మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నారి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. గత నెల నామకరణం ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఇక కుమార్తెతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్న ఈమె.. తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలానే ఒంటరి తల్లుల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంది.
ప్రెగ్నెన్సీ జర్నీ
'ప్రతి తల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఓ ఎమోషనల్ జర్నీ. బిడ్డకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆ తల్లిదండ్రులు ఎంతో తల్లడిల్లిపోతారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంగా మారితే వాళ్ల సంతోషానికి అవధులుండవు. అలాంటి మధుర క్షణాలు.. పిల్లల పేరెంట్స్ కు అందిస్తున్న డాక్టర్స్ కు నా తరఫున ధన్యవాదాలు. నా ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది నాకు సలహాలు ఇచ్చేవారు'
(ఇదీ చదవండి: కీర్తి చెల్లిగా చేస్తే.. ఈమె తల్లి చిరుకు హీరోయిన్‌గా చేసింది!)
నాకు బాధేసింది
'నా వరకు పర్లేదు కానీ కొందరు మహిళలకు ఇలాంటి అండ దొరకదు. అది తెలిసి నేను చాలా బాధపడ్డాను. మరీ ముఖ్యంగా సింగిల్ మదర్స్ కు ఇలాంటి విషయాల్లో సపోర్ట్ ఉండదు. కాబట్టి వీకెండ్స్ లో నా ఆస్పత్రిలో ఒంటరి తల్లులకు ఉచితంగా ఓపీడీ చికిత్స అందించబోతున్నాం. ఇలాంటి ఓ ఎమోషనల్ జర్నీలో నా వంతు సహాయం అందించడానికి రెడీగా ఉన్నాను. ఇది చాలామందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా' అని ఉపాసన చెప్పుకొచ్చింది.
క్లీంకార రాకతో
రామ్ చరణ్-ఉపాసన దంపతులకు 2012లో పెళ్లయింది. అయితే ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేకపోవడంతో అభిమానుల దగ్గర మిగతా వాళ్ల వరకు చాలా కామెంట్స్ చేశారు. వాటన్నింటికీ ఎండ్ కార్డ్ వేస్తూ గతేడాది డిసెంబరులో ఉపాసన ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించారు. ఈ జూన్ లో పాపకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీతోపాటు ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. ప్రస్తుతం అందరూ పాపతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తున్నారు.
(ఇదీ చదవండి: వరుస రీమేక్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి)
Comments
Please login to add a commentAdd a comment