తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది.
తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. వరంగల్ జిల్లా నర్సిహుల పేట మండలం పకీరా తండాలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ తండాకే చెందిన భూక్యా రాజేష్, తాను ఏడేళ్లుగా ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకోవాలని కోరగా.. రెండు రోజుల నుంచి ముఖం చాటేశాడని బాధితురాలు ఆరోపించింది. పోలీసులు తండా చేరుకుని విచారణ ప్రారంభించారు.