సాక్షి, జనగామ: అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ దక్కకపోవడంపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఢీలా పడిపోయారు. ఈ స్థానం నుంచి బీఆర్‌ఎస్ తరపున మాజీ మంత్రి కడియం శ్రీహరి పోటీ చేయనున్నారు. దీంతో.. టికెట్ మీద గంపెడాశలు పెట్టుకున్న రాజయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చుని ఆయన బోరున విలపించారు. అయితే..
టికెట్ దక్కకపోయినప్పటికీ.. అధినేత కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని రాజయ్య స్పష్టం చేశారు. ‘‘బీఆర్‌ఎస్‌లోలో చేరినప్పటి నుండి కేసీఆర్‌కు వీర విధేయుడిగా ఉన్నా. సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి.. అందరూ సమన్వయం పాటించండి. దయచేసి ఎవరినీ బాధ పెట్టొద్దు’’ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేక్రమంలో.. ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో కార్యకర్తలు సైతం ఆయన్ని పట్టుకుని విలపించారు.
‘‘ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రతి గ్రామానికి సీడీఎఫ్ కింద 3 కోట్లు మంజూరయ్యాయి. అభివృద్ధి పనులు కొనసాగుతాయి. 15 సంవత్సరాల రాజకీయ అనుభవం, అధికార కాంగ్రెస్ పార్టీకి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి తెలంగాణ కోసం రాజీనామా చేశా. స్థాయికి తగ్గకుండా ఉన్నత స్థానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.. దళిత బంధుకు 1,100 మందికి వచ్చే విధంగా సిఫారసు చేశా.. ఘనాపూర్ ప్రజల మధ్యే నా జీవితం’’ అని రాజయ్య పేర్కొన్నారు.
కేసీఆర్ న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది: ఎమ్మెల్యే రాజయ్య సతీమణి
ఎమ్మెల్యే రాజయ్యకు బీఆర్‌ఎస్ టిక్కెట్ లభించకపోవడం అన్యాయం కాదని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని ఆయన సతీమణి ఫాతిమా మేరీ అన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరాం. బీఆర్ఎస్‌లోనే ఉంటాం... కడియం శ్రీహరిని ఎమ్మెల్యే గా గెలిపించేందుకు కృషి చేస్తాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment