సొంతింటి కలలకు వాటర్ లీకేజీ సమస్యలు. వాటర్ లీకేజీ, సీపేజీలతో పాడవుతున్న ఫాల్స్ సీలింగ్. లీకేజీ సమస్యల కారణంగా దెబ్బతింటున్న గోడల నాణ్యత. వాటర్ ప్రూఫింగ్‌తో లీకేజీ సమస్యలకు చెక్. మార్కెట్లో అందుబాటులో వాటర్ ప్రూఫ్ సొల్యూషన్స్.
హైదరాబాద్ : సొంత ఇళ్లు అనేది మధ్య తరగతి ప్రజల కలల సౌధం. నెలనెల పొదుపు చేసో లేదా హోం లోన్లు తీసుకునో చెమటోడ్చి ఇంటిని నిర్మించుకుంటారు. అంతేకాదు లక్షలు వెచ్చించి ఇంటిలోపల ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటారు. ఇంటికి వచ్చిన గెస్టుల అభినందనలు అందుకునేలా నేటికి ట్రెండ్‌కి తగ్గట్టు ఫాల్స్ సీలింగ్ కూడా చేయిస్తున్నారు. అయితే వాతావరణ మార్పులు, చిన్న చిన్న లోపాల కారణంగా వర్షకాలం వచ్చిందంటే చాలు చినుకు పడితే కొత్త సమస్యలు తలెత్తుతుంటాయి. సాధారణంగా రూఫ్ వాలుగా కాకుండా చదునుగా ఉండే విధంగానే ఎక్కువ మంది ఇళ్లను నిర్మిస్తారు. రూఫ్ చదునుగా ఉండటం వల్ల అక్కడక్కడ నీరు నిలిచిపోయి సీపేజ్‌లు వస్తుంటాయి. పైగా ఎండ, చలి, వానల కారణంగా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల లీకేజీలు ఏర్పడుతుంటాయి.
వానాకాలంలో
వర్షకాలం వస్తే లీకేజీలు ఉన్న ఇళ్లలో పై కప్పు నుంచి నీరు కురవడం, చెమ్మ రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. లక్షలు వెచ్చించి కట్టుకున్న ఇంటికి , వాటర్ లీకేజీలు ఇబ్బంది పెడతాయి. ఇక ఇంటి పైకప్పుతో పాటు గోడలు కూడా చెమ్మ వస్తూ ఉంటుంది. ఈ చెమ్మ రావడం వల్ల ఇంటి గోడల ధృడత్వం దెబ్బతినడంతో పాటు ఎంతో ముచ్చటపడి ఇంటిలోపలి వైపు చేసుకున్న ఇంటీరియర్ కూడా పాడైతోంది. ఫాల్స్ సీలింగ్‌కి మరకలు కూడా వస్తుంటాయి. ఈ సమస్యలకు చెక్‌పెట్టడం ఇప్పుడు ఎంతో ఈజీ.
వాటర్ ప్రూఫింగ్
ఇంటి పైకప్పు నుంచి లీకేజీ, చెమ్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందస్తుగా వాటర్ ప్రూఫింగ్ చేయించడం ఉత్తమం. గతంలో వాటర్ ప్రూఫింగ్ చేయాంటే అయితే మోర్టారు సున్నం వేయడం లేదంటే డాంబర్ షీట్లు పరిచేయడం అనే పద్దతులే అందుబాటులో ఉండేవి. అయితే వీటి మన్నిక తక్కువ కావడంతో సమస్య మళ్లీ తిరగబెడుతుంది. ఈ సమస్యకు తెర దించుతూ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అధునాతన వాటర్ ప్రూఫింగ్ పద్దతులు అందుబాటులోకి వచ్చాయి, గోడలకు పెయింట్ వేసినంత సుళువుగా వాటర్ ప్రూఫింగ్ చేసుకోవచ్చు. తద్వారా వాటర్ లీకేజీ సమస్యల నుంచి గట్టెక్కవచ్చు.
రూఫ్ వాటర్ ప్రూఫింగ్
సిమెంట్‌కు కొన్ని రసాయనాల మిశ్రమాలను కలిపి, కొత్త రకం వాటర్ ప్రూఫింగ్ పద్దతులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇంటి పైకప్పుకు వేయడం ద్వారా లీకేజీ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అయితే రసాయనాల నాణ్యతపై ఆధారపడి ఈ ప్రూఫింగ్ మన్నిక ఉంటుంది. ముఖ్యంగా ఆక్రిలిక్ రసాయనం కలిపిన వాటర్ ప్రూఫ్ సిమెంట్ తో ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. ఇక ఏషియన్ పెయింట్ అయితే ఆక్రిలిక్ రసాయనంతో పాటు ‘ఫైబర్’ కంటెంట్‌తో కూడిన సిమెంట్‌ని రూపొందించింది. వీటిని డాంప్ ప్రూఫ్, డాంప్ ప్రూఫ్ ఆల్ట్రా పేరుతో వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్‌గా అందిస్తోంది. పైగా వీటితో వాటర్ ప్రూఫింగ్ చేసుకోవడం చాలా సులువు.
ఇదీ పద్దతి
ముందుగా టెర్రస్ లేదా ఇంటి పైకప్పు వెలుపలి భాగాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత పగుళ్లు, గ్యాప్‌లు వచ్చిన చోటంతా ఆక్రిల్ మ్యాక్స్ క్రాక్ సీల్‌తో పూడ్చేయాలి. అప్పటికే ఏదైనా పుట్టీ, లేదా పెయింట్ వేసి ఉంటే దాన్ని కూడా తొలగించాలి. ఆ తర్వాత మొదటి కోటింగ్‌గా డాంప్ప్రూఫ్ / డాంప్ప్రూఫ్ ఆల్ట్రా లాంటి వాటర్ ప్రూఫింగ్ సొల్యుషన్ని ఒక లేయర్‌గా వేయాలి. ఆ కోటింగ్‌ని 4 నుంచి 6 గంటల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత డాంప్ప్రూఫ్ అంచుల చుట్టూ రూఫ్ టేప్‌ని వేయాలి. మరోసారి రెండో కోటింగ్‌గా డాంప్ప్రూఫ్ / డాంప్ప్రూఫ్ ఆల్ట్రా వాటర్ ప్రూఫింగ్ సొల్యుషన్ వేయాలి. మరోసారి 4 నుంచి 6 గంటల పాటు ఆరనివ్వాలి. ఇలా చేయడం ద్వారా పదేళ్ల పాటు వాటర్ లీకేజీ సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. ఏసియన్ పెయింట్స్ అయితే ఏకంగా వారంటీనే అందిస్తోంది. (Advertorial)
మరిన్ని వివరాల కోసం : Asian Paints Water Proofing Solutions
Comments
Please login to add a commentAdd a comment