పాపం పసివాడు.. | child died in train accident | Sakshi
Sakshi News home page

పాపం పసివాడు..

Published Fri, Jun 30 2017 12:46 PM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

పాపం పసివాడు..

పాపం పసివాడు..

► రైలు పట్టాల పక్కనే ఉన్న మూడేళ్ల బాలుడు
► ఇంతలో వేగంగా వెళ్లిన గూడ్స్‌ రైలు
► ఆ ధాటికి అదుపుతప్పి కంకర రాళ్లపై పడిన బాలుడు
► తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందిన పసి హృదయం


మార్కాపురం రూరల్‌ : ఆ బాలుడి వయసు మూడేళ్లు. తల్లి కోసం రైలు పట్టాలు దాటి ఏడ్చుకుంటూ వచ్చాడు. ఇంతలో ఓ రైలు వచ్చింది. దాని వేగం ధాటికి బాలుడు అదుపుతప్పి పట్టాల పక్కన రాళ్లపై పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హృదయ విదారక సంఘటన మండలంలోని గోగులదిన్నె ఎస్సీ కాలనీ సమీపంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. స్థానికంగా నివాసం ఉండే మురికపూడి నాగయ్య, నాగమ్మ దంపతులకు జాయ్‌ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. తల్లి బహిర్భూమి కోసం కాలనీకి సమీపంలోని రైలు పట్టాలు దాటుకుని అవతలి వైపునకు వెళ్లింది.

కుమారుడు జాయ్‌ ఏడ్చుకుంటూ తల్లి కోసం రైలు పట్టాల వద్దకు వచ్చి ఆగాడు. ఇంతలో ఓ గూడ్స్‌ రైలు వేగంగా వెళ్లింది. ఆ గాలి ధాటికి రైలు పట్టాల పక్కన ఉన్న బాలుడు అదుపుతప్పి కిందపడ్డాడు. కింద పెద్దపెత్త కంకర రాళ్లు ఉండటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రులు పలకల పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అప్పటి వరకూ ఆడుతూ చలాకీగా నవ్వుతూ ఉన్న జాయ్‌ ఉన్నట్టుండి మృతి చెందాడని తెలిసి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement