ఆనందంగా ఆడుకుంటున్న ఓ చిన్నారిపై ఇంటి ముందు బాల్కనీ పై కప్పు కూలిపడి ఒక చిన్నారి మృతి చెందింది.
అనంతపురం : ఆనందంగా ఆడుకుంటున్న ఓ చిన్నారిపై ఇంటి ముందు బాల్కనీ పై కప్పు కూలిపడి ఒక చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నెలో జరిగింది. చంద్ర, గీత దంపతులకు ఏకైక సంతానం ప్రవళిక. పోయిన అక్టోబర్ నెలలోనే ఆమె మొదటి పుట్టిన రోజు వేడుకను తల్లిదండ్రులు ఆనందంగా జరిపించారు. ఆదివారం తన ఇంటి సమీపంలోని వేరొక ఇంటి ముందు ప్రవళిక ఆడుకుంటుండగా పైకప్పు ఒక్కసారిగా కూలి పడిపోవడంతో చిన్నారి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈ ప్రమాదంలో భార్గవి(38) అనే మహిళ కాలికి గాయాలయ్యాయి.
(గార్లదిన్నె)