
అంబరీష్
కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ సహాయగుణం, ప్రేమ గుణం గురించి గొప్పగా చెబుతారు ఆయన సన్నిహితులు. ఆయన ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. అంబరీష్ చనిపోయినా కూడా తన ప్రేమను పంచుతూనే ఉన్నారు. కన్నడ యంగ్ హీరో యష్ భార్య రాధికా పండిట్ ఓ పాపకు జన్మ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాపకు ఓ ఊయల గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నారట అంబరీష్. సుమారు లక్షన్నర విలువ చేసే ఈ ఊయలను ఆన్‌లైన్‌లో బుక్ చేశారాయన. యష్‌కు పాప జన్మించేలోపే అంబరీష్ చనిపోయారు. బుక్ చేసిన ఈ ఊయలకు సంబంధించిన మెసేజ్ రావడంతో ఈ విషయాన్ని తెలుసుకున్నారు అంబరీష్ భార్య సుమలత. ఈ గిఫ్ట్‌ను యష్ కూతురికి అందిం చారామె. ఈ ఊయల తమకు అపురూపం అని యష్ దంపతులు పేర్కొన్నారు.