నీటితొట్టిలో పడి చిన్నారి మృతి
Published Thu, Apr 20 2017 12:27 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM
ఎల్కతుర్తి: నీటితొట్టిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం దామేర గ్రామంలో గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన మద్దిసిరి(3) ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీళ్ల తొట్టిలో పడిపోయింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులెవరు గుర్తించకపోవడంతో.. నీట మునిగి మృతిచెందింది. చిన్నారి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
Advertisement
Advertisement