
సాక్షి, లక్నో : పాము కాటుకు ఓ మాతృమూర్తి మరణించగా, ఆమె పాలు తాగిన మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ హృదయ విదారకమైన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఓ తల్లి.. తన కూతురితో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఓ పాము ఆమెను కాటేసింది. నిద్ర లేచాక తన బిడ్డకు పాలిచ్చింది. అప్పటికే పాము విషం ఆమె శరీరమంతా వ్యాపించడంతో.. ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు కాటేసిన పామును ఇంట్లోనే మరో గదిలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు దీనిని యాక్సిడెంటల్ డెత్‌గా కేసు నమోదు చేసుకున్నారు.