పాలకుర్తి: వరంగల్ జిల్లాలో చెరువులో దిగి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పాలకుర్తికు చెందిన మామిళ్ల రాజేష్ (8) తన స్నేహితులతో కలసి మండల కేంద్రంలోని చెరువులోకి దిగాడు.
రాజేష్‌కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. భయంతో స్నేహితులు తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ ప్రమాద విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. దీంతో రాజేష్ కోసం తల్లి లక్ష్మి రాత్రంతా వెతికింది. సోమవారం ఉదయం చెరువులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. రాజేష్ తండ్రి కొన్నేళ్ల క్రితమే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.