ఎదురొచ్చిన మృత్యువు
=ఇంటిల్లిపాదిని కబళించిన రోడ్డు ప్రమాదం
=స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద కారు, డీసీఎం ఢీ..
=నలుగురు అక్కడికక్కడే మృతి
తెల్లారితే.. చెల్లెలు ఇంట్లో శుభకార్యం.. ఆ అక్క తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలుదేరింది. ఆనందంగా బయలుదేరిన ఆ కుటుంబానికి మృత్యువు ఎదురొచ్చింది. ఇంటి నుంచి 30కిలోమీటర్లు వెళ్లారో లేదో.. ఘోరం జరిగిపోయింది. డీసీఎం వ్యాన్ రూపంలో యమపాశం.. కారులో ఉన్న నలుగురిని కబళించింది. బుధవారం.. ఇంకా పూర్తిగా తెల్లవారకముందే స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్సీ కాలనీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం వారి ప్రాణాలను బలిగొంది.
స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్, న్యూస్‌లైన్ : బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజర య్యేందుకు వెళుతూ ఓ కుటుంబం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. ఈ సంఘటన స్టేషన్‌ఘన్‌పూర్ శివారు ఎస్సీకాలనీ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారు జామున ఆరుగంటలకు చోటుచేసుకుం ది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. హసన్‌ప ర్తి మండలంలోని భీమారం గ్రామానికి చెందిన కొంగరి భాస్కర్(62) ఇరిగేషన్ శాఖలో ఈఈ గా విధులు నిర్వర్తించి ఏడాది క్రితం ఉ ద్యోగ విరమణ పొందాడు.
ఈయనకు భార్య పుష్పలత(50), కుమారులు, జీవన్, గోపినాథ్(26), కూతురు హేమలత(24)ఉన్నారు. భాస్కర్ స్వ గ్రామం చేర్యాల కాగా ఉద్యోగ రీత్యా 25 ఏళ్ల క్రి తం ఆయన భీమారంలో సొంతింటిని నిర్మించుకుని కుటుంబంతో అక్కడే స్థిరపడ్డాడు. అయితే నల్లగొండ జిల్లాలోని కొలనుపాకలో ఉంటున్న మరదలు(భార్య చెల్లెలు) రమ, పురుషోత్తం దంపతులు గ్రామంలో కొత్త ఇల్లు కట్టుకునేం దుకు బుధవారం ముగ్గుపోసుకుంటున్నారు. ఈ మేరకు కార్యక్రమానికి హాజరుకావాలని వా రు అక్కబావను ఆహ్వానించారు.
దీంతో అక్కడికి వెళ్లేందుకు భాస్కర్ తన భార్య పుష్పలత, కుమారుడు గోపినాథ్, కూతురు హేమలతతో కలిసి భీమారం నుంచి తన టాటా ఇండిగో కా రులో బయలుదేరారు. అయి తే కారును డ్రైవింగ్ చేస్తున్న గోపినాథ్ స్టేషన్‌ఘన్‌పూర్ శివారు ఎస్సీకాలనీ సమీపంలో రోడ్డుపై ఉన్న డివైడర్‌ను గమనించకుండా ఒక్కసారిగా కారును కుడివైపునకు మళ్లించాడు. ఈ క్రమంలో అదే సమయంలో సెర్‌లాక్ డబ్బాల లోడ్‌తో హైదరాబాద్ నుంచి హన్మకొండ వైపునకు వస్తున్న డీసీఎం వ్యాన్ అదుపుతప్పి కారును వేగంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న భాస్కర్, పుష్పలత, గోపినాథ్ అక్కడికక్కడే మృతిచెందారు. కాగా, డీసీఎం వ్యాన్ డ్రైవర్ నాగేశ్వర్‌రావుకు స్వల్ఫగాయాలయ్యాయి.
కొన ఊపిరితో కొట్టుకున్న హేమలత..
కాగా, రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు, అన్న య్య అక్కడిక్కడే మృతిచెందగా హేమలత కొనఊపిరితో కొద్దిసేపు కొట్టుమిట్టాడినట్లు మార్నిం గ్ వాక్‌కు వెళ్లిన స్థానికులు తెలిపారు. ప్రమా దం జరిగిన వెంటనే తీవ్రంగా గాయపడిన హే మలత కారు అద్దాలు తీసేందుకు ప్రయత్నించి ఊపిరాడక మృతి చెందినట్లు వారు చెప్పారు. సంఘటనా స్థలాన్ని సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి సందర్శించి గాయపడిన డీసీఎం డ్రైవర్‌ను 108 లో ఆస్పత్రికి తరలించా రు.
కారు అద్దాలు పగులగొట్టి...
కాగా, నుజ్జునుజ్జయిన కారులో ఇరుక్కున్న మృ తదేహాలను స్థానికుల సహకారంతో పోలీసు లు అతికష్టంగా బయటికి తీశారు. గడ్డపారతో కారు అద్దాలు, డోర్లు పగులగొట్టి తాడు సా యంతో మృతదేహాలను వెలికితీసి రోడ్డు పక్క న పెట్టారు. కాగా, రోడ్డుపై విగతజీవులుగా ఉ న్న భాస్కర్ కుటుంబ సభ్యులను చూసి స్థాని కులు కంటతడిపెట్టారు. ఇదిలా ఉండగా, మృతుడు భాస్కర్ పెద్ద కుమారుడు జీవన్‌కుమార్ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
కన్నీరుమున్నీరుగా విలపించిన బంధువులు...
రోడ్డు ప్రమాదంలో భాస్కర్, అతడి భార్యాపిల్లలు మృతిచెందిన సమాచారం తెలుసుకున్న బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలపై పడి బోరున విలపించారు. నెల రోజుల్లో హేమలత వివాహం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని.. ఇంతలోనే ఎంత ఘోరం జరిగిందని వారు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించి పోస్టుమార్టం నిర్వహించినట్లు సీఐ తెలిపారు.
శుభకార్యానికి వెళ్తుండగా...
Published Thu, Nov 21 2013 2:26 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement