మంగళగూడెం చిన్నారి..  దక్షిణాఫ్రికాలో మృతి  | Khammam Child Died In South Africa | Sakshi
Sakshi News home page

మంగళగూడెం చిన్నారి..  దక్షిణాఫ్రికాలో మృతి 

Oct 18 2019 12:34 PM | Updated on Oct 18 2019 12:35 PM

Khammam Child Died In South Africa - Sakshi

తల్లిదండ్రులు, సోదరుడితో చిన్నారి (ఇన్‌సెట్‌) జూవిత్‌(ఫైల్‌)

సాక్షి, ఖమ్మం: మండల పరిధిలోని మంగళగూడేనికి చెందిన చిన్నారి దక్షిణాఫ్రికాలో స్విమ్మింగ్‌పూల్‌లో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కన్నేటి శంకర్, మమతలకు ఇద్దరు కుమారులు. మూడేళ్ల క్రితం శంకర్‌ భార్యా పిల్లలతో కలిసి ఉద్యోగ రీత్యా దక్షిణాఫ్రికా వెళ్లారు. శంకర్‌ అక్కడ హార్డ్‌వేర్‌ ఉద్యోం చేస్తున్నాడు. వీరు అక్కడే గేటెడ్‌ కమ్యూనిటీ వెంచర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. వారి చిన్న కుమారుడు జూవిత్‌(4) అక్కడి కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి, వారు నివాసం పక్కనే ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లో పడి మృతి చెందాడు.

అప్పటి వరకు ఆడుకుంటున్న జూవిత్‌ కనిపించకపోవడంతో తల్లి కంగారు పడి వెతకగా స్విమ్మింగ్‌ పూల్‌లో తేలియాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామమైన మంగళగూడేనికి శనివారం తీసుకురానున్నారు. కాగా జూవిత్‌ బీజేపీ జిల్లా కార్యదర్శి కన్నేటి కోటయ్యకు మనవడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement