కూల్.. సీలింగ్! | House does away with 'Impeachment Wall' | Sakshi
Sakshi News home page

కూల్.. సీలింగ్!

Published Fri, Jul 25 2014 11:44 PM | Last Updated on Thu, May 24 2018 2:36 PM

కూల్.. సీలింగ్! - Sakshi

కూల్.. సీలింగ్!

సాక్షి, హైదరాబాద్: ఫాల్స్ సీలింగ్‌తో ఇంటి అందం రెట్టింపవుతుంది. టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలో ఇంటి పైకప్పును కలపతో తయారు చేసేవారు. కాలక్రమేణా ఇంటి పైకప్పులు మారిపోయాయి. ఇప్పుడు అల్యూమినియం ఫ్రేమ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌లతో చేసే ఫాల్స్ సీలింగ్‌కు ఆదరణ బాగా పెరుగుతోంది. ఫాల్స్ సీలింగ్‌తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదంగా మారుతుంది.
ఫాల్స్ సీలింగ్‌తో సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దుకోవచ్చు.
సీలింగ్‌కు రెండు నుంచి మూడు అంగుళాల దిగువన ఫాల్స్ సీలింగ్ వేయిస్తే సరిపోతుంది. అయితే ప్రైమరీ సీలింగ్, ఫాల్స్ సీలింగ్ దగ్గరగా ఉండేలా చూసుకోవాలి.
ఫాల్స్ సీలింగ్‌తో వివిధ డిజైన్లు, కలర్స్‌తో సీలింగ్‌ను రూపొందించుకునే సౌలభ్యం ఉంటుంది. ధర చ.అ.కి రూ.25 నుంచి మొదలవుతుంది. పెయింటింగ్‌కు మరో రూ.2 వేలు అవుతుంది. డిజైన్ టైల్స్‌తో ఉన్న సీలింగ్‌ను ఎంచుకుంటే పెయింటింగ్ ఖర్చు తగ్గుతుంది.
అర్హత, అనుభవం కలిగిన ఇంటీరియల్ డిజైనర్స్ ఉంటే ప్లెయిన్‌లో కూడా ఫాల్స్ సీలింగ్‌ను వేసుకోవచ్చు. కొత్తగా కడుతున్న ఇళ్లకే కాకుండా పాత ఇంటికి సైతం ఈ ఫాల్స్ సీలింగ్‌ను వేయించుకోవచ్చు.

 జాగ్రత్తలివే..
ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి.
ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్‌తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది.
ఉడెన్ ఫాల్స్ సీలింగ్‌లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి.
దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement