ఆర్టీసీ బస్సు ఢీ : బాలుడి మృతి | rtc bus collided child died in khammam district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీ : బాలుడి మృతి

Published Fri, Dec 25 2015 2:06 PM | Last Updated on Sun, Sep 3 2017 2:34 PM

rtc bus collided child died in khammam district

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ చిన్నారి మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో శుక్రవారం చోటుచేసుకుంది.

పడమటి నర్సాపురం గ్రామానికి చెందిన సాయి(13), శ్రవణ్(14) అనే ఇద్దరు స్నేహితులు సైకిల్పై వెళ్తుండగా.. కొత్తగూడెం నుంచి తళ్లాడ వైపు వెళ్తున్న మధిర డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో సాయి అక్కడికక్కడే మృతిచెందగా.. శ్రవణ్ తీవ్రంగా గాయాపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. శ్రవణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement