false ceiling
-
రాజధాని అమరావతిలో హైకోర్టు పరిస్థితి ఇదీ..
సాక్షి, అమరావతి: రూ.వందల కోట్లు వెచ్చించి కూడా హైకోర్టు తాత్కాలిక భవనాన్ని టీడీపీ హయాంలో ఎంత నాసిరకంగా నిర్మించారో తాజాగా ప్రత్యక్షంగా వెల్లడైంది. శనివారం కురిసిన వర్షానికి హైకోర్టులోని పలు కోర్టు హాళ్ల వద్ద భారీగా నీరు చేరింది. అన్నీ ఫ్లోర్లలో ఇదే పరిస్థితి నెలకొంది. బయటకు వెళ్లే మార్గం లేక నీరంతా అక్కడే నిలిచిపోయింది. కారిడార్లలో కూడా నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో కోర్టు సిబ్బంది మోటార్లతో తోడి నీటిని బయటకు పంపేందుకు శ్రమించారు. ఇక హైకోర్టు ప్రాంగణంలో ఉన్న రాష్ట్ర న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్)లో పరిస్థితి చెప్పాల్సిన పనే లేదు. వర్షానికి బార్ కౌన్సిల్ కార్యాలయంలో ఫాల్స్ సీలింగ్ ఊడిపడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సీలింగ్ పైనుంచి నీరు వరదలా లోపలకు చొచ్చుకొచ్చింది. దీంతో ఫైళ్లన్నీ తడిచిపోవడంతో భద్రపరిచేందుకు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుర్చీలను, టేబుళ్లను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిపై ఫైళ్లను ఉంచారు.కొత్త న్యాయవాదుల నమోదు కార్యక్రమం కూడా ఉండటంతో అవస్థ పడ్డారు. గతంలోనూ న్యాయమూర్తులు విధి నిర్వహణలో ఉండగానే కొన్ని చోట్ల ఫాల్స్ సీలింగ్‌లు ఊడిపడ్డాయి. అదృష్టవశాత్తూ సెలవు దినం కావడంతో అటు న్యాయమూర్తులు, ఇటు న్యాయవాదులకు ఇబ్బందులు తప్పాయి. రూ.150 కోట్లతో నాసిరకంగా...తాత్కాలిక హైకోర్టు భవనాన్ని చంద్రబాబు ప్రభుత్వం 2019లో రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఒక్కో ఎస్ఎఫ్టీకి భారీగా ఖర్చు చేశారు. ఒకపక్క పనులు కొనసాగుతుండగానే నిర్మాణం పూర్తైందంటూ నాడు సుప్రీంకోర్టుకు అవాస్తవాలు చెప్పి హైకోర్టును తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. ఏపీ హైకోర్టు నిర్మాణం పూర్తయిపోయిందని, అన్ని కోర్టు హాలులు పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పుదోవ పట్టించారు.కోర్టు ప్రారంభించిన తరువాత హాళ్లను పరిశీలించేందుకు వచ్చిన అప్పటి సీజేకు చేదు అనుభవం ఎదురైంది. ఒకటి రెండు కోర్టు హాళ్లు మాత్రమే సిద్ధం చేసి మిగిలిన వాటిలోకి వెళ్లకుండా పరదాలు కట్టి సీజేను అవమానించింది. అప్పట్లో దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవయ్యాయి. ఇక హైకోర్టు భవనం లోపల మొత్తం డొల్లే. రాజ«స్థాన్ నుంచి తెప్పించిన శాండ్ స్టోన్ పలకలు హైకోర్టు వెలుపల బిగించారు. కొద్ది నెలలకే అవన్నీ ఊడిపోయాయి. -
వేసవి కూల్ కూల్‌గా..!
వేసవి కాలం రాకముందే ఎండ మండిపోతుంది. బయటే కాదు ఇంట్లో ఉన్నా ఎండ వేడి తగులుతుంది. అసలు ఇంటి పైకప్పు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది ఇంట్లో వేడి. సాధారణ సీలింగ్ ఉన్న ఇంట్లో అయితే ఈ వేడిమి తీవ్రత మరింత ఎక్కువే. దీనికి పరిష్కారం చూపించి.. మండు వేసవిలో ఇంటిని చల్లగా మార్చేస్తుంది ‘ఫాల్స్ సీలింగ్’! సాక్షి, హైదరాబాద్: గదిలో ఆహ్లాదభరిత వాతావరణం ఏర్పర్చడమే ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం. అలసిన మనసు, శరీరానికి సాంత్వన చేకూర్చడమే. ఫాల్స్ సీలింగ్‌తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదంగా మార్చుకోవటమే కాకుండా సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు కూడా. జాగ్రత్తలివే.. ► ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి. ► ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి. ► ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్‌తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. ► ఉడెన్ ఫాల్స్ సీలింగ్‌లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ► దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. వర్ణాల ఎంపిక ఇలా.. ► గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ, విశాలంగా ఉన్న భావనను కలిగిస్తుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ► మిగతా గదులతో పోల్చుకుంటే పడకగది సీలింగ్‌నే ఎక్కువసేపు చూస్తాం కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేవి ఎంచుకోవాలి. మధ్యస్తం, డార్క్, బ్రౌన్ వర్ణాలు పడకగదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి మరి. ► తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే మోనోక్రోమాటిక్ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది. ► గోడల రంగుకు, సీలింగ్‌కు ఒకే రకమైనవి కాకుండా.. వేర్వేరు వర్ణాల్ని కూడా వేసుకోవచ్చు. దగ్గర దగ్గర రంగులు కాకుండా, చూడగానే తేడా ఇట్టే కని్పంచే వర్ణాలను ఎంపిక చేసుకోవటం మేలు. దృశ్య వ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్‌ను వినియోగించుకోండి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కని్పంచేలా అలంకరించుకోవచ్చు. -
మండు వేసవిలో చల్లగా!
ఫాల్స్ సీలింగ్‌తో ఇల్లు ఆహ్లాదం సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ ఎండ భగ్గుమంటోంది. బయటే కాదు ఇంట్లో ఉన్నా ఎండ వేడి తగులుతుంది. అసలు ఇంటి పైకప్పు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది ఇంట్లో వేడి. సాధారణ సీలింగ్ ఉన్న ఇంట్లో అయితే ఈ వేడిమి తీవ్రత మరింత ఎక్కువే. దీనికి పరిష్కారం చూపించి.. మండు వేసవిలో ఇంటిని చల్లగా మార్చేస్తుంది ‘ఫాల్స్ సీలింగ్’! ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం.. గదిలో ఆహ్లాదభరిత వాతావరణం ఏర్పర్చడమే. అలసిన మనసు, శరీరానికి సాంత్వన చేకూర్చడమే. ఫాల్స్ సీలింగ్‌తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదంగా మార్చుకోవటమే కాకుండా సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు కూడా. జాగ్రత్తలివే.. ♦ ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి. ♦ ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి. ♦ ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలిం గ్‌తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. ♦ ఉడెన్ ఫాల్స్ సీలింగ్‌లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ♦ దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. వర్ణాల ఎంపికలో.. ♦ ఫాల్స్ సీలింగ్ రంగుల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారేమంటారంటే.. ♦ గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ, విశాలంగా ఉన్న భావనను కలిగిస్తుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ♦ మిగతా గదులతో పోల్చుకుంటే పడకగది సీలింగ్‌నే ఎక్కువసేపు చూస్తాం కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేవి ఎంచుకోవాలి. మధ్యస్తం, డార్క్, బ్రౌన్ వర్ణాలు పడకగదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి మరి. ♦ తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే మోనోక్రోమాటిక్ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది. ♦ గోడల రంగుకు, సీలింగ్‌కు ఒకే రకమైనవి కాకుండా.. వేర్వేరు వర్ణాల్ని కూడా వేసుకోవచ్చు. దగ్గర దగ్గర రంగులు కాకుండా, చూడగానే తేడా ఇట్టే కన్పించే వర్ణాలను ఎంపిక చేసుకోవటం మేలు. దృశ్య వ ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్‌ను వినియోగించుకోండి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోవచ్చు. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
అదిరే పైకప్పు కావాలా?
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇంట్లో ఉన్నా వేడే. సాధారణ సీలింగ్ ఉన్న ఇంట్లో ఈ వేడి మరింత ఎక్కువే. దీనికి పరిష్కారమే ఫాల్స్ సీలింగ్. ఫాల్స్ సీలింగ్‌తో సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దుకోవచ్చు. ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు కూడా. జాగ్రత్తలివే.. ♦ ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ♦ ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి. ♦ ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్ తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. ♦ ఉడెన్ ఫాల్స్ సీలింగ్‌లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ♦ దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. -
కూల్.. సీలింగ్!
సాక్షి, హైదరాబాద్: ఫాల్స్ సీలింగ్‌తో ఇంటి అందం రెట్టింపవుతుంది. టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలో ఇంటి పైకప్పును కలపతో తయారు చేసేవారు. కాలక్రమేణా ఇంటి పైకప్పులు మారిపోయాయి. ఇప్పుడు అల్యూమినియం ఫ్రేమ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లతో చేసే ఫాల్స్ సీలింగ్‌కు ఆదరణ బాగా పెరుగుతోంది. ఫాల్స్ సీలింగ్‌తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదంగా మారుతుంది. ► ఫాల్స్ సీలింగ్‌తో సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దుకోవచ్చు. ► సీలింగ్‌కు రెండు నుంచి మూడు అంగుళాల దిగువన ఫాల్స్ సీలింగ్ వేయిస్తే సరిపోతుంది. అయితే ప్రైమరీ సీలింగ్, ఫాల్స్ సీలింగ్ దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ► ఫాల్స్ సీలింగ్‌తో వివిధ డిజైన్లు, కలర్స్‌తో సీలింగ్‌ను రూపొందించుకునే సౌలభ్యం ఉంటుంది. ధర చ.అ.కి రూ.25 నుంచి మొదలవుతుంది. పెయింటింగ్‌కు మరో రూ.2 వేలు అవుతుంది. డిజైన్ టైల్స్‌తో ఉన్న సీలింగ్‌ను ఎంచుకుంటే పెయింటింగ్ ఖర్చు తగ్గుతుంది. ► అర్హత, అనుభవం కలిగిన ఇంటీరియల్ డిజైనర్స్ ఉంటే ప్లెయిన్లో కూడా ఫాల్స్ సీలింగ్‌ను వేసుకోవచ్చు. కొత్తగా కడుతున్న ఇళ్లకే కాకుండా పాత ఇంటికి సైతం ఈ ఫాల్స్ సీలింగ్‌ను వేయించుకోవచ్చు. జాగ్రత్తలివే.. ► ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ► ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి. ► ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్‌తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. ► ఉడెన్ ఫాల్స్ సీలింగ్‌లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ► దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. -
కూల్.. ఫాల్స్ సీలింగ్
సాక్షి, హైదరాబాద్: ఫాల్స్ సీలింగ్‌తో ఇంట్లో వేడి తగ్గడమే కాకుండా ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదంగా మార్చుకోవచ్చు. సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దుకోవచ్చు కూడా. టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలో ఇంటి పైకప్పును కలపతో తయారు చేసేవారు. కాలక్రమేణా సిమెంట్ ప్లాస్టింగ్తో ఇంటి పైకప్పులు మారిపోయాయి. ఉడెన్ సీలింగ్ ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఉడెన్ సీలింగ్‌కు ధర చదరపు అడుగుకు రూ. 200 నుంచి మొదలవుతుంది. సీలింగ్‌కు విద్యుత్ దీపాలు అమర్చుకోవాలనుకుంటే మరో రూ. 2 వేలు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం అల్యూమినియం ఫ్రేమ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లతో చేసే ఫాల్స్ సీలింగ్‌కు ఆదరణ పెరిగింది. సీలింగ్‌కు రెండు నుంచి మూడు అంగుళాల దిగువన ఫాల్స్ సీలింగ్ వేయిస్తే సరిపోతుంది. అయితే ప్రైమరీ సీలింగ్, ఫాల్స్ సీలింగ్ దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఎంచుకుంటే వివిధ డిజైన్లు, కలర్స్‌తో సీలింగ్‌ను రూపొందించుకునే సౌలభ్యం ఉంటుంది. ధర చదరపు అడుగుకి రూ. 25 నుంచి మొదలవుతుంది. పెయింటింగ్‌కు మరో రూ. 2 వేలు అవుతుంది. డిజైన్ టైల్స్‌తో ఉన్న సీలింగ్‌ను ఎంచుకుంటే పెయింటింగ్ ఖర్చు తగ్గుతుంది. కొత్త ఇంటికే కాకుండా పాత ఇంటికి సైతం ఈ ఫాల్స్ సీలింగ్‌ను వేయించుకోవచ్చు. ప్రయోజనాలివీ.. సూర్యుడి వేడి, శబ్దం, అగ్నిప్రమాద తీవ్రత గణనీయంగా తగ్గటమే కాకుండా విద్యుత్ వినియోగాన్ని బాగా తగ్గించుకోవచ్చు. గది లేదా హాలు కనీసం పదేళ్ల పాటు అందంగా, విశాలంగా కనిపిస్తుంది. బాల్కనీ, ఇంటి పైకప్పులో లీకేజీలుంటే ఫాల్స్ సీలింగ్‌తో ఆశించిన ప్రయోజనం నెరవేరదు. జాగ్రత్తలివే.. ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి. ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్‌తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఉడెన్ ఫాల్స్ సీలింగ్‌లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి.