మెగా కోడలు ఉపాసన కొణిదెల త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మెగా ఇంట్లో సందడి నెలకొననుంది. దాదాపు పెళ్లైన 10 ఏళ్ల తర్వాత ఉపాసన గర్భం ధరించడంతో ఆ క్షణం కోసం మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉపాసన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.
(ఇది చదవండి: చరణ్- ఉపాసన బిడ్డ కోసం ఊయల.. ఎవరు పంపించారంటే?)
తాజాగా ఉపాసన- చరణ్ దంపతులకు ప్రముఖ టాలీవుడ్ సింగర్, కీరవాణి తనయుడు కాలభైరవ సర్‌ప్రైజ్ ఇచ్చారు. వారికి పుట్టబోయే బేబీ కోసం ప్రత్యేక ట్యూన్ తయారు చేశారు. ఈ మ్యూజిక్ వీడియోను ఉపాసన, రామ్ చరణ్ తమ ట్విటర్‌లో షేర్ చేశారు. కాలభైరవకు థ్యాంక్స్ చెబుతూ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్యూన్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
ఉపాసన ట్వీట్‌లో రాస్తూ..' మా కోసం ప్రత్యేక ట్యూన్ తయారు చేసినందుకు ధన్యవాదాలు. ఈ మెలోడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల్లో సంతోషాన్ని నింపుతుంది.' అంటూ పోస్ట్ చేశారు. రామ్ చరణ్ సైతం కాలభైరవకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు.
(ఇది చదవండి: మావయ్య ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం: ఉపాసన)
Thank you @kaalabhairava7 , for creating this tune for us. We are sure this melody will bring happiness and joy to millions of children across the globe..
— Upasana Konidela (@upasanakonidela) June 19, 2023
Lots of love from @AlwaysRamCharan & me. ❤️ pic.twitter.com/UFZAmqFd6T
Thank you @kaalabhairava7, for creating this tune for us. We are sure this melody will bring happiness and joy to millions of children across the globe.. pic.twitter.com/911bGK4GZz
— Ram Charan (@AlwaysRamCharan) June 19, 2023
Comments
Please login to add a commentAdd a comment