స్కూల్ బస్ ఒక చిన్నారిని చిదిమేసింది. నల్లగొండ జిల్లా దేవర కొండ మండలం చింతపల్లిలో శనివారం సాయంత్రం ఒక ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొనడంతో.. యూకేజీ చదువుతున్న కావేరి అనే చిన్నారి మరణించింది.
చింతపల్లి మజరా చాకలి చెరువు పల్లికి చెందిన ఈ చిన్నారి.. రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన స్కూల్ బస్ ఢీ కొట్టింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆడుతూ పాడుతూ ఉదయం స్కూల్ కి వెళ్లిన చిన్నారి.. విగత జీవిగా మారడంతో కావేరి కుటుంబంలో విషాదం అలముకుంది.