house roof
-
కొత్త టెక్నాలజీతో వాటర్ ప్రూఫింగ్ చేయండిలా..
సొంతింటి కలలకు వాటర్ లీకేజీ సమస్యలు. వాటర్ లీకేజీ, సీపేజీలతో పాడవుతున్న ఫాల్స్ సీలింగ్. లీకేజీ సమస్యల కారణంగా దెబ్బతింటున్న గోడల నాణ్యత. వాటర్ ప్రూఫింగ్‌తో లీకేజీ సమస్యలకు చెక్. మార్కెట్లో అందుబాటులో వాటర్ ప్రూఫ్ సొల్యూషన్స్. హైదరాబాద్ : సొంత ఇళ్లు అనేది మధ్య తరగతి ప్రజల కలల సౌధం. నెలనెల పొదుపు చేసో లేదా హోం లోన్లు తీసుకునో చెమటోడ్చి ఇంటిని నిర్మించుకుంటారు. అంతేకాదు లక్షలు వెచ్చించి ఇంటిలోపల ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటారు. ఇంటికి వచ్చిన గెస్టుల అభినందనలు అందుకునేలా నేటికి ట్రెండ్‌కి తగ్గట్టు ఫాల్స్ సీలింగ్ కూడా చేయిస్తున్నారు. అయితే వాతావరణ మార్పులు, చిన్న చిన్న లోపాల కారణంగా వర్షకాలం వచ్చిందంటే చాలు చినుకు పడితే కొత్త సమస్యలు తలెత్తుతుంటాయి. సాధారణంగా రూఫ్ వాలుగా కాకుండా చదునుగా ఉండే విధంగానే ఎక్కువ మంది ఇళ్లను నిర్మిస్తారు. రూఫ్ చదునుగా ఉండటం వల్ల అక్కడక్కడ నీరు నిలిచిపోయి సీపేజ్‌లు వస్తుంటాయి. పైగా ఎండ, చలి, వానల కారణంగా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల లీకేజీలు ఏర్పడుతుంటాయి. వానాకాలంలో వర్షకాలం వస్తే లీకేజీలు ఉన్న ఇళ్లలో పై కప్పు నుంచి నీరు కురవడం, చెమ్మ రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. లక్షలు వెచ్చించి కట్టుకున్న ఇంటికి , వాటర్ లీకేజీలు ఇబ్బంది పెడతాయి. ఇక ఇంటి పైకప్పుతో పాటు గోడలు కూడా చెమ్మ వస్తూ ఉంటుంది. ఈ చెమ్మ రావడం వల్ల ఇంటి గోడల ధృడత్వం దెబ్బతినడంతో పాటు ఎంతో ముచ్చటపడి ఇంటిలోపలి వైపు చేసుకున్న ఇంటీరియర్ కూడా పాడైతోంది. ఫాల్స్ సీలింగ్‌కి మరకలు కూడా వస్తుంటాయి. ఈ సమస్యలకు చెక్‌పెట్టడం ఇప్పుడు ఎంతో ఈజీ. వాటర్ ప్రూఫింగ్ ఇంటి పైకప్పు నుంచి లీకేజీ, చెమ్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందస్తుగా వాటర్ ప్రూఫింగ్ చేయించడం ఉత్తమం. గతంలో వాటర్ ప్రూఫింగ్ చేయాంటే అయితే మోర్టారు సున్నం వేయడం లేదంటే డాంబర్ షీట్లు పరిచేయడం అనే పద్దతులే అందుబాటులో ఉండేవి. అయితే వీటి మన్నిక తక్కువ కావడంతో సమస్య మళ్లీ తిరగబెడుతుంది. ఈ సమస్యకు తెర దించుతూ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అధునాతన వాటర్ ప్రూఫింగ్ పద్దతులు అందుబాటులోకి వచ్చాయి, గోడలకు పెయింట్ వేసినంత సుళువుగా వాటర్ ప్రూఫింగ్ చేసుకోవచ్చు. తద్వారా వాటర్ లీకేజీ సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. రూఫ్ వాటర్ ప్రూఫింగ్ సిమెంట్‌కు కొన్ని రసాయనాల మిశ్రమాలను కలిపి, కొత్త రకం వాటర్ ప్రూఫింగ్ పద్దతులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇంటి పైకప్పుకు వేయడం ద్వారా లీకేజీ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అయితే రసాయనాల నాణ్యతపై ఆధారపడి ఈ ప్రూఫింగ్ మన్నిక ఉంటుంది. ముఖ్యంగా ఆక్రిలిక్ రసాయనం కలిపిన వాటర్ ప్రూఫ్ సిమెంట్ తో ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. ఇక ఏషియన్ పెయింట్ అయితే ఆక్రిలిక్ రసాయనంతో పాటు ‘ఫైబర్’ కంటెంట్‌తో కూడిన సిమెంట్‌ని రూపొందించింది. వీటిని డాంప్ ప్రూఫ్, డాంప్ ప్రూఫ్ ఆల్ట్రా పేరుతో వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్‌గా అందిస్తోంది. పైగా వీటితో వాటర్ ప్రూఫింగ్ చేసుకోవడం చాలా సులువు. ఇదీ పద్దతి ముందుగా టెర్రస్ లేదా ఇంటి పైకప్పు వెలుపలి భాగాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత పగుళ్లు, గ్యాప్‌లు వచ్చిన చోటంతా ఆక్రిల్ మ్యాక్స్ క్రాక్ సీల్‌తో పూడ్చేయాలి. అప్పటికే ఏదైనా పుట్టీ, లేదా పెయింట్ వేసి ఉంటే దాన్ని కూడా తొలగించాలి. ఆ తర్వాత మొదటి కోటింగ్‌గా డాంప్ప్రూఫ్ / డాంప్ప్రూఫ్ ఆల్ట్రా లాంటి వాటర్ ప్రూఫింగ్ సొల్యుషన్ని ఒక లేయర్‌గా వేయాలి. ఆ కోటింగ్‌ని 4 నుంచి 6 గంటల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత డాంప్ప్రూఫ్ అంచుల చుట్టూ రూఫ్ టేప్‌ని వేయాలి. మరోసారి రెండో కోటింగ్‌గా డాంప్ప్రూఫ్ / డాంప్ప్రూఫ్ ఆల్ట్రా వాటర్ ప్రూఫింగ్ సొల్యుషన్ వేయాలి. మరోసారి 4 నుంచి 6 గంటల పాటు ఆరనివ్వాలి. ఇలా చేయడం ద్వారా పదేళ్ల పాటు వాటర్ లీకేజీ సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. ఏసియన్ పెయింట్స్ అయితే ఏకంగా వారంటీనే అందిస్తోంది. (Advertorial) మరిన్ని వివరాల కోసం : Asian Paints Water Proofing Solutions -
పైకప్పుపై రూ. 40 లక్షల డబ్బు, నగల సంచులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. మీరుట్‌కు చెందిన ఓ కుటుంబానికి ఉదయం లేవగానే నమ్మలేని దృశ్యం ఎదురుపడింది. డబ్బు కట్టలు, బంగారంతో నిండి ఉన్న రెండు బ్యాగులను వారి ఇంటి పైకప్పుపై గుర్తించిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. మీరుట్లో నివాసముంటున్న వరణ్ శర్మ అనే వ్యక్తి బుధవారం ఉదయం తన ఇంటి పైకప్పుపై రెండు బ్యాగులను గుర్తించాడు. తెరిచి చూడగా వాటి నిండ డబ్బు, నగలు కనిపించాయి. ఇది దొంగలించిన డబ్బుగా భావించి వెంటనే సర్దార్ పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. అక్కడి చేరుకున్న పోలీసులు దాదాపు 40 లక్షల రూపాయలు విలువ చేసే డబ్బు, బంగారం సంచులను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. వరుణ్ శర్మ ఇంటి పక్కనే ఉన్న వ్యాపారవేత్త పవన్ సింఘాల్‌కు సంబంధించి సొత్తుగా ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసు అధికారి దీనేష్ బాగెల్ తెలిపారు. (చదవండి: ఆ ఇంట్లో.. అనుమానాస్పదస్థితిలో 6 మృతదేహాలు) ఈ డబ్బు, నగలను పవన్ సింఘాల్ ఇంట్లో రెండేళ్లుగా పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన రాజు దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల నేపాల్‌కు వెళ్లిన రాజు కొంతకాలం తర్వాత తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి సెక్యూరిటి గార్డుతో కలిసి బుధవారం ఈ దొంగతనానికి పాల్పడ్డాడని, ఈ క్రమంలో రెండు బ్యాగుల్లో డబ్బు, బంగారం సర్థేసి సీసీ టీవీలో కనిపించకుండా ఉండేందుకు వరుణ్ శర్మ ఇంటి పైకప్పుపై దాచినట్లు తెలిపారు. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. దొంగతనం జరిగిన తన వస్తువులు, బంగారంపై స్పష్టత లేదని వాటిని లెక్కించిన అనంతరం ఫిర్యాదు చేస్తానని పోలీసులతో పవన్ సింఘాల్ పేర్కొన్నాడు. (చదవండి: చిన్నారుల హత్య: నర్సుపై ఛార్జ్‌షీట్) -
ఇంటి మిద్దెపై గంజాయి పెంపకం
టీ.నగర్ : చెన్నైలో ఇంటి మిద్దెపై గంజాయి పెంచుతున్న ఇంజినీరును మంగళవారం పోలీసులు అరెస్టుచేశారు. చెన్నై కేకేనగర్ ఒకటవ సెక్టార్ ఏడవ వీధికి చెందిన చార్లెస్ ప్రదీప్ మెకానికల్ ఇంజినీరుగా ఉన్నారు. ఈయన తన ఇంటి మిద్దెపై తోటను ఏర్పాటుచేసి కొన్ని మూలిక మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలతోపాటు గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు కేకేనగర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ తంగరాజ్, ఇతర పోలీసులు మంగళవారం అక్కడికి వెళ్లి తనిఖీలు జరిపారు. ఆ సమయంలో మూలికా మొక్కలతోపాటు నాలుగన్నర అడుగుల ఎత్తుగల ఏడు గంజాయి చెట్లను పెంచుతున్నట్లు తెలిసింది. దీంతో చార్లెస్ ప్రదీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి మొక్కలను, అక్కడున్న కిలో 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిగురించి చార్లెస్ ప్రదీప్ పోలీసులతో మాట్లాడుతూ తాను గంజాయి ఉపయోగిస్తూ దానికి బానిసయ్యానని, దీంతో ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచి వాడేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇరుగు పొరుగు వారికి ఈ విషయం తెలియకుండా ఉండేందుకు పరిశోధనల కోసం మూలికా మొక్కలను పెంచుతున్నట్లు తెలిపానని, ఈ మొక్కల మధ్య గంజాయి మొక్కలను పెంచినట్లు పేర్కొన్నారు. గంజాయిని ఆమ్లెట్, భోజనంతో కలిసి ఆరగిస్తానన్నారు. చార్లెస్ ప్రదీప్‌కు గంజాయి మొక్కలు ఎలా లభించాయి? అతనికి గంజాయి ముఠాతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
అదిరే పైకప్పు కావాలా?
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇంట్లో ఉన్నా వేడే. సాధారణ సీలింగ్ ఉన్న ఇంట్లో ఈ వేడి మరింత ఎక్కువే. దీనికి పరిష్కారమే ఫాల్స్ సీలింగ్. ఫాల్స్ సీలింగ్‌తో సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దుకోవచ్చు. ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు కూడా. జాగ్రత్తలివే.. ♦ ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ♦ ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి. ♦ ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్ తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. ♦ ఉడెన్ ఫాల్స్ సీలింగ్‌లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ♦ దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. -
బాల్కనీ పైకప్పు కూలిపడి చిన్నారి మృతి
అనంతపురం : ఆనందంగా ఆడుకుంటున్న ఓ చిన్నారిపై ఇంటి ముందు బాల్కనీ పై కప్పు కూలిపడి ఒక చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నెలో జరిగింది. చంద్ర, గీత దంపతులకు ఏకైక సంతానం ప్రవళిక. పోయిన అక్టోబర్ నెలలోనే ఆమె మొదటి పుట్టిన రోజు వేడుకను తల్లిదండ్రులు ఆనందంగా జరిపించారు. ఆదివారం తన ఇంటి సమీపంలోని వేరొక ఇంటి ముందు ప్రవళిక ఆడుకుంటుండగా పైకప్పు ఒక్కసారిగా కూలి పడిపోవడంతో చిన్నారి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈ ప్రమాదంలో భార్గవి(38) అనే మహిళ కాలికి గాయాలయ్యాయి. (గార్లదిన్నె) -
కూలిన ఇంటిపైకప్పు : తల్లీ కూతుళ్లు మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని మేదరబస్తీలో బుధవారం అర్థరాత్రి విషాదం చోటు చేసుకుంది. పాతబడిన పెంకుటిలు పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో నిద్రలో ఉన్న తల్లి సుధారాణి (30), కుమార్తెతలు భార్గవి, కీర్తనలు మృతి చెందారు. భర్త గోవర్ధన్ స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... సహాయక చర్యలు చేపట్టారు.