వికారాబాద్: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఆటో ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్లోని కొత్తగడిలో జరిగింది.
కాలనీకి చెందిన శ్రావణి(8) అనే చిన్నారి ఆదివారం ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న ఆటో శ్రావణిని ఢీకొట్టింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి మృతితో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది.