చందన మృతదేహం ( ఇన్‌సెట్‌లో ) చందన (ఫైల్)
సాక్షి, తుమకూరు : నరమాంసాన్ని రుచిమరిగిన ఓ చిరుత పులి ఓ చిన్నారిని బలితీసుకుంది. తుమకూరు తాలుకాలోని హెబ్బూరు సమీపంలో ఉన్న బైచేనహళ్లి తోటలో శనివారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీనివాస్, శిల్పా దంపతుల కుమార్తె చందన (2) ఇంటి ముందు ఆడుకుంటుండగా తోటలోకి ప్రవేశించిన పులి చిన్నారిని ఒక్కసారిగా నోట కరుచుకుని అడవిలోకి పారిపోయింది. విషయం గుర్తించిన తల్లిదండ్రులు బాలికను కాపాడటానికి పులితో పాటు పరుగులు తీసినా ఫలితం లేకపోయింది. అక్కడికి కొంత దూరంలో చిన్నారి మృతదేహం కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. (విషాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు..)
చదవండి : పసి ప్రాణాన్ని బలిగొన్న ‘బాతు’!
Comments
Please login to add a commentAdd a comment