స్టేషన్‌ఘన్‌పూర్ : వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో శనివారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కనపడిన ప్రతి ఒక్కరినీ కరవడం మొదలెట్టింది. శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో పాటు, మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారికి స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు పిచ్చికుక్కలను అదుపు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.