![Woman Wakes From Seven Week COVID Coma Finds She Given Birth To Baby Girl - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/14/Baby.jpg.webp?itok=ENxkUg-U)
కొన్ని అత్యంత అరుదైన వ్యాధులు బారినపడి మృత్యు కుహరం నుంచి బయటపడ్డ వాళ్లను చూస్తే చాలా ఆశ్చర్యంగానూ, భయంగానూ ఉంటుంది. అలాంటిది గర్భంతో ఉండగా కోవిడ్ భారినపడితే ఎంత నరకంగా ఉంటుంది చెప్పండి. పైగా వారాలుగా కోమాలోనే ఉండిపోయింది.
(చదవండి: 77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్! అయినా ఐస్ స్కేటింగ్ చేశాడు!!)
అసలు విషయంలోకెళ్లితే...యూకేలోని ప్రైమరీ స్కూల్ టీచింగ్ అసిస్టెంట్ అయిన లారా వార్డ్ గర్భవతిగా ఉన్నప్పుడు కోవిడ్ బారిన పడటంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆమెకు ఇచ్చిన డెలివరీ తేదికి రెండు వారాల ముందే ఆమెకు డెలివరీ చేసేశారు. అయితే ఆమెకు పుట్టిన పాప చాల తక్కువ బరువుతో ఉంది. వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఆ బిడ్డ ఆరోగ్యంగానే ఉంది. అయితే ఆ చిన్నారి తల్లికి మాత్రం తనకు ఆడపిల్ల పుట్టిందన్న విషయం కూడా తెలియదు. ఈ మేరకు ఆమె ఏడు వారాలు అనంతరం కోమా నుండి బయటపడిని తర్వాత తనకు ఆడపిల్ల పుట్టిందని తెలుసుకుంది. అయితే యూకేలో లారాకి కోవిడ్ సోకిన సమయంలో ఇంకా అప్పటికి గర్భవతులకు వ్యాక్సిన్‌లు వేసే ప్రక్రియ ప్రారంభం కాలేదు
(చదవండి: జాక్వెలిన్‌కి ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడంలో సుకేశ్ భార్యదే కీలక పాత్ర)
Comments
Please login to add a commentAdd a comment