అదిరే పైకప్పు కావాలా?
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇంట్లో ఉన్నా వేడే. సాధారణ సీలింగ్ ఉన్న ఇంట్లో ఈ వేడి మరింత ఎక్కువే. దీనికి పరిష్కారమే ఫాల్స్ సీలింగ్. ఫాల్స్ సీలింగ్‌తో సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దుకోవచ్చు. ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు కూడా.
జాగ్రత్తలివే..
♦ ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
♦ ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి.
♦ ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్ తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది.
♦ ఉడెన్ ఫాల్స్ సీలింగ్‌లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి.
♦ దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి.