -
బీఆర్ఎస్కు తాటికొండ రాజయ్య గుడ్‌బై
సాక్షి, వరంగల్: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన గులాబీ పార్టీకి.. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గుడ్‌బై చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య శనివారం రాజీనామా చేశారు. అయితే వరంగల్ పార్లమెంట్ సీటు ఆశించిన రాజయ్యకు.. పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్యకు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ నిరాకరించింది. రాజయ్యకు ఎంపీ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చి.. మాజీ ఎమ్మెల్యే కడియం శ్రీహారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫాం అందించింది. ఈ ఎన్నికల్లో కడియం శ్రీహరి విజయం కూడా సాధించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. అయితే ముందుగా మాటిచ్చిన పార్లమెంట్ స్థానంపై బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఎలాంటి భరోసా రాకపోవడంతో రాజయ్య అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చే రోజుల్లో కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూసింది. కానీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కు ఊహించని షాక్ ఇవ్వడంతో కేవలం ప్రతిపక్షానికి పరిమితమైంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అయినా అత్యధిక సీట్లు గెలుచుకోవాలని యత్నిస్తోంది. ఇందుకు తగ్గట్లే అధికార కాంగ్రెస్విపై విమర్శలు గుప్పిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య పార్టీని వీడటం.. ఆ పార్టీకి షాక్‌గానే చెప్పవచ్చు. చదవండి: కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసు.. ఆశావహుల్లో టెన్షన్! -
రాజన్న కోడెలు పక్కదారి!
వేములవాడ అర్బన్: వేములవాడ రాజన్న కోడెలు పక్కదారి పడుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజన్న భక్తులు శివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో కోడెలను, ఆవులను అందజేస్తుంటారు. తమ కోరికలు నెరవేరితే కోడెమొక్కు చెల్లించుకుంటామని మొక్కుకున్న భక్తులు పలువురు కోడెలను ఆలయ గోశాలకు అప్పగిస్తుంటారు. ప్రధానంగా రైతులు తమ ఇంట్లో శుభకార్యాలు జరిగితే కోడెను తీసుకొచ్చి రాజన్న ఆలయానికి అప్పగించడం అనాదిగా జరుగుతోంది. అయితే ఈ కోడెలు, ఆవుల పోషణ ఇబ్బందిగా మారడంతో ఆలయ అధికారులు ఇటీవల వివిధ ప్రాంతాల్లోని ఇతర గోశాలల నిర్వాహకులకు కొన్ని కోడెలు, ఆవులను అందజేస్తున్నారు. వారు వాటిని పోషించడం లేదా రైతులకు అందజేయాల్సి ఉండగా.. కొందరు నిర్వాహకులు ఇతరులకు విక్రయిస్తున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. అలాగే అసలు లేని గోశాలల పేరిట కూడా కొందరు కోడెలు తీసుకెళ్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్‌లో కోడెలతో వెళ్తున్న వ్యాన్ పట్టుబడడం, వారు చెప్పిన గోశాల అసలు లేనట్లు తేలడం ఈ అనుమానాలను బలపరుస్తోంది. పోషణ భారం తగ్గించుకునేందుకు.. వేములవాడ రాజన్న ఆలయ గోశాలలు స్థానిక తిప్పాపూర్‌లో ఒకటి, గుడిచెరువు కట్టకింద ఒకటి ఉన్నాయి. తిప్పాపూర్ గోశాలలో సుమారు 150 కోడెలు, వేములవాడ కట్టకింద గోశాలలో 150 కోడెలు, ఆవులు ఉన్నాయి. వేములవాడ కట్టకింద గోశాలలోని కోడెలను ఆలయంలో కోడె మొక్కుల కోసం తీసుకెళ్తుంటారు. ఆవులను స్వామి వారి పూజకు ఉపయోగపడే పాల కోసం వినియోగిస్తున్నారు. తిప్పాపూర్ గోశాలలో భక్తులు అప్పగించిన కోడెలు ఉంటాయి. ఇక్కడి కోడెలు ఎక్కువైనప్పుడు నిర్వహణ భారం తగ్గించుకునేందుకు ఇతర గోశాలలకు అప్పగిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో భూమి పట్టా పాస్బుక్కు ఉన్న రైతులకు పెంచుకునేందుకు ఉచితంగా అందజేసేవారు. తర్వాత కాలంలో వేలం ద్వారా రైతులకే అమ్మేవారు. అయితే 2012 నుంచి తెలంగాణ గోశాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో లేఖ తెచ్చుకున్నవారికి ఉచితంగా ఇస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో.. ఈనెల 2న తిప్పాపూర్ గోశాలలోని 20 కోడెలను ఫెడరేషన్ లేఖ తెచ్చుకున్న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం దుబ్బాతండాలోని శ్రీ సోమేశ్వర గోసంరక్షణ సేవా సంఘానికి అందజేశారు. ఈ కోడెలతో బయలుదేరిన వ్యాన్‌ను జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో బజరంగ్దళ్ కార్యకర్తలు అడ్డుకుని తనిఖీ చేశారు. 20 కోడెలు ఉండాల్సి ఉండగా 24 కనిపించడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో దుబ్బాతండాలో ఈ పేరుతో గోశాల లేదని తేలింది. దీంతో ఈ వ్యాన్‌ను నేరుగా స్టేషన్‌ఘన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. కోడెలను ధర్మసాగర్ మండలంలోని గోశాలకు తరలించారు. గోశాల ఫెడరేషన్ సూచించిన గోశాలలకు కోడెలను అప్పగిస్తున్న అధికారులు.. ఈ కోడెలు గోశాలలకు వెళ్తున్నాయా.. లేదా? అని పరిశీలించకపోవడంపై భక్తులు, స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలపై విచారణ చేపట్టాలి రాజన్న ఆలయ కోడెలను ఈ ప్రాంత రైతులకు అప్పగించాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం. కోడెల అప్పగింతలో అక్రమాలపై అధికారులు విచారణ చేపట్టాలి. హిందువుల మనోభావాలను కాపాడాలి. – గడప కిశోర్, విశ్వహిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి ఫెడరేషన్ లెటర్ మేరకే ఇచ్చాం ఎప్పటిలాగానే తెలంగాణ గోశాల ఫెడరేషన్ నుంచి వచ్చిన లేఖ మేరకే కోడెలను అందించాం. కానీ అక్కడ గోశాల ఉందో.. లేదో మాకు తెలి యదు. ఈ విషయం ఫెడరేషన్ వారు చూసుకోవాలి. – శ్రీనివాస్, రాజన్న ఆలయ ఏఈవో -
ప్రజల ఆస్తుల్ని గుంజుకోవడానికే కేసీఆర్ పోటీ: రేవంత్ రెడ్డి
జనగాం: ప్రజల ఆస్తుల్ని గుంజుకోవడానికి కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఓట్లన్నీ డబ్బాలో వేస్తే కేసీఆర్ మూటగట్టుకుని పోతారని అన్నారు. కేసీఆర్ చుట్టాలొచ్చి కామారెడ్డిలో భూములు గుంజుకుంటారని ఆరోపించారు. కేసీఆర్‌ను తరిమికొట్టడానికే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నానని రేవంత్ తెలిపారు. కేసీఆర్‌ను వెంటాడటానికే కాంగ్రెస్ అధిష్ఠానం తనను పంపించిందని పేర్కొన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఈ మేరకు బీఆర్ఎస్పై నిప్పులు చేరిగారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో మాట్లాడుతూ.. కేసీఆర్‌ను బీఆర్ఎస్ నాయకులే నమ్మడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మంత్రివర్గంలో దళితులకు స్థానం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో బందీ అయ్యిందని ఆవేదన వ్యకం చేశారు. కేసీఆర్ లాంటి దోపిడీదారు దేశంలోనే లేరని దుయ్యబట్టారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రానికి ఏం చేశారని మూడోసారి అధికారం ఇవ్వమని కేసీఆర్ అడుగుతున్నారని దుయ్యబట్టారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ విజయ భేరీ సభలో ఈ మేరకు రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్లో ఆరుగురు మహిళలకు టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ 12 మందికి అవకాశం కల్పించిందని రేవంత్ చెప్పారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మహిళలకు మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళా సాధికారత ఉన్న చోటే అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. వైన్ షాపులు పెట్టి పేదల ఆస్తులను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ప్రజల సంపదను సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. స్టేషన్ ఘన్‌పూర్‌కు డిగ్రీ కాలేజీ తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఘన్‌పూర్‌కు 100 పడకల ఆస్పత్రిని తీసుకురాలేకపోయారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బెల్టు షాపులు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్.. రాష్ట్రం ఎందులో మొదటి స్థానంలో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: దయాకర్ గెలిస్తే రైతు బంధు రూ. 16వేలు.. పాలకుర్తి బీఆర్ఎస్ సభలో కేసీఆర్ -
ఎన్నికల ప్రచారంలో ఇందిర దూకుడు
-
ఎన్నికల బరిలో జానకీపురం సర్పంచ్ నవ్య
సాక్షి, జనగామ: జానకీపురం సర్పంచ్ నవ్య గుర్తున్నారా? స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై వేధింపుల ఆరోపణలు.. యూట్యూబ్ ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్‌గా మారిపోయారామె. ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆమె ఇవాళ నామినేషన్ వేశారు. కుర్చపల్లి నవ్య స్టేషన్ ఘన్పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేశారు. భర్తతో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన ఆమె.. రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నవ్య సర్పంచ్ ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తొలి ఉప ముఖ్యమంత్రిగా పని చేసి రాజయ్యపై తీవ్ర విమర్శలే చేశారామె. అయితే.. నవ్య చేసిన ఆరోపణల వల్లే తాటికొండ రాజయ్యకు టికెట్ రాలేదన్న వాదన కూడా ఉంది. కేసీఆర్ తనకు అవకాశం ఇస్తే.. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆ మధ్య మీడియాతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సర్పంచ్ నవ్య.. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. చదవండి: సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?.. రేవంత్ సవాల్ -
నేనే సుప్రీం.. మరోసారి ఎమ్మెల్యే రాజయ్య షాకింగ్ కామెంట్స్
సాక్షి, జనగామ: తెలంగాణలో అసెంబ్లీ వేళ అధికార బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల పోటీలో నిలిచే వారి జాబితాను సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావాహులు హైకమాండ్‌పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరికొందరు ఇప్పటికే పార్టీని వీడుతూ హైకమాండ్ తీరుపై విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ను ఓడిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర పరిమాణం చోటుచేసుకుంది. స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. మరోసారి సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఎమ్మెల్యే రాజయ్య కేశవనగర్‌లో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా రాజయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే నేను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేదు. నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు నడుస్తున్నాయి. ఇదే సమయంలో స్థానిక నేతలపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో డప్పులు కొట్టాలన్నా, ఫ్లెక్సీలు కట్టాలన్నా భయపడుతున్నారు. కోలాటమాడాలన్నా భయంతో వణికిపోతున్నారు. ఇలా ఎందుకు ఇంత అభద్రతాభావంతో ఉన్నారో అర్థం కావట్టేదు. వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ వరకు నేను ఎమ్మెల్యేగా ఉంటాను. అప్పటి వరకు స్టేషన్ ఘనపూర్‌కు నేను సుప్రీం’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం టికెట్‌ను కడియం శ్రీహరికి హైకమాండ్ కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో, కడియం, రాజయ్య మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో వీరితో మంత్రి కేటీఆర్.. ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. రాజయ్యకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని రాజయ్యకు కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతో, మెత్తబడట్టే కనిపించిన రాజయ్య.. వెంటనే కడియంకే తన మద్దతు అని ప్రకటించారు. అనంతరం, వీలు చిక్కనప్పుడల్లా ఇలా కడియంను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. -
తెలంగాణ: చేతులు కలిపితే సరిపోతుందా?
సాక్షిప్రతినిధి, వరంగల్: రాజకీయ ఉద్ధ్దండులకు కేరాఫ్ అయిన వరంగల్‌లో రోజుకో తీరు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈసారి మూడు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాజకీయాలు కీలకంగా మారాయి. దరఖాస్తులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తుండగా.. ముందుగానే టికెట్ ఖరారు చేసుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు కొందరు వ్యూహరచన, ప్రచారాల్లో పడ్డారు. ఇదే సమయంలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో చెలరేగిన అసంతృప్తి మాత్రం సద్దుమణగడం లేదు. ఉమ్మడిజిల్లాలో 12 స్థానాల్లో పది చోట్ల ప్రశాంతంగా ఉన్నా.. ఈ రెండు స్థానాలు మాత్రం అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. అందరి దృష్టి ఇప్పుడు ఆ నియోజకవర్గాలపైనే ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు మంతనాలు జరిపినా.. ఆరెండు నియోజకవర్గాల్లో అసంతృప్తి.. అంతర్గత కుమ్ములాటలు సద్దుమణగడం లేదు. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి ఎవరికీ వారుగానే వ్యవహరిస్తున్నారు. నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు వారం రోజుల కిందట బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించారు. స్టేషన్ ఘన్‌పూర్‌కు సంబంధించి ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో వేర్వేరుగా, కలిపి మంత్రి కేటీఆర్ చాలాసేపు చర్చలు జరిపారు. ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ ప్రయోజనాలు, అవకాశాలపై కూలంకుషంగా మాట్లాడిన అనంతరం మంత్రి కేటీఆర్ సమక్షంలో రాజయ్య, శ్రీహరి కరచాలనం చేసుకున్నారు. అప్యాయంగా పలకరించుకున్న ఫొటోలు, వీడియోలు మీడియాలో రావడంతో అంతా సద్దుమణిగినట్లేననుకున్నారు. ఆ మరుసటి రోజు నుంచి చేయి కలిపితే పోటీ చేయకుండా ఉంటానన్నట్లా అంటూ రాజయ్య, శ్రీహరి ఎవరికి వారుగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని బుజ్జగించేందుకు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా ప్రగతిభవన్లోనే ఉన్నప్పటికీ కేటీఆర్.. ఎమ్మెల్యే యాదగిరిరెడ్డితోనే మాట్లాడారు. తర్వాత సీఎం కేసీఆర్‌ను కూడా కలిసినట్లు యాదగిరిరెడ్డి చెప్పారు. ఇది జరిగిన మరుసటి రోజు నుంచే ఎమ్మెల్యే జనగామలో తిరుగుతుండగా.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సైతం నియోజకవర్గంలోని తన అనుచరులతో వ్యూహ రచనలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందటి కంటే ఎక్కువగా ఒకరిపై ఒకరు పరోక్ష వ్యాఖ్యలు, విమర్శలు చేసుకుంటుండడంతో పార్టీ క్యాడర్ ఇబ్బంది పడుతోంది. కేటీఆర్ పర్యటనతోనైనా సద్దుమణిగేనా.. ప్రయత్నాలెన్ని చేసినా.. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ రాజకీయాలు ఇంకా రక్తి కట్టడం లేదు. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య అగాధం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. అంతా అయిపోయిందనుకున్న స్టేషన్ ఘన్‌పూర్‌లో సైతం పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది. మరో ఐదారు రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తాయన్న ప్రచారం జోరందుకుంది. ఆమేరకు కూడా ఆరెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలు కావొస్తున్నా.. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ కుదురుకోవడం లేదు. పైగా.. ఆ ప్రభావం ఇతర నియోజకవర్గాలపైనే చూపే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో నేతల మధ్య విభేధాలతో ‘ఎవరి వెంట వెళ్లాలో.. ఎవరితో వెళ్లకూడదో అర్థం కావడం లేదని.. అధిష్టానం తొందరగా సెట్ చేస్తేనే కలిసి తిరగగలం’ అని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈనెల 6న మంత్రి కేటీఆర్ వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఆయన ఉమ్మడి వరంగల్ రాజకీయాలపై సమీక్ష జరిపే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో నేతల వివాదాలకు సైతం సీరియస్‌గానే తెర వేయనున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. -
బీ ఫాం నాదే: రాజయ్య సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జనగామ జిల్లా: కేటీఆర్ చొరవతో.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ విభేదాలు ఓ కొలిక్కి వచ్చాయనుకుంటున్న సమయంలోనే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బాంబు పేల్చారు. బీ ఫాం తనదేనని ప్రకటించుకున్న ఆయన.. ఒకవేళ సీటు కేటాయించని పక్షంలో పోటీ చేసే విషయం కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసిపోయారనుకునేలోపే ఎమ్మెల్యే రాజయ్య బాంబు పేల్చడం గమనార్హం. లింగాలగణపురం మండలం వడ్డీచర్లలో డా.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తాటికొండ రాజయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డప్పుకొట్టి దరువేశారు. డప్పు, డోలు కొట్టి కార్యకర్తలను ఉత్సాహాపరిచారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేటీఆర్ విదేశాలకు వెళ్లే ముందు కలిశానని, అప్పుడు టికెట్ నీకే అని చెప్పారని ప్రస్తావించారు. కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు కేటీఆర్ లేకపోవడంతో మళ్లీ రెండు రోజుల క్రితం సమావేశమైనట్లు చెప్పారు. తనకు ఎమ్మెల్సీ గానీ, ఎంపీగా కానీ అవకాశం ఉందని చెప్పినట్లు పేర్కొన్నారు. అప్పటివరకు స్టేట్ కార్పొరేషన్ నామినేటెడ్ పదవి తీసుకొమ్మని చెప్పారని ప్రస్తావించారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఫోటోలు దిగినట్లు తెలిపారు. ఆ ఫోటోకు ఊహాగానాలతో మీడియాలో వచ్చిన కథనాలతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొందన్నారు ఎమ్మెల్యే రాజయ్య. కడియంతో ఎలాంటి చర్చలు.. సంప్రదింపులు జరగలేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బీ ఫాం తప్పకుండా తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వేల టికెట్ రాకపోతే బరిలో నిలిచేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. సర్వే రిపోర్ట్లు తెచ్చుకొని చేర్పులు మార్పులు ఉంటాయని చెప్పినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ బీఫామ్‌లు ఇవ్వలేదన్న రాజయ్య.. కొన్ని నియోజక వర్గాలలో డిస్టబెన్స్ జరుగున్నాయని తెలిపారు. ‘2014లో ఎంపీ అభ్యర్థిగా కడియం, ఎమ్మెల్యేగా నేను అధిష్టానం నిర్ణయం ప్రకారం కలిసి పని చేశాం. ఇప్పుడు కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేస్తా. జనవరి 17 వరకు ఎమ్మెల్యేగా ఉంటా. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలి. కార్యకర్తలు ఆందోళన చెందకుండా పని చేయండి. వరంగల్‌లో దామోదర రాజనర్సింహతో కలిసి ఓ సమావేశంలో పాల్గొన్నప్పుడు రాజయ్య కాంగ్రెస్‌లోకి వెల్తున్నారని కథనాలు రాశారు. ఊహాగానాలతో మీడియాలో కథనాలు రాయడాన్ని ఖండిస్తున్నాను’ అని రాజయ్య పేర్కొన్నారు. -
కేటీఆర్ మాస్టర్ ప్లాన్.. కడియంకు మద్దతు ప్రకటించిన రాజయ్య..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు చోట్ల సిట్టింగ్‌లకు ప్లేస్ లేకపోవడంతో ఆయా స్థానాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. సొంత పార్టీ నేతలే పార్టీ హైకమాండ్‌పై సీరియస్ అవుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చక్రం తిప్పిన కేటీఆర్.. ఇక, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి సీటు ఖరారు చేయడంతో ఆయన హైకమాండ్‌పై పోరుకు రెడీ అయ్యారు. సమయం దొరికిన ప్రతీసారి శ్రీహరిని టార్గెట్ చేస్తూ రాజయ్య సెటైర్లు వేశారు. పరోక్షంగా శ్రీహరిని ఓడిస్తా అనే రేంజ్ వరకు వెళ్లారు. ఈనేపథ్యంలో తాజాగా ప్రగతి భవన్లో రాజయ్య, శ్రీహరితో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జరిగిన భేటీలో రాజయ్య శాంతించారు. వచ్చే ఎన్నికల్లో కడియం గెలుపునకు పార్టీ కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే శ్రీహరికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. శాంతించిన రాజయ్య.. అయితే, రాజయ్యకు కేటీఆర్ కీలక హామీ ఇచ్చారు. రాజయ్యకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రాజయ్య భవిష్యత్త్‌కు సీఎం కేసీఆర్, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక, కేటీఆర్ ఇచ్చాన భరోసాతో రాజయ్య మెత్తబడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాని తెలిపారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: అలర్ట్.. తెలంగాణకు భారీ వర్ష సూచన.. -
కడియం వద్దు.. రాజయ్యే ముద్దు
మడికొండ: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆదివారం గ్రేటర్ వరంగల్ పరిధి 46వ డివిజన్ రాంపూర్‌లో అంబేడ్క ర్ సంఘం ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం చేపట్టారు. ‘కడియం వద్దు.. రాజయ్యే ముద్దు’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి కడి యం ఏమీ చేయలేదని, రాజయ్య వచ్చాకే అభివృద్ధి జరిగింది అన్నారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీహరి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల కూడా మంజూరు చేయించలేదని పేర్కొన్నారు. రాజయ్య పై లేనిపోని ఆరోపణలు చేసి టికెట్ తెచ్చుకున్న ఆయన మాదిగలను కాదని ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామన్నారు. ఎమ్మెల్యే రాజయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉంటామని, టికెట్ కెటాయిస్తే భారీ మోజార్టీతో గెలిపిచుకుంటా మని చెప్పారు. అంతకు ముందు రాంపూర్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టా రు. కార్యక్రమంలో మునిగాల వెంకటయ్య, డేని యల్, తప్పెట సారయ్య, కడారి దేవయ్య, మాదా సి రమేష్, యాదగిరి, నర్సింగం, కమలేష్, ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ పట్ల మహేష్, ఎర్ర సంపత్, నాగేష్, వెంకటస్వామి, మీసాల ఎల్లేష్, సాగర్, ఎమ్మెల్యే అభిమానులు పాల్గొన్నారు. -
టార్గెట్ కడియం.. ఎమ్మెల్యే రాజయ్య సంచలన కామెంట్స్
సాక్షి, జనగామ: బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. టికెట్లు దక్కని సిట్టింగ్స్.. టికెట్ దక్కిన వారిపై, పార్టీ అధిష్టానంపై సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, జనగామ జిల్లాలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య మధ్య పొలిటికల్ కోల్డ్‌వార్ నడుస్తోంది. రాజయ్య సందర్భం వచ్చిన ప్రతీసారి శ్రీహరిని టార్గెట్ చేస్తూ పరోక్షంగా పంచ్‌లు ఇస్తున్నారు. తాజాగా మరోసారి రాజయ్య సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో రాజయ్య మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్‌లో సొమ్మొకడిది సోకొకడిదిగా అన్నట్లుగా పరిస్ధితి మారింది. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కాకుండా ఎవరు అడ్డుపడ్డారో అందరికీ తెలుసు. మేం చేసిన పనులను తామే చేశామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్ధితి నెలకొంది. ఎక్కడో ఉండి ఇక్కడ పనులు చేశామని చెప్పుకోవడం సరైన పద్దతి కాదని హితవు పలికారు. పనులు చేసి నిత్యం ప్రజల్లో ఉండేది ఒకరైతే.. అన్ని తానే చేసినట్టు కలర్ ఇచ్చేది మరొకరు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి విద్య ద్వారానే ఈ స్థాయికి వచ్చానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదలైంది. కాగా, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో సిట్టింగ్గా వున్న రాజయ్యను కాదని కడియం శ్రీహరికి కేసీఆర్ అవకాశం కల్పించారు. దీన్ని రాజయ్య జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు.. రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్యల మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. తనను రాజయ్య లైంగికంగా వేధిస్తున్నాడని.. నవ్య సంచలన ఆరోపణలు చేశారు. వీరి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే సీతక్క పీఏ దుర్మరణం -
భార్యతో వివాహేతర సంబంధం.. కత్తితో నరికి..చెరువులో పడేసి..
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని శివునిపల్లికి చెందిన తీగల కరుణాకర్(35) దారుణహత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన చిక్కుడు నాగరాజు.. కరుణాకర్‌ను కత్తితో దారుణంగా చంపి శివునిపల్లి శివారు నమిలిగొండ చెరువులో పడేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ శ్రీనివాసరావు కథనం ప్రకారం శివునిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన తీగల యోబు, మరియ దంపతుల రెండో కుమారుడు కరుణాకర్ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అదేవిధంగా శివునిపల్లికి చెందిన చిక్కుడు నాగరాజు హమాలీ పనిచేస్తుంటాడు. నమిలిగొండ శివారులో వారివురి వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. ఈ క్రమంలో కరుణాకర్‌కు, నాగరాజు భార్యకు మధ్య పరిచయం ఏర్పడింది. ఈనెల 25న హైదరాబాద్‌లో ఉన్న కరుణాకర్.. నాగరాజు భార్య ఫోన్‌కు ఫోన్ చేయగా ఇంట్లో ఉన్న ఆయన ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఇదీ గమనించని కరుణాకర్ తాను సాయంత్రం వస్తున్నానని, కలుస్తామని చెప్పగా నాగరాజు కోపంతో రగిలిపోయాడు. ఈ విషయంపై ఏమి తెలియనట్లు బయటకు వెళ్లాడు. అనంతరం సాయంత్రం ఆమెకు మరోసారి ఫోన్ రావడంతో తమ వ్యవసాయ భూముల సమీపంలో ఉన్న మామిడితోట వద్దకు వెళ్లింది. గమనించిన నాగరాజు కత్తి తీసుకుని మామిడితోటకు వెళ్లాడు. అక్కడ తన భార్యతో కరుణాకర్ మాట్లాడుతున్న విషయం గుర్తించి ఒక్కసారిగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని కచ్చువల, సంచిలో కట్టి నమిలిగొండ చెరువులో పడేసి వెళ్లాడు. ఈనెల 25వ తేదీ రాత్రి నుంచి కరుణాకర్ కనిపించకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల గ్రామాలు, బంధువుల ఇళ్లలో వెతికారు. అతడి ఆచూకీ కోసం పోలీసులను కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో నిందితుడు స్వయంగా మంగళవారం పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి సీఐలు రాఘవేందర్, శ్రీనివాస్‌రెడ్డి.. చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటికి తీయించారు. దీంతో మృతుడి భార్య, సోదరులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాసరావు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. దీనిపై మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవేందర్ తెలిపారు. కాగా, హత్య ఒక్కరే చేశారా.. మరెవరైనా ఉన్నారా? హత్యకు వివాహేతర సంబంధమే కారణమా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే పోలీసులు కోణాల్లో విచారణ చేస్తున్నారు. -
భావోద్వేగంతో ఎమ్మెల్యే రాజయ్య కంటతడి
సాక్షి, జనగామ: అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ దక్కకపోవడంపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఢీలా పడిపోయారు. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి కడియం శ్రీహరి పోటీ చేయనున్నారు. దీంతో.. టికెట్ మీద గంపెడాశలు పెట్టుకున్న రాజయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చుని ఆయన బోరున విలపించారు. అయితే.. టికెట్ దక్కకపోయినప్పటికీ.. అధినేత కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని రాజయ్య స్పష్టం చేశారు. ‘‘బీఆర్ఎస్లోలో చేరినప్పటి నుండి కేసీఆర్‌కు వీర విధేయుడిగా ఉన్నా. సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి.. అందరూ సమన్వయం పాటించండి. దయచేసి ఎవరినీ బాధ పెట్టొద్దు’’ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేక్రమంలో.. ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో కార్యకర్తలు సైతం ఆయన్ని పట్టుకుని విలపించారు. ‘‘ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రతి గ్రామానికి సీడీఎఫ్ కింద 3 కోట్లు మంజూరయ్యాయి. అభివృద్ధి పనులు కొనసాగుతాయి. 15 సంవత్సరాల రాజకీయ అనుభవం, అధికార కాంగ్రెస్ పార్టీకి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి తెలంగాణ కోసం రాజీనామా చేశా. స్థాయికి తగ్గకుండా ఉన్నత స్థానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.. దళిత బంధుకు 1,100 మందికి వచ్చే విధంగా సిఫారసు చేశా.. ఘనాపూర్ ప్రజల మధ్యే నా జీవితం’’ అని రాజయ్య పేర్కొన్నారు. కేసీఆర్ న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది: ఎమ్మెల్యే రాజయ్య సతీమణి ఎమ్మెల్యే రాజయ్యకు బీఆర్ఎస్ టిక్కెట్ లభించకపోవడం అన్యాయం కాదని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని ఆయన సతీమణి ఫాతిమా మేరీ అన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరాం. బీఆర్ఎస్లోనే ఉంటాం... కడియం శ్రీహరిని ఎమ్మెల్యే గా గెలిపించేందుకు కృషి చేస్తాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. -
లైన్ ఎవరు దాటినా ఊకునేది లేదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలో సీనియర్ నేతల నడుమ జరుగుతున్న మాటల యుద్ధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. మంగళవారం మధ్యాహ్నాం ప్రగతి భవన్లో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కేటీఆర్ సమావేశమై ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించారు. గత కొంతకాలంగా రాజయ్య వర్సెస్ కడియం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయపరంగానే కాదు.. వ్యక్తిగత విమర్శలకు సైతం ఇద్దరూ వెనుకాడడం లేదు. ఈ తరుణంలో పార్టీ పరువును బజారుకీడ్చడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఇవాళ్టి భేటీలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో.. రాజయ్యను మందలించిన ఆయన.. ఇంకోసారి అలాంటి పని చేయొద్దని వారించినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి మాట్లాడకూదని, ఎవరూ ఆ పని చేసినా సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. ‘‘ఇద్దరి వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది. ఇంతటితో ఈ వివాదం ముగించాలని, ఎన్నికల సమయం దగ్గరపడుతోంది కాబట్టి ఇద్దరూ కలిసి పని చేసుకోవాలని.. లేకుంటే తీవ పరిణామాలు ఉంటాయ’’ని కేటీఆర్ రాజయ్యను హెచ్చరించినట్లు సమాచారం. మరోవైపు ఆయన కడియంతోనూ భేటీ కావొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కడియం-రాజయ్య వైరం ఈనాటిది కాదు! మాజీ ఉపముఖ్యమంత్రులైన కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలు.. మొదటి నుంచి రాజకీయ ప్రత్యర్థులు. దీంతో స్టేషన్ ఘన్‌పూర్‌లో ఆధిపత్య పోరు సహజంగానే కొనసాగుతూ వస్తోంది. 2019 సెప్టెంబర్‌లో వేర్వేరుగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన యాత్ర రెండు వర్గాల మధ్య విభేదాలకు ఆజ్యం పోయగా.. ఆ తర్వాత పరిణామాలు కూడా మరింత దూరం పెంచాయి. ఎవరికీ వారుగా నియోజకవర్గంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఫ్లెక్సీలు, ప్రొటోకాల్ వివాదం.. అంటూ ఇరువర్గాల మధ్యన తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే 20 రోజుల వరకు కూడా పరోక్షంగా ఆరోపణలు చేసుకున్న ఇద్దరు నేతలు.. ఈ మధ్య కాస్త దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్వరం మరింత పెంచుకోవడంతో.. అధిష్టానం ఈ విమర్శలను తీవ్రంగా పరిగణించింది. ఇదీ చదవండి: నేను నోరు విప్పితే రాజయ్య కుటుంబం సూసైడ్ చేస్కోవాలి-కడియం -
సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, ధర్మసాగర్(హన్మకొండ): స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్యపై ధర్మసాగర్ మండలం జాన కీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవాలు లేవని పోలీసులు తేల్చినట్టు తెలిసింది. జూన్ 21న ఎమ్మెల్యే టి.రాజయ్య, ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్, నవ్య భర్త ప్రవీణ్‌లపై వేధింపుల ఆరోపణలు చేసిన నవ్య ధర్మసాగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిని సుమోటోగా తీసుకున్న జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సర్పంచ్ నవ్య కేసుపై సమాచారం సేకరించాలని పోలీసులను ఆదేశించాయి. ఈ క్రమంలో వేధింపులకు సంబంధించిన ఆధారాలు అందజేయాలని కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ధర్మసాగర్ సీఐ ఒంటేరు రమేశ్‌లు సర్పంచ్ నవ్యకు నోటీసులు జారీ చేశారు. ఆమె ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదని చెపుతున్నారు. సర్పంచ్ నవ్య నిర్ణీత సమయానికి ఆధారాలు సమర్పించలేదని, ఆమె ఆరోపణలు అవాస్తవమని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లకు బుధవారం పోలీసులు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే రెండు ఆడియోలు విడుదల చేసిన నవ్య.. కేసు నమోదు చేస్తేనే ఆధారాలు ఇస్తానని చెబుతోంది. చదవండి: ఇక నేను తప్పుకుంటా, సీఎంకు తెలియజేయండి.. జెన్కో సీఎండీ వ్యాఖ్యలు -
ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక ట్విస్ట్
-
ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక ట్విస్ట్
సాక్షి, వరంగల్: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య మధ్య వేధింపుల పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ నవ్య తన భర్త, ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్‌పై పీస్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని నవ్య స్పష్టం చేశారు. వేధింపులపై మూడు నెలల క్రితం క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య గ్రామ అభివృద్ధికి 25 లక్షలు ఇస్తానని చెప్పి నయాపైస ఇవ్వకపోగా తనకు ఇచ్చినట్లు ప్రచారం చేస్తూ బాండ్ పేపర్ పై అప్పుగా 20 లక్షలు తీసుకున్నట్టు సంతకం పెట్టమని ఎమ్మెల్యేతో పాటు తన భర్త, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏ వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్తపై ఆరోపణలు చేసిన నవ్య భర్తతో కలిసే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నలుగురిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండి: సర్పంచ్ నవ్య కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎమ్మెల్యే రాజయ్య యవ్వారం.. -
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్ పార్టీలో పెను ప్రకంటపనలు మొదలయ్యాయి. మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. రాజయ్యపై జానకీపురం మహిళ సర్పంచ్ నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. లైంగికంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని నవ్య ఆరోపణలు చేస్తున్నారు. రాజయ్య మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. సమయం చూసి అవన్నీ భయటపెడతానని అన్నారు. తన వెనక ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇటువంటి వేధింపులు ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని అన్నారు. పక్కన నిలబడితే ఎక్కడెక్కడో చేయి వేస్తారు. హగ్ చేసుకోవడానికి వస్తారు. బిడ్డలాంటి దాన్ని అని చెప్పినా మారరా. మీకు సహకరించకుంటే నా బతుకు నాశనం చేస్తారా. రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటారా. దయచేసి ఇప్పటికైనా ఈ అరాచకాలు మానండి. ఇలాంటి వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తెలిపారు. మరోవైపు తనపై చేస్తున ఆరోపణలపై ఎమ్మెల్యే రాజయ్య స్పందించారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని, గతంలో జరిగినట్లు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇంటి దొంగలే శిఖండి పాత్ర పోషించి తనను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ను కలిసి అన్ని విషయాలు వివరిస్తానని తెలిపారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. -
స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్లో వర్గ పోరు
వాళ్ళిద్దరూ అధికార పార్టీ నేతలే. ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎమ్మెల్సీ. ఇద్దరూ తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే. ఇద్దరూ దళిత నేతలే. కాని వారిద్దరికి అసలు పడదు. మాటల తూటాలతో గులాబీ కోటలో కలకలం సృష్టిస్తున్నారు. తప్పు చేయలేదు.. తలవంచను అని ఒకరంటే, సీఎం కేసిఆర్‌కు వీరవిధేయుడిని తానేనంటు మరో నాయకుడు అంటున్నారు. ఓరుగల్లు గులాబీ కోటలో రాజకీయ దుమారం రేపుతున్న ఆ ఇద్దరు నేతలు ఎవరు? ఏమిటా కథ? ఓరుగల్లులోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో విచిత్ర రాజకీయం నడుస్తోంది. అధికార, విపక్షాల మధ్య విమర్శలు..ప్రతి విమర్శలు సవాళ్ళు.. ప్రతిసవాళ్ళు కామనే. కానీ స్టేషన్ ఘనపూర్ లో అధికార బీఆర్ఎస్ నేతల మధ్యనే కొంతకాలంగా పొలిటికల్ కోల్డ్ వార్ సాగుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయాలు సాగుతున్నాయి. గతం నుంచీ రాజకీయ ప్రత్యర్థులే అయినప్పటికి ప్రస్తుతం అధికార బిఆర్ఎస్లోనే ఉంటూ అంతర్గత విభేదాలతో రగిలిపోతున్నారు. ఒకరిపై ఒకరు సందర్భోచితంగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఆధిపత్యం కోసం ఆరాటపడుతూ నియోజకవర్గంలోని గులాబీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నారు. కడియం శ్రీహరి సంయమనంతో రాజకీయ చక్రం తిప్పుతుండగా రాజయ్య మాత్రం దూకుడుగా వ్యవహరిస్తు అనుచిత వ్యాఖ్యలతో రాజకీయ దుమారం సృష్టిస్తున్నారు. లింగాల ఘనపురంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ తప్పు చేయను, ఎవరికి తలవంచను.. ఆత్మగౌరవాన్ని చంపుకుని పాదాభివందనం చేయనని స్పష్టం చేశారు. ఇటీవల కేసిఆర్‌కు రాజయ్య పాదాభివందనం చేయడంతో.. తప్పు చేసిన వాళ్ళే తలవంచి పాదాభివందనం చేస్తారంటూ చేసిన కామెంట్స్.. రాజయ్యను ఉద్దేశించి చేసినవే అనే చర్చ జరుగుతోంది. ఆ తర్వాత రాజయ్య సైతం తానేమి తక్కువ కాదని కొత్తకొండలో శ్రీహరిని ఉద్దేశించి స్టేషన్ ఘనపూర్ టిక్కెట్ నాదే... గెలుపు నాదేనని స్పష్టం చేశారు. కేసిఆర్ నిర్ణయాలకి.. ఆయనకు వీరవిధేయుడు ఎవరంటే తానేనని, త్యాగం చేసిన వ్యక్తిని కూడా తానేనని చెప్పుకొచ్చారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కేసిఆర్ ఆశీస్సులు తనకే ఉంటాయన్నారు. ఈ కామెంట్స్ తర్వాత ఇద్దరి మధ్య మాటల యుద్ధం, ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. మళ్లీ సిట్టింగ్‌లకే సీట్లు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో రాజయ్య వర్గం సంబురంగా ఉంటే, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, మచ్చలేని నేత కడియం శ్రీహరికే స్టేషన్ ఘన్పూర్ టికెట్ రాబోతోందని ఆయన వర్గం నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి చరిష్మా ఉన్న నేతగా ఎదిగిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మింగుడుపడటం లేదు. టార్గెట్ స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ అన్నట్లుగా కడియం శ్రీహరి పనిచేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే రాజయ్య పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమాత్రం సంతృప్తిగా లేరని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మా సార్కే టికెట్ వస్తుందంటూ కడియం వర్గీయులు బహిరంగగానే వ్యాఖ్యానిస్తున్నారు. కడియం రాజకీయ వైఖరి, ధోరణి కూడా ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చేవిధంగానే ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించడమే కాదు.. అన్ని కార్యక్రమాల్లోనూ కడియం హవా కనిపిస్తోంది. రాజయ్య వర్గం నుంచి కొంతమందిని ఇటీవల కడియం వైపు తిప్పుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తన అనుకూలతలను అధిష్ఠానానికి చాటేందుకే కడియం అవుట్ రైట్ స్ట్రాటజీతో స్పీడ్ పెంచినట్లుగా పార్టీ సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టుగా స్టేషన్ ఘన్‌పూర్‌లో ఇద్దరి రాజకీయ పరిస్థితి తయారైంది. స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ కోసం ఇద్దరు నేతలు ఆధిపత్య ప్రదర్శనలకు దిగుతుండడంతో పార్టీ శ్రేణులు రెండుగా చీలిపోయాయి. వీరివల్ల తాము ఇబ్బంది పడుతున్నామని కేడర్ ఆందోళన చెందుతోంది. ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గులాబీ బాస్ తమ నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని ఆ నియోజకవర్గ కేడర్ కోరుతోంది. -
కల్లులందు కర్జూర కల్లు వేరయా! ఫుల్ డిమాండ్.. ఆరోగ్యానికి మేలు కూడా?
సహజసిద్దంగా చెట్ల నుంచి లభించే కల్లు అంటే ఇష్టపడని వారు ఉండరు. గ్రామీణప్రాంత ప్రజలైతే మరింత ఆసక్తి చూపుతారు. తీపి, ఒగరు, పులుపుగా ఉండే కల్లు ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిస్తే ఇక జనం ఆగరు. ఇప్పటి వరకు మనకు తాటి, ఈత, వేప కల్లు మాత్రమే తెలుసు. కానీ కర్జూర చెట్లు సైతం కల్లునిస్తు జనాన్ని ఫిదా చేస్తున్నాయి. జనగామ జిల్లాలో కర్జూర కల్లు జనాలకు మజానిస్తోంది. ప్రజల మనసు దోచుకుంటున్న ఈ ప్రత్యేక పానీయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. గ్రామీణ ప్రాంతాల్లో కల్లు సేవించడం సంప్రదాయంగా ఉంది. అయితే తాటికల్లు, ఈత కల్లు మాత్రమే జనాలు ఎక్కువగా సేవించేవారు. కానీ, తాజాగా కర్జూర కల్లు అందరినీ ఆకట్టుకుంటోంది. సహజసిద్ధమైన ఈకల్లు ఆరోగ్యంతో పాటు, ఆనందాన్ని ఇస్తోంది. కిడ్నీల్లో రాళ్లను పోగొడుతుందని కల్లు ప్రియులు అంటున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ లో కొందరు రైతులు కర్జూర చెట్లను సాగుచేశారు. ఆచెట్ల నుంచి స్థానిక గౌడకులస్థులు కల్లు తీస్తు జనాలను ఆకర్షిస్తున్నారు. (చదవండి: తోడు కోసం అడవి దాటుతున్న మగ పులులు) సాధారణంగా తాటికల్లు, ఈతకల్లు చేదుగా, పుల్లగా, కొన్నిసార్లు తియ్యగా ఉంటుంది. కొన్నిసార్లు వగరుగానూ ఉంటుంది. ఈత, తాటికల్లు సేవించేందుకు కొందరు ఇష్టపడరు. కానీ, కర్జూర కల్లు మాత్రం తియ్యగా, టేస్టీగా ఉండడంతో అందరూ తాగుతున్నారు. తెల్లారిందంటే చాలు చెట్ల క్రిందికి చేరిపోతున్నారు. కర్జూర కల్లు టేస్ట్ తో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు, ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలుగుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవాపూర్ కర్జూర కల్లుకు ఒకబ్రాండ్ గా మారింది. ఒకసారి ఈకల్లు తాగినోళ్లు పదేపదే వస్తున్నారు. దీని టేస్ట్ గురించి తెలుసుకుని వరంగల్, జనగామ ప్రజలతో పాటు హైదరాబాద్ వాసులు కూడా తరలివస్తున్నారు. ఉదయమే కర్జూర కల్లు తాగితే చాలా అద్భుతంగా ఉంటుందని కల్లుప్రియులు చెబుతున్నారు. మరో ప్రత్యేకత తాటిచెట్లు, ఈతచెట్లు కొన్ని నెలలు మాత్రమే కల్లునిస్తాయి. కానీ కర్జూర చెట్లు మాత్రం సంవత్సరం పొడవునా కల్లును ఇవ్వడం ఈచెట్ల ప్రత్యేకత. రాఘవాపూర్ లో ఐదు కర్జూర చెట్లు ఉండగా ఒక్కో చెట్టు రోజుకు 20 లీటర్ల కల్లు పారుతుంది. లీటర్ కు వంద రూపాయలకు విక్రయిస్తున్నారు. అమృతంలా ఆరోగ్యానికి మేలుచేస్తుండడంతో కర్జూర కల్లు కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని గౌడ కులస్తులు తెలిపారు. డిమాండ్ బాగానే ఉన్నా చెట్లు తక్కువగా ఉండి అందరికీ కల్లు అందించలేక పోతున్నామని అంటున్నారు. ఇక డిమాండ్ కు తగ్గట్లు సప్లై లేక చాలా మంది కల్లు దొరక్క నిరాశతో వెనుతిరిగి పోతున్నారు. ప్రభుత్వం హరితహరం క్రింద రోడ్లకు ఇరువైపులా ప్రభుత్వ భూముల్లో కర్జూర చెట్లు పెంచి తమ ఉపాధి మెరుగుపర్చాలని కల్లుగీత కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రజలకు ఆరోగ్యవంతమైన కర్జూర కల్లును అందిస్తామంటున్నారు. (చదవండి: పోలీసులందు ఈ పోలీస్ వేరయా.. దొంగలతో చేతులు కలిపి ‘ముఠా’ నేతగా ఎదిగి) -
కడియం శ్రీహరి నా మీద చేసిన అభియోగాలను తీవ్రంగా ఖండిస్తున్నా: ఎమ్మెల్యే రాజయ్య
-
స్టేషన్ ఘన్పూర్ పక్కా నా అడ్డానే: రాజయ్య
సాక్షి, వరంగల్: తెలంగాణ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి తనపై చేసిన అభియోగాలపై తీవ్రంగా స్పందించారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. మంగళవారం సాయంత్రం వరంగల్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. ఈ వ్యవహారంపై స్పందించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పక్కా నా అడ్డానే. కడియం శ్రీహరి నా మీద చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా. 14 ఏళ్లుగా మంత్రిగా పని చేసిన కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్‌కు ఏం చేశారు?. కడియం తీరు గురువింద సామెతలా ఉంది. దొంగే దొంగ అన్నట్లుగా ఉంది. కడియం శ్రీహరికి దళిత దొర అనే పేరుంది. అవినీతితో ఆస్తులు సంపాదించింది ఆయనే. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్సార్ నాకు రాజకీయ గురువు. అలాగే.. కేసీఆర్ తనకు దేవుడని, ఆయన ఆశీస్సులతో కాళోజీ హెల్త్ యూనివర్సిదొటీ తేవడంతో పాటు గ్రాస్ రూట్లో ఉన్న వైద్యవిధానాన్ని.. క్షేత్రస్థాయిలో చూశా గనుక ప్రక్షాళన చేయాలని ఆనాడు ప్రయత్నించానని రాజయ్య చెప్పుకొచ్చారు. కాకిలా కలకలం కాకుండా.. కోకిలలా కొంతకాలం ఉండి ప్రజామెప్పు పొందానని అన్నారు. రాజకీయ ఆరోపణలు.. విమర్శలు, మీడియాలో వచ్చిన అసత్య కథనాలతో తెలంగాణ అభాసుపాలు కావొద్దన్న ఉద్దేశంతో.. కేసీఆర్ వీరవిధేయుడిగా ఆయన మాట మీద ఆనాడు పదవి నుంచి తప్పుకున్నానని చెప్పుకొచ్చారు రాజయ్య. ఇదిలా ఉంటే.. కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య సంచలన ఆరోపణలు చేయగా, కౌంటర్‌గా ఇవాళ కడియం మాట్లాడుతూ.. స్టేషన్ ఘనపూర్ నీ జాగిరి కాదు అంటూ రాజయ్యపై మండిపడ్డారు. ఇదీ చదవండి: ‘ఒళ్లు దగ్గర పెట్టుకో..’ తాటికొండ రాజయ్యపై కడియం శ్రీహరి ఫైర్ -
స్వగ్రామానికి చెందిన యువతితో ప్రేమ.. మరొకరిని ప్రేమిస్తోందని తెలిసి..
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్ (వరంగల్): ప్రియురాలు ఫోన్ లేపట్లేదని ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. డివిజన్ కేంద్రంలోని రైస్‌మిల్లులో ఆపరేటర్‌గా పనిచేసే కార్మికుడు అమిత్‌కుమార్(20) మనస్తాపంతో సోమవారం ఉరేసుకున్నాడు. అమిత్‌కుమార్ స్వగ్రామం బీహార్ రాష్ట్రం మధువనిలోని బాలువాటోల్ గ్రామం. నాలుగు నెలలుగా ఘన్‌పూర్‌లోని రైస్‌మిల్లులో పని చేస్తున్నాడు. స్వగ్రామానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. రోజూ ఆమెతో ఫోన్ మాట్లాడేవాడు. కొద్ది రోజులుగా ఆమె ఫోన్ చేయడం లేదని మనస్థాపానికి గురయ్యాడు. స్నేహితులను వాకబు చేయగా.. ఆమె మరొకరిని ప్రేమిస్తోందని వారు సమాధానమిచ్చారు. దాంతో అమిత్‌కుమార్ మనోవేదనకు గురయ్యాడు. ఆదివారం సాయంత్రం నుంచి తెల్లవారు జాము వరకు పలుమార్లు ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మిల్లులోనే ఉరేసుకున్నాడు. ఉదయం తోటి కార్మికులు గమనించి మిల్లు యజమానికి సమాచారం అందించారు. యజమాని పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా చేశారు. పోస్ట్‌మార్టం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సహ కార్మికుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (అమ్మా.. తెల్లారింది లేమ్మా!) -
హన్మయ్య నీది ఎంతపెద్ద మనసయ్య.. వారి రుణం తీర్చుకోవడం కోసం..
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్: తనకు యవ్వనంలో అశ్రయం కల్పించడంతో పాటు ప్రేమ వివాహానికి సహకరించిన వారిపై ఓ వ్యక్తి కృతజ్ఞతభావం చూపాడు. వారి మనవడి వివాహానికి హాజరై వధువు తరఫున పెళ్లి పెద్దగా నిలిచి కన్యాదానం చేయడంతో పాటు ఖర్చులకు రూ.5లక్షలు అందించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లికి చెందిన హన్మయ్య తన 20వ ఏటా కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో పెద్దలకు భయపడి జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లికి రాగా తండా వాసులు వారికి ఆశ్రయం కల్పించి ఆసరాగా నిలిచారు. ఈ క్రమంలో హన్మయ్య వ్యాపారంలో రాణిస్తూ జీవితంలో స్థిరపడ్డాడు. చదవండి: (‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్మల్ని ఎవరు చూస్తారు') కాగా తన ప్రేమ వివాహ సమయంలో సహకరించిన గిరిజనుల మనమడు అనిల్ వివాహం నిశ్చయం కాగా ఆ కుటుంబ రుణం తీర్చుకోవాలని హన్మయ్య సంకల్పించాడు. వధువు పూజితకు తండ్రి లేకపోవడంతో ఆమెకు తండ్రి స్థానంలో నిలిచి వరుడు అనిల్ కాళ్లు కడిగి కన్యాదానం చేశాడు. శనివారం స్థానిక కేఆర్ గార్డెన్లో జరిగిన వివాహంలో ఆయన కన్యాదానం చేసి రూ.5లక్షలు అందించారు. స్వయంగా సేవా గుణం ఉన్న హన్మయ్య పెద్దపల్లిలో సొంత ఖర్చులతో పాఠశాలను కట్టించడమే కాకుండా విద్యార్థులకు పుస్తకాలు, సైకిళ్లు అందించి సమాజ సేవ చేస్తున్నాడు. కాగా వధువు తరఫున పెద్దగా నిలిచి కన్యాదానం చేయడంపై అందరూ అభినందించారు. చదవండి: (పాము విషం విక్రయం గుట్టురట్టు.. ఒక కిలో పాము విషం కోటిన్నర..?!) -
వాట్సాప్ మెసేజ్: సారీ డాడీ.. ఎలా చెప్పాలో తెలియట్లేదు..
స్టేషన్‌ఘన్‌పూర్: ఎక్కువ సమయం సెల్ఫోన్లో వీడియో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించాడని ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నా డు. అంతకు ముందు ‘సారీ.. డాడీ’ అంటూ తండ్రి కి వాట్సాప్ సందేశం పంపాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఉప్పుగల్లుకు చెందిన కోరు కొప్పుల రాజు, అనిత దంపతుల కుమారుడు శ్రీచరణ్‌గౌడ్ పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. లాక్డౌన్ కారణంగా ఇంటి వద్దే ఉంటున్న శ్రీచరణ్ ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండటంతో తండ్రి ఆదివారం మందలించాడు. మనస్తాపానికి గురైన శ్రీచరణ్ ఆదివారం రాత్రి భోజనం చేశాక కుటుంబసభ్యులు నిద్రపోయే వరకు ఉండి, రాత్రి 11 గంటలకు బైక్‌పై స్టేషన్‌ఘన్‌పూర్ వెళ్లాడు. 12.54 గంటలకు తండ్రి ఫోన్‌కు ‘ఐయామ్ వెరీ సారీ డాడీ.. అమ్మ, చెల్లెను బాగా చూసుకో’అని వాట్సాప్ మెస్సేజ్ పంపాడు. రాత్రి 1.10 గంటలకు ‘ఐయామ్ వెరీవెరీ సారీ డాడీ.. నా సమస్యను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. డాడీ, మమ్మీ, చెల్లి మేఘీ ఐ మిస్ యూ’అంటూ మరోసారి మెసేజ్ పంపాడు. రాత్రి 1.15 గంటలకు రైల్వేస్టేషన్ లొకేషన్ షేర్ చేశాడు. నిద్రలో ఉండటంతో ఎవరూ చూడలేదు. రాత్రి 1.20 గంటలకు ఘన్పూర్ రైల్వే స్టేషన్లో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం సెల్లో మెస్సేజ్‌లు చూసిన రాజు హుటాహుటిన ఘన్‌పూర్‌కు వెళ్లే సరికి కుమారుడి తల, మొండెం విడిపోయి విగతజీవుడై పడి ఉండటంతో బోరున విలపించాడు. (చదవండి: రేఖ హత్య: సూత్రధారి మాలా.. ఎన్నికల కోసమేనా?!) -
'నా అనుమతి లేనిదే నియోజకవర్గానికి రావద్దు'
సాక్షి, వరంగల్ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య వ్యాఖ్యలు మరోసారి వివాదస్పదంగా మారాయి. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆయన చేసిన హెచ్చరికలు ఎవరిని ఉద్దేశించినవనే చర్చ మొదలైంది. ‘ఎమ్మెల్యేకు తెలియకుండా ఎమ్మెల్సీ, ఎంపీ, జడ్పీ చైర్మన్, మంత్రి.. ఇలా ఎవరూ నియోజకవర్గాలకు రావొద్దు.. వారంతట వారే వస్తే గ్రూపు రాజకీయాలను ప్రోషించినట్లుగా భావించాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.. పార్టీ గమనిస్తోంది.. ఎంతటి నాయకులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అంటూ ఈసారి ఆయన తన స్వరాన్ని మరింత పెంచారు. ఇంతకాలం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య మధ్య నెలకొన్న విబేధాల కారణంగా ఒకరిపై పరోక్ష వ్యాఖ్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నా యి. అయితే సోమవారం రాజయ్య మాట్లాడుతూ తన ఆహ్వానం లేనిదే నియోజకవర్గంలో ఎవరూ తిరగొద్దంటూ వివిధ పదవుల్లోని ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడడంతో ఈసారి ఆయన ఎవరినీ హెచ్చరించినట్లన్న చర్చ టీఆర్ఎస్ శ్రేణుల్లో జరుగుతోంది. అధికార పార్టీలో కలకలం టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో పార్టీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ కలకలం రేపాయి. నియోజకవర్గానికి ఎవరు రావాలన్నా ఎమ్మెల్యే అనుమతి తప్పని సరని ఆయన హుకూం జారీ చేయడం గమనార్హం. ‘పార్టీలు, నాయకులకు అభిమానులు ఉండొచ్చు. కానీ, దానిని అడ్డం పెట్టుకుని గ్రూపు రాజకీయాలకు పాల్పడితే చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. (ఆ తేదీనే ఎన్నికలు జరుగుతాయ్: ట్రంప్) సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.3 కోట్ల సీడీఎఫ్ నిధులు, రూ. 2.5 లక్షల వేతనం విరాళంగా ఇచ్చానని చెప్పుకొచ్చిన ఆయన.. ఇటీవల హైదరాబాద్‌లో కొందరు చెక్కులు ఇచ్చారని, అక్కడ ఇస్తే సముద్రంలో చెంబుతో నీళ్లు పోసినంత సమానమంటూ చెప్పడంపై చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య కొంతకాలంగా గ్రూపు రాజకీయాలు, విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడం, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రెండు గ్రూపుల వారిని వేర్వేరు సమయాల్లో తరలించడం అప్పట్లో వివాదస్పదంగా మారింది. అయితే ఈసారి ‘ఎమ్మెల్సీ, ఎంపీ, జెడ్పీ చైర్మన్, మంత్రి.. నిబంధనలు పాటించకుండా వస్తున్న ఎంతటి పెద్ద నేతలైనా వారిపై చర్యలు తప్పవు.. వారంతా ఎమ్మెల్యే కనుసైగల్లో, ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు నియోజవర్గంలోకి రావాలి... అలా కాకుండా ఎవరొచ్చినా గ్రూపు రాజకీయాలకు ప్రోత్సహించినట్లే, గ్రూపు రాజకీయాలు చేస్తే తస్మాత్ జాగ్రత్త’ అంటూ హెచ్చరించడం గమనార్హం. ‘ఎవరు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనేది పార్టీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.. పార్టీల్లో ఉన్నప్పుడు నిబంధనలకు కట్టుబడి ఉండాలి.. అందులో అధికార పార్టీకి నిబంధనలు మరింత కఠినంగా ఉంటా యని గ్రహించాలి’ అని సూచించారు. పా ర్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే వా జుజరు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని రాజయ్య హెచ్చరించడం టీఆర్ఎస్ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. -
నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్..
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్: ‘నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సుపీరియర్, బాస్. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరైనా సరే ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా నియోజకవర్గంలో పర్యటించొద్దు..’అని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ టీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం పార్టీ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్ ఎవరైనా సరే ఎమ్మెల్యే ఆహ్వానం మేరకే నియోజకవర్గంలోకి రావాలన్నారు. అలాకాకుండా వస్తే గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించినట్లవుతుందని, ఎవరైనా పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపారు. వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఏ ప్రపోజలయినా అధికారులు ఎమ్మెల్యే ద్వారానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారన్నారు. 119 నియోజకవర్గాల్లో ఏవిధంగా జరుగుతుందో ఘన్‌పూర్‌లో కూడా అలాగే జరుగుతుందని.. జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించేవారు ఎంతటివారైనా సహించేది లేదని తెలిపారు. చదవండి: ‘కొండపోచమ్మ’కు డెడ్‌లైన్ మే 15.. -
కుమార్తెకు సెండాఫ్ ఇచ్చి వస్తుండగా..
స్టేషన్‌ఘన్‌పూర్: ఉన్నత చదువుల కోసం కుమార్తెను ఆస్ట్రేలియాకు పంపేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో సెండాఫ్ ఇచ్చి తిరిగి వస్తుండగా జనగామ జిల్లా ఘన్పూర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హన్మకొండ బాలసముద్రంకు చెందిన ఝాన్సీరాణి(45) మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానిక ఎస్సై రవి కథనం ప్రకారం... హన్మకొండ బాలసముద్రంకు చెందిన వీరారెడ్డి, ఝాన్సీరాణి దంపతుల కుమార్తె కృష్ణశ్రేయను ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు పంపించేందుకు ఝాన్సీరాణి తల్లిదండ్రులైన హేమలత, సుదర్శన్‌రెడ్డితో కలిసి ఐదుగురు కారులో హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు ఆదివారం వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున కృష్ణశ్రేయను ఫ్లైట్ ఎక్కించిన తర్వాత నలుగురు తిరిగి హన్మకొండకు బయల్దేరారు. వీరారెడ్డి కారు డ్రైవింగ్ చేస్తుండగా పక్క సీట్లో ఝాన్సీరాణి, అచ్చాయమ్మ, సుదర్శన్‌రెడ్డి వెనుక సీట్లో కూర్చున్నారు. ఈ క్రమంలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఘన్పూర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఝాన్సీరాణితోపాటు మిగిలిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై రవి ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో గాయపడ్డ వారిని చికిత్సనిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలైన ఝాన్సీరాణి మార్గమధ్యలోనే మృతిచెందినట్లు తెలిపారు. మిగిలిన వారు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. -
రాజయ్య పద్ధతి మార్చుకోవాలి : కడియం
సాక్షి, హైదరాబాద్ : స్టేషన్ ఘన్పూర్ టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్య! పద్ధతి మార్చుకోవాలని, ‘నా నియోజకవర్గం’ అని అనకుండా మనది అనాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హితవు పలికారు. కలహాలు మాని కలిసి పనిచేయాల్సిందిగా రాజయ్యకు పిలుపునిచ్చారు. గురువారం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఓటు హక్కు వచ్చిన దగ్గరనుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని తెలిపారు. రూమర్లను పట్టించుకోకుండా కేసీఆర్ ఆదేశాల మేరకు రాజయ్య గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. టీఆర్ఎస్ బలపడాలన్నా, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్నా స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజయ్యను గెలిపించాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. రాజయ్య కూడా అందరిని కలుపుకునిపోవాలని, కేసీఆర్ పట్ల ఇష్టం ఉన్నవాళ్లు, కడియం శ్రీహరి అంటే అభిమానం ఉన్న వాళ్ళంతా రాజయ్య అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు. ఆయన తన ప్రసంగాన్నికొనసాగిస్తూ.. ‘‘జరిగిందేదో జరిగిపోయింది.. జరగాల్సింది చూడాలి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు తిరుగులేదు. మనమందరం కలిస్తే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు. రాజయ్యకు నా పూర్తి సహాకారం ఉంటది, నన్ను అభిమానించే వారందరు పూర్తి స్థాయిలో రాజయ్యకు సహాకరించాలి. రాజయ్య వర్గీయులు, నా వర్గీయులు, ఉద్యమకారులు అంతా కలిసి స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండా ఎగురవేయాల’ని అన్నారు. -
ఏటీఎం నుంచి డబ్బుల అపహరణ
► పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు స్టేషన్‌ఘన్‌పూర్: ఫోన్లో ఏటీఎం నంబర్ అడిగి మండలంలోని రాఘవాపూర్‌కు చెందిన అంగన్వాడీ ఆయా షేక్ ముంతాజ్‌బేగం బ్యాంకు అకౌంట్ నుంచి ఓ అపరిచిత వ్యక్తి రూ.14వేలు అపహరించిన సంఘటన సోమవారం జరిగింది. ఈ విషయమై మంగళవారం బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడింది. రాఘవాపూర్‌కు చెందిన షేక్ముంతాజ్బేగంకు ఘన్పూర్ ఎస్బీహెచ్లో ఖాతా ఉంది. సోమవారం గుర్తుతెలియని వ్యక్తి 7808201136 నంబర్ నుంచి ఫోన్ చేసి తాను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానని, మీ ఏటీఎం బ్లాక్ అయిందని, ఏటీఎం నంబర్ చెప్పాలని అడగగా 16 అంకెల నంబర్ చెప్పింది. నంబర్ చెప్పిన గంటలోపే తన అకౌంట్నుంచి రూ.9999, మరి కొద్దిసేపట్లో రెండు సార్లు రూ.2వేల చొప్పున డ్రా అయినట్లు సెల్ మెసేజ్ వచ్చింది. మొత్తం మూడు విడతలుగా రూ.14వేలు డ్రా చేసుకున్నారని, వెంటనే స్థానిక ఎస్బీఐకు చేరుకుని బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేసి ఏటీఎంను బ్లాక్ చేయించింది. ప్రస్తుతం అపరిచిత వ్యక్తికి ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తుందని, ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, నిందితుడిని గుర్తించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. -
స్టేషన్‌ఘన్‌పూర్‌లో 144 సెక్షన్
వరంగల్ : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై రాష్ట్రంలో అక్కడకక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో వారం రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్టేషన్ఘన్పూర్ను కొత్తగా ఏర్పడే జనగామ జిల్లాలో కలపొద్దంటూ స్థానికులు ధర్నాలు, నిరసన ప్రదర్శనలకు దిగనున్నారు. దీంతో బుధవారం నుంచి వారం రోజుల పాటు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
వైఎస్ జగన్ ప్రచారహోరు
-
దేవాదుల గేట్ వాల్వును విప్పిన రైతులు
-గ్రామ చెరువులు నింపుకునేందుకు యత్నం స్టేషన్‌ఘన్‌పూర్: వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని చిల్పూరు- మల్కాపూర్ గ్రామాల మధ్య నుంచి వెళ్తున్న రెండో దశ పైప్‌లైన్ గేట్ వాల్వును ఆదివారం రైతులు విప్పి.. చెరువులు నింపుకున్నారు. దేవాదుల పైప్‌లైన్ ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి మల్లగండికి అధికారులు నీటిని పంపిస్తున్నారు. అయితే, వర్షాభావంతో నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో పాటు మూగ జీవాలు సైతం నీళ్లులేక అల్లాడుతుండడంతో చూడలేక ఆదివారం మల్కాపూర్, వెంకటాద్రిపేట, చిల్పూరు రైతులు సమావేశమయ్యారు. చిల్పూరు-మల్కాపూర్ గ్రామాల మద్య ఉన్న గేట్ వాల్వును విప్పితే సమభాగంగా మూడు గ్రామాల్లోని చెరువుల్లోకి నీరు చేరుతుందని దీంతో మూగ జీవాలను కాపాడుకోవ చ్చని నిర్ణయించుకున్నారు. ఆదిఆవరం రాత్రి సమయంలో గేట్‌వాల్వును విప్పడంతో ఒక్కసారిగా నీరు ఎగజిమ్మింది. నీరు చెరువుల్లోకి చేరుతోంది. అయితే, తాము ఒకరి కోసం ఈపని చేయలేదని కనీసం మూగ జీవాలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈపని చేశామన్నారు. గేట్‌వాల్యూ విప్పిన విషయం అదివారం రాత్రి పొద్దుపోయేంత వరకు అధికారుల దృష్టికి రాలేదని సమాచారం. -
పిచ్చికుక్క స్వైరవిహారం
స్టేషన్‌ఘన్‌పూర్ : వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో శనివారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కనపడిన ప్రతి ఒక్కరినీ కరవడం మొదలెట్టింది. శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో పాటు, మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారికి స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు పిచ్చికుక్కలను అదుపు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. -
గోదావరి ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఇద్దరి మృతి
వరంగల్(స్టేషన్‌ఘన్‌పూర్): స్టేషన్‌ఘన్‌పూర్‌లో రైల్వే గేటు దాటుతుండగా రైలు ఢీకొనడంతో మంగళవారం ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో అక్షయ అనే ఐదేళ్ల చిన్నారితో పాటు చిన్నారి నానమ్మ ఓలం స్వరాజ్యం(60) అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. రైల్వే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృత దేహాలను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఆసరా’ ఆందోళన
వృద్ధుల కడుపు మండింది.. వికలాంగులు కన్నెర్ర జేశారు.. వితంతువులు నిరసనాగ్రహం వ్యక్తం చేశారు..! ‘ఆసరా’ పింఛన్ జాబితాలో అర్హులను తొలగించి అనర్హులకు చోటు కల్పించడం వివాదాస్పదంగా మారింది. జాబితాలో తమ పేరు లేకపోవడంపై అర్హులు రోడ్డెక్కారు.. అధికారులను నిర్బంధించారు.. కుర్చీలను ధ్వంసం చేశారు..గ్రామసభలను బహిష్కరించారు.. - సాక్షి ప్రతినిధి, వరంగల్ పింఛన్ రాలేదనే బెంగతో వృద్ధురాలి హఠాన్మరణం స్టేషన్‌ఘన్‌పూర్ : పింఛన్ రాలేదని బెంగతో స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడేనికి చెందిన గొడిశాల శేషమ ్మ(80) మృతిచెందింది. శేషమ్మకు గతంలో పింఛన్ వచ్చేది. సోమవారం ప్రకటించిన ఆసరా జాబితాలో పేరు లేదని ఆమెకు తెలిసింది. తీవ్ర మనస్తాపానికి గురై హఠాత్తుగా కుప్పకూలి మృతిచెందింది. ఇద్దరు అంధులను ఎలా సాదాలి దేవుడా... కేసముద్రం : పెద్ద దిక్కులేని ఆ ఇంటిలో ఇద్దరు బిడ్డలు సామేల్, స్వప్న అంధులే. కేసముద్రం స్టేషన్‌కు చెందిన వారు. భర్త చనిపోగా, బిడ్డలకు నిత్యం దగ్గరుండి సాకుతూ వస్తోంది తల్లి రమ. కొత్తగా మంజూరైన పింఛన్ జాబితాలో తమ పేరు ఉందో.. లేదోనని ఉత్కంఠగా గ్రామసభకు వచ్చారు. ముగ్గురిలో తల్లి, కొడుకు పేరు లేదని తెలియడంతో అంధుడు సామేల్ స్పృహ తప్పి కుప్పకూలాడు. కొడుకు ముఖంపై నీళ్లు చల్లింది. అంధులైన కొడుకు, కూతుర్ని పట్టుకుని.. ‘నా బిడ్డలను ఎలా సాదాలి దేవుడా’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది. స్టేషన్‌ఘన్‌పూర్ : వెంకటాద్రిపేటలో గీత కార్మిక పింఛన్ రద్దు చేయడంతో తాడగోని లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జఫర్‌గఢ్ మండలంలో పింఛన్ల జాబితాను చదువుతుండగా అడ్డుకుని చించేశారు. మహబూబాబాద్ : వేమునూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ అభ్యుదయ అధికారి రుద్రను, సిబ్బందిని లబ్ధిదారులు నిర్బంధించారు. బేతోలులో జాబితాలో పేర్లులేని అర్హులు కొందరు టెంట్లను చించివేసి కుర్చీలను ధ్వంసం చేశారు. వర్ధన్నపేట : సర్వే చేసిన అధికారి వచ్చి జాబితా ప్రదర్శించాలని స్థానికులు డిమాండ్ చేయడంతో ల్యాబర్తిలో గ్రామసభ జరగలేదు. రెడ్డిపాలెంలో సభను నిర్వహించకుండా అధికారులు వెనుదిరిగారు. ములుగు : వెంకటాపూర్ మండల కేంద్రంలోని వికలాంగుడు రెడ్డి కోటయ్య పేరును అధికారులు వితంతువు పింఛన్ దారుల లిస్టులో ప్రకటించారు. వరంగల్ తూర్పు : పింఛన్ల జాబితాలో రిటైర్డ్ తహసీల్దార్‌కు చోటుదక్కింది.వరంగల్ నగరంలోని 7వ డివిజన్ చింతల్ కుమ్మరివాడలో నగర పాలక సంస్థ ప్రదర్శించిన జాబితాలో ఆ పేరును చూసి స్థానికులు నివ్వెరపోయూరు. నిలదీయడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. జాబితాలో పేరు తొలగించాలని రంగయ్య నుంచి దరఖాస్తు తీసుకున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఆసరా పథకం కింద వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు ఇచ్చే సామాజిక పింఛన్ల అర్హుల జాబితా వెల్లడి జిల్లావ్యాప్తంగా గందరగోళానికి దారితీసింది. అధికారులు సోమవారం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల అర్హులు, అనర్హులు, పరిశీలనలో ఉన్న వారి పేర్లను వేర్వేరుగా జాబితాలు పెట్టారు. ఇందులో అర్హత ఉండి జాబితాలో పేరు లేని వారు, ప్రస్తుతం పింఛను పొందుతున్న వారు కొత్త జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై నిరసనకు దిగారు. జాబితా రూపకల్పనలో అక్రమాలు జరిగినట్లు ఆరోపించారు. జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై ఆందోళనకు దిగారు. నియోజకవర్గాల వారీగా పరిస్థితిని సమీక్షిస్తే.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం : ఆసరా పింఛన్ల జాబితాల ప్రకటనపై నాలుగు మండలాల్లో వృద్ధులు, వితంతువులు నిరసనలు వ్యక్తం చేశారు. ఇప్పగూడెంలో అధికారులను సీపీఎం నాయకులు నిర్బంధిం చారు. పింఛన్ రాదేమోనని బెంగతో వృద్ధురాలు శేషమ్మ మృతిచెందింది. వెంకటాద్రిపేటలో గీత కార్మిక పింఛన్ రద్దు చేయడంతో లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు యత్నించా డు. రఘునాథపల్లి మండలంలో స్థానికులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిం చారు. జఫర్‌గఢ్ మండలంలో పింఛన్ల జాబి తా చదువుతుండగా అడ్డుకుని చించేశారు. మహబూబాబాద్ : పింఛన్ల కోసం 4,780 దరఖాస్తులు వచ్చాయి. 1,751 మందితో అర్హుల జాబితాను వెల్లడించారు. 1,764 పెండింగ్‌లో పెట్టారు. 1,265 అనర్హుల జాబి తాను తయారు చేశారు. అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడంపై కమిషనర్ రాజ లింగును లబ్ధిదారులు నిలదీశారు. 23 వార్డు కౌన్సిలర్ బి.అజయ్ అర్హుల జాబితాను అధికారుల ఎదుటే చించివేసి నిరసన తెలియజేశారు. వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సీపీఐ, సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్ ధర్నా నిర్వహించాయి. మహబూబాబాద్ మండలం వేమునూరు పంచాయతీ కార్యాలయంలో గ్రామ అభ్యుదయ అధికారి రుద్రను, సిబ్బందిని లబ్ధిదారులు నిర్బంధించారు. బేతోలులో జాబితా లో పేర్లులేని అర్హులు కొందరు టెంట్లను చించి, కుర్చీలను ధ్వంసం చేశారు. కేసముద్రంలో పింఛను జాబితాలో పేరు లేకపోవడంతో సామెల్ సృ్పహ తప్పి పడిపోయాడు. నర్సంపేట : పింఛన్లకు అర్హత ఉన్నా వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో అధికారుల ఎదు ట పలువురు నిరసన తెలిపారు. నర్సంపేట-వుల్లంపల్లి రహదారిపై రాస్తారోకో చేపట్టారు. చెన్నారావుపేట వుండలం బాపునగర్, గుర్రాలగండిరాజపల్లిలో అధికారుల ను పంచాయుతీ కార్యాలయూల్లో నిర్బంధించారు. నెక్కొండ వుండల కేంద్రంలో ఎడ్ల సవ్ముక్క 90 శాతం అంగవైకల్యం కలిగినట్లు ఉన్నప్పటికి లీస్టులో పేరు లేకపోవడంతో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లి : గణపురం మండలం చెల్పూరులో జాబితలో తమ పేరు లేదని నిరసన తెలిపారు. శాయంపేట హుస్సేన్‌పల్లిలో గతంలో 67 మంది పింఛన్‌దారులు ఉన్నా రు. ప్రస్తుతం 27 మందికే పింఛన్లు మం జూ రు చేయడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు పంచాయతీ కార్యాలయంలో అధికారులు నిర్బం ధించి తాళం వేశారు. పత్తిపాకలో ఎంపీడీఓ భద్రూనాయక్పై టీఆర్ఎస్ నేత దుబాసి క్రిష్ణమూర్తి, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎంపీడీఓపై ఒకరు చేయిచేసుకున్నట్లు తెలిసింది. చిట్యాల మండలం తిరుమలాపూర్, రామకిష్టాపూర్(టి), గర్మిళ్లపల్లి, జడల్పేట, నైన్పాక దాదాపు వేల మంది అర్హులకు పింఛన్లు మంజూరు కాకపోవడంతో గ్రామసభలను బహిష్కరించారు. వర్ధన్నపేట : వర్ధన్నపేట మండలం ఇల్లందలో లబ్ధిదారులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. జాబితా తప్పుల తడకగా ఉం దని పెరుమళ్లగూడెంలో జాబితాను చింపివేసి గ్రామసభను అడ్డుకున్నారు. సర్వే చేసిన అధికారి వచ్చి జాబితా ప్రదర్శించాలని స్థానికులు డిమాండ్ చేయడంతో ల్యాబర్తిలో గ్రామసభ జరగలేదు. రెడ్డిపాలెంలో సభను నిర్వహించకుండా అధికారులు వెనుదిరిగా రు. పర్వతగిరి మండలం అన్నారం అధికారులను, సిబ్బందిని పంచాయతీ కార్యాలయంలో నిరంచారు. హసన్‌పర్తి మండలం నాగారంలో వీఆర్వో లెనిన్పై లబ్ధిదారులు దాడికి ప్రయత్నించారు. డోర్నకల్ : డోర్నకల్ మండలంలో 5,454 మందిని పింఛన్లకు అర్హులుగా గుర్తించగా, డోర్నకల్తోపాటుకురవి, గుండ్రాతి మడుగులో తమకు పింఛన్ రాలేదంటూ మహిళలు అధికారులను నిలదీశారు. జనగామ : జనగామ మండలం వడ్లకొం డలో పలువురు వృద్ధులు ఆందోళన చేపట్టారు. చేర్యాల మండలంలో మండలంలోని ఆకునూరు, చుంచునకోటల్లో ధర్నాలు చేపట్టారు. మద్దూరు, బచ్చన్నపేట, నర్మెట్ట మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పరకాల : పరకాలలోని వెలుమవాడ, పద్మశాలివాడలో జరిగిన సభలో వితంతులు తమ పేర్లు రాక పోవడంతో నిరసన వ్యక్తం చేశారు. గీసుకొండ మండలంలోని ధర్మారంలో అధికారులు ఎవ్వరు రాకపోవడంతో గ్రామ సభను నిర్వహించలేదు. పాలకుర్తి : తొర్రూరు, రాయపర్తి, పాలకుర్తి, దేవరుప్పుల మండలాల్లోని పలు గ్రామాల్లో పింఛన్లు పొందుతున్న ప్రస్తుత లబ్ధిదారుల పేర్లు తొలగించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరుప్పుల మండలం కడవెండిలో లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. ములుగు : వెంకటాపూర్ మండల కేంద్రం లోని వికలాంగుడు రెడ్డి కోటయ్య పేరును అధికారులు వితంతువు పింఛన్ దారుల లిస్టులో ప్రకటించారు. గోవిందరావుపేట మండలం చల్వాయిలో ఆర్డీఓ మహేందర్‌జీని లబ్ధిదారులు నిలదీశారు. ఏటూరునాగారం మండలంలో జాబితాను తప్పులతడకగా ప్రకటించడంతో లబ్ధిదారులు.. నాయకులను, అధికారులను నిలదీశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్ తూర్పు : రంగశాయిపేట, ఉర్సు, కరీమాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇంతకు ముందు పింఛన్లు తీసుకుని ఇప్పుడు లిస్ట్‌లో పేరురాని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ధ్రువపత్రాలు సమర్పించినా మా పేర్లెందుకు లిస్ట్‌లో లేవని పలువురు మహిళలు తమ గోడు వినిపించారు. వరంగల్ పశ్చిమ : ప్రస్తుతం అర్హులుగా ఉండి.. కొత్త జాబితాలో పేరు లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. ‘తెలంగాణ వస్తే తెలంగణ వస్తే మంచిగ బతుకుతం’ అని అనుకున్నామని.. రెండు వందల పెంఛనుకు బదులుగా రూ.1000 పెంచితే మాకు కడుపునిండ అన్నం దొరుకుతుందని ఆశపడ్డామని, రూ.200 కూడా రాకపోయే అని పలువురు పింఛన్‌దారులు అధికారులపై శాపనార్థాలు పెట్టారు. ఇప్పటికైనా అర్హులైన వారందరికి పింఛన్లు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
చిన్నపెండ్యాలలో జూనియర్ డాక్టర్లు
చిన్నపెండ్యాల (స్టేషన్‌ఘన్‌పూర్) : ‘పల్లె ప్రజల ఆరోగ్యం - జూనియర్ డాక్టర్ల లక్ష్యం’ నినాదంతో చలో పల్లె కార్యక్రమంలో భాగంగా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని చిన్నపెండ్యాల పంచాయతీ ఆవరణలో మంగళవారం జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం ఉస్మానియా, ఎంజీఎం, గాంధీ ఆస్పత్రుల నుంచి 45 మంది డాక్టర్లు గ్రామానికి రాగా... శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది. ఉచిత వైద్య శిబిరాన్ని సర్పంచ్ తాళ్లపల్లి సమ్మయ్య గౌడ్, ఉపసర్పంచ్ గుంపుల రవీందర్ రెడ్డి ప్రారంభించారు. శిబిరానికి వచ్చిన రోగులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ గ్రామీణ, అటవీ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తే స్థానికంగా ఉంటూ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం 44 రోజులుగా సమ్మె చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తే ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమేనని మొదటిరోజు నుంచి చెబుతున్నామని, అయినా ప్రభుత్వం స్పందించకుండా తమపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ప్రజలే ప్రభుత్వం అయినందున గ్రామాల్లోకి వచ్చి తమకు జరుగుతున్న అన్నాయాన్ని వివరిస్తున్నామన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల ఆరోగ్య వ్యస్థకు జరిగే అన్నాయాన్ని ఎదుర్కోమని చెప్పేందుకే చలో పల్లె కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. -
15 మంది ఎంపీటీసీలు కిడ్నాప్
-
15 మంది ఎంపీటీసీలు కిడ్నాప్
వరంగల్: స్టేషన్‌ఘన్‌పూర్ ఎంపీపీ పీఠం పోటాపోటీ నెలకొంది. నేడు స్టేషన్‌ఘన్‌పూర్ ఎంపీపీ ఎన్నిక జరగనుంది. ఎన్నిక కోసం వస్తున్న 15 మంది ఎంపీటీసీలు కిడ్నాప్ కు గురయ్యారు. జనగామ మండలం పెంబర్తి వద్ద ప్రత్యర్థి వర్గం దాడి చేసి వీరిని అపహరించినట్టు చెబుతున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ ఆధిక్యం సాధించినప్పటికీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య, ఎంపీ కడియం శ్రీహరి వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీటీసీల కిడ్నాప్ జరిగినట్టు చెబుతున్నారు. -
బస్సులో 15తులాల బంగారు అపహరణ
-
శుభకార్యానికి వెళ్తుండగా...
ఎదురొచ్చిన మృత్యువు =ఇంటిల్లిపాదిని కబళించిన రోడ్డు ప్రమాదం =స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద కారు, డీసీఎం ఢీ.. =నలుగురు అక్కడికక్కడే మృతి తెల్లారితే.. చెల్లెలు ఇంట్లో శుభకార్యం.. ఆ అక్క తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలుదేరింది. ఆనందంగా బయలుదేరిన ఆ కుటుంబానికి మృత్యువు ఎదురొచ్చింది. ఇంటి నుంచి 30కిలోమీటర్లు వెళ్లారో లేదో.. ఘోరం జరిగిపోయింది. డీసీఎం వ్యాన్ రూపంలో యమపాశం.. కారులో ఉన్న నలుగురిని కబళించింది. బుధవారం.. ఇంకా పూర్తిగా తెల్లవారకముందే స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్సీ కాలనీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం వారి ప్రాణాలను బలిగొంది. స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్, న్యూస్‌లైన్ : బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజర య్యేందుకు వెళుతూ ఓ కుటుంబం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. ఈ సంఘటన స్టేషన్‌ఘన్‌పూర్ శివారు ఎస్సీకాలనీ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారు జామున ఆరుగంటలకు చోటుచేసుకుం ది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. హసన్‌ప ర్తి మండలంలోని భీమారం గ్రామానికి చెందిన కొంగరి భాస్కర్(62) ఇరిగేషన్ శాఖలో ఈఈ గా విధులు నిర్వర్తించి ఏడాది క్రితం ఉ ద్యోగ విరమణ పొందాడు. ఈయనకు భార్య పుష్పలత(50), కుమారులు, జీవన్, గోపినాథ్(26), కూతురు హేమలత(24)ఉన్నారు. భాస్కర్ స్వ గ్రామం చేర్యాల కాగా ఉద్యోగ రీత్యా 25 ఏళ్ల క్రి తం ఆయన భీమారంలో సొంతింటిని నిర్మించుకుని కుటుంబంతో అక్కడే స్థిరపడ్డాడు. అయితే నల్లగొండ జిల్లాలోని కొలనుపాకలో ఉంటున్న మరదలు(భార్య చెల్లెలు) రమ, పురుషోత్తం దంపతులు గ్రామంలో కొత్త ఇల్లు కట్టుకునేం దుకు బుధవారం ముగ్గుపోసుకుంటున్నారు. ఈ మేరకు కార్యక్రమానికి హాజరుకావాలని వా రు అక్కబావను ఆహ్వానించారు. దీంతో అక్కడికి వెళ్లేందుకు భాస్కర్ తన భార్య పుష్పలత, కుమారుడు గోపినాథ్, కూతురు హేమలతతో కలిసి భీమారం నుంచి తన టాటా ఇండిగో కా రులో బయలుదేరారు. అయి తే కారును డ్రైవింగ్ చేస్తున్న గోపినాథ్ స్టేషన్‌ఘన్‌పూర్ శివారు ఎస్సీకాలనీ సమీపంలో రోడ్డుపై ఉన్న డివైడర్‌ను గమనించకుండా ఒక్కసారిగా కారును కుడివైపునకు మళ్లించాడు. ఈ క్రమంలో అదే సమయంలో సెర్లాక్ డబ్బాల లోడ్‌తో హైదరాబాద్ నుంచి హన్మకొండ వైపునకు వస్తున్న డీసీఎం వ్యాన్ అదుపుతప్పి కారును వేగంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న భాస్కర్, పుష్పలత, గోపినాథ్ అక్కడికక్కడే మృతిచెందారు. కాగా, డీసీఎం వ్యాన్ డ్రైవర్ నాగేశ్వర్రావుకు స్వల్ఫగాయాలయ్యాయి. కొన ఊపిరితో కొట్టుకున్న హేమలత.. కాగా, రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు, అన్న య్య అక్కడిక్కడే మృతిచెందగా హేమలత కొనఊపిరితో కొద్దిసేపు కొట్టుమిట్టాడినట్లు మార్నిం గ్ వాక్కు వెళ్లిన స్థానికులు తెలిపారు. ప్రమా దం జరిగిన వెంటనే తీవ్రంగా గాయపడిన హే మలత కారు అద్దాలు తీసేందుకు ప్రయత్నించి ఊపిరాడక మృతి చెందినట్లు వారు చెప్పారు. సంఘటనా స్థలాన్ని సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి సందర్శించి గాయపడిన డీసీఎం డ్రైవర్‌ను 108 లో ఆస్పత్రికి తరలించా రు. కారు అద్దాలు పగులగొట్టి... కాగా, నుజ్జునుజ్జయిన కారులో ఇరుక్కున్న మృ తదేహాలను స్థానికుల సహకారంతో పోలీసు లు అతికష్టంగా బయటికి తీశారు. గడ్డపారతో కారు అద్దాలు, డోర్లు పగులగొట్టి తాడు సా యంతో మృతదేహాలను వెలికితీసి రోడ్డు పక్క న పెట్టారు. కాగా, రోడ్డుపై విగతజీవులుగా ఉ న్న భాస్కర్ కుటుంబ సభ్యులను చూసి స్థాని కులు కంటతడిపెట్టారు. ఇదిలా ఉండగా, మృతుడు భాస్కర్ పెద్ద కుమారుడు జీవన్‌కుమార్ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కన్నీరుమున్నీరుగా విలపించిన బంధువులు... రోడ్డు ప్రమాదంలో భాస్కర్, అతడి భార్యాపిల్లలు మృతిచెందిన సమాచారం తెలుసుకున్న బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలపై పడి బోరున విలపించారు. నెల రోజుల్లో హేమలత వివాహం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని.. ఇంతలోనే ఎంత ఘోరం జరిగిందని వారు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించి పోస్టుమార్టం నిర్వహించినట్లు సీఐ తెలిపారు.