MLA thatikonda rajaiah
-
భావోద్వేగంతో ఎమ్మెల్యే రాజయ్య కంటతడి
సాక్షి, జనగామ: అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ దక్కకపోవడంపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఢీలా పడిపోయారు. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి కడియం శ్రీహరి పోటీ చేయనున్నారు. దీంతో.. టికెట్ మీద గంపెడాశలు పెట్టుకున్న రాజయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చుని ఆయన బోరున విలపించారు. అయితే.. టికెట్ దక్కకపోయినప్పటికీ.. అధినేత కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని రాజయ్య స్పష్టం చేశారు. ‘‘బీఆర్ఎస్లోలో చేరినప్పటి నుండి కేసీఆర్‌కు వీర విధేయుడిగా ఉన్నా. సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి.. అందరూ సమన్వయం పాటించండి. దయచేసి ఎవరినీ బాధ పెట్టొద్దు’’ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేక్రమంలో.. ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో కార్యకర్తలు సైతం ఆయన్ని పట్టుకుని విలపించారు. ‘‘ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రతి గ్రామానికి సీడీఎఫ్ కింద 3 కోట్లు మంజూరయ్యాయి. అభివృద్ధి పనులు కొనసాగుతాయి. 15 సంవత్సరాల రాజకీయ అనుభవం, అధికార కాంగ్రెస్ పార్టీకి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి తెలంగాణ కోసం రాజీనామా చేశా. స్థాయికి తగ్గకుండా ఉన్నత స్థానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.. దళిత బంధుకు 1,100 మందికి వచ్చే విధంగా సిఫారసు చేశా.. ఘనాపూర్ ప్రజల మధ్యే నా జీవితం’’ అని రాజయ్య పేర్కొన్నారు. కేసీఆర్ న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది: ఎమ్మెల్యే రాజయ్య సతీమణి ఎమ్మెల్యే రాజయ్యకు బీఆర్ఎస్ టిక్కెట్ లభించకపోవడం అన్యాయం కాదని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని ఆయన సతీమణి ఫాతిమా మేరీ అన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరాం. బీఆర్ఎస్లోనే ఉంటాం... కడియం శ్రీహరిని ఎమ్మెల్యే గా గెలిపించేందుకు కృషి చేస్తాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. -
ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక ట్విస్ట్
-
ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక ట్విస్ట్
సాక్షి, వరంగల్: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య మధ్య వేధింపుల పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ నవ్య తన భర్త, ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్‌పై పీస్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని నవ్య స్పష్టం చేశారు. వేధింపులపై మూడు నెలల క్రితం క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య గ్రామ అభివృద్ధికి 25 లక్షలు ఇస్తానని చెప్పి నయాపైస ఇవ్వకపోగా తనకు ఇచ్చినట్లు ప్రచారం చేస్తూ బాండ్ పేపర్ పై అప్పుగా 20 లక్షలు తీసుకున్నట్టు సంతకం పెట్టమని ఎమ్మెల్యేతో పాటు తన భర్త, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏ వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్తపై ఆరోపణలు చేసిన నవ్య భర్తతో కలిసే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నలుగురిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండి: సర్పంచ్ నవ్య కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎమ్మెల్యే రాజయ్య యవ్వారం.. -
సర్పంచ్ నవ్య కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎమ్మెల్యే రాజయ్య యవ్వారం..
సాక్షి, వరంగల్: బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యవహారం సర్పంచ్ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఎమ్మెల్యే రాజయ్యపై ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తాటికొండ రాజయ్య ఓ మహిళా ప్రజాప్రతినిధి ద్వారా డబ్బు ఆశచూపి భర్తను ట్రాప్ చేసి తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆరోపణలు నిజం కాదని, ఎమ్మెల్యేతో రాజీ కుదిరినట్లు బాండ్ పేపర్‌పై సంతకం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. వేధింపుల విషయంలో మూడు నెలల క్రితం సర్పంచ్ నవ్య ఇంటికి ఎమ్మెల్యే రాజయ్య వచ్చి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో గ్రామాభివృద్ధికి 20 లక్షలు ఇస్తానని రాజయ్య చెప్పారని సర్పంచ్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు గతంలో అప్పు కింద రూ. 20 లక్షలు తీసుకుంటున్నట్లు బాండ్ పేపర్‌పై సంతకం పెట్టాలని భర్త ద్వారా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యే వద్ద డబ్బులు తీసుకున్నాననేది అవాస్తమని చెప్పారు. ఈ మేరకు ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయ పోరాటం చేస్తానంటున్నారు సర్పంచ్ నవ్య. తనకు, తన భర్తకు మధ్య ఎమ్మెల్యే రాజయ్య చిచ్చు పెడుతున్నాడని తెలిపారు. ఎమ్మెల్యే రాజయ్య వల్ల తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందని అన్నారు. తమకు ఏదైనా జరిగితే ఎమ్మెల్యేనే కారణమని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని ఆధారాలు బయటపెడతానని చెప్పారు. చదవండి: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాల్సిన అవసరం ఉంది: జూపల్లి కాగా నవ్య ఆరోపణలపై మాట్లాడేందుకు ఎమ్మెల్యే రాజయ్య నిరాకరించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్యను సర్పంచ్ నవ్య ఆరోపణపై నో కామెంట్ అంటూ వెళ్ళిపోయారు. నవ్య భర్త ప్రవీణ్ మాత్రం గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే ఇస్తానన్న ఫండ్స్ ఇవ్వకపోగా తమకు 25 లక్షలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. తమ పేరిట గ్రామ పెద్ద మనిషి రూ. 5 లక్షలు తీసుకోవడంతోనే ఈ గొడవ మొదలైందని చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తమకు నవ్య సంతకం పెడితే పది లక్షలు వస్తాయని భార్యకు చెప్పడంతో తాను ఎమ్మెల్యే, వారి అనుచరులతో కుమ్మక్కైనట్లు ఆరోపిస్తుందని తెలిపారు. అసత్య ప్రచారమే తమ కుటుంబంలో చిచ్చు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
రాజయ్య పయనమెటు!
‘తాటికొండ’ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి సాక్షి ప్రతినిధి, వరంగల్ : స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదుపరి పయనం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రాజయ్య.. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పదవికి దూరమయ్యారు. తెలంగాణలో బర్తరఫ్ అయిన మొదటి మంత్రిగా మిగిలారు. ఏడు నెలల్లోనే పరిస్థితి తారుమారైంది. రాజయ్య ఉప ముఖ్యమంత్రి పదవి పోవడం ఎలా ఉన్నా.. తన దీర్ఘకాల రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరికి ఆ పదవి దక్కడం ఇబ్బందికరంగా మారింది. మంత్రి పదవి రావడం, పోవడం ఎలా ఉన్నా.. ఉన్నతమైన పదవి నుంచి తప్పించిన తీరుపై రాజయ్య అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజయ్య పయనం ఎలా ఉంటుందనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇన్నాళ్లు ఉన్నతమైనన పదవిలో ఉన్న రాజయ్య ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా మారారు. 2019 ఎన్నికల వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా రాజయ్య ఎలా సర్దుకుంటానే అంశంపై టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంత్రి పదవి పోయిన నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలకు బహిరంగ వివరణ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకిలా.. 2009 సాధారణ ఎన్నికల్లో టి.రాజయ్య స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్న సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చారు. 2012 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సన్నిహితుడిగా మారారు. 2014 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవిని తాటికొండ రాజయ్య 2014 జూన్ 2వ తేదీన చేపట్టారు. వరంగల్‌లో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు, వైద్య ఆరోగ్య శాఖలో పలు ఆంశాలపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజయ్య వివరణతో ఈ అంశం సద్దుమణిగిందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో అకస్మాత్తుగా భారీ మార్పులు జరిగాయి.