kaveri
-
సోషల్ మెసేజ్‌తో ‘కావేరి’
రిషిత, ఫైజల్, షేక్ అల్లాబకాషు, ఖుషీ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కావేరి". రాజేష్ నెల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కావేరి సినిమా, ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా హీరోయిన్ రిషిత మాట్లాడుతూ - పేరెంట్స్ ఎప్పుడూ అమ్మాయిలకే జాగ్రత్తలన్నీ చెబుతుంటారు. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది. ఇవే జాగ్రత్తలు అబ్బాయిలకు చెబితే అమ్మాయిల పట్ల ఇన్ని అకృత్యాలు ఈరోజు సొసైటీలో జరగవు. ఒక అమ్మాయికి ఏదైనా జరిగితే అదే తల్లిదండ్రులు ఎంతో వేదనకు గురవుతారు. మా సినిమాలో మంచి సోషల్ మెసేజ్ ఉంది’ అన్నారు. ‘కావేరి సినిమా ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో అందరికీ కనువిప్పు కలిగించేలా ఉంటుంది. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ కుదిరింది’ అని సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అన్నారు. ‘నన్ను నేను బిగ్ స్క్రీన్ మీద చూసుకోవడం ఎంతో హ్యాపీగా ఉంది. కావేరి అందరికి నచ్చుతుంది’ అని హీరో ఫైజల్ అన్నారు.‘ఇందులో కావేరి క్యారెక్టర్ బోల్డ్ గా, రా అండ్ రస్టిగ్ గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ లో రిషిత ఆకట్టుకునేలా నటించారు. రాజ్ కిరణ్ మ్యూజిక్ మా మూవీకి ఆకర్షణ అవుతుంది. మంచి సోషల్ మెసేజ్ తో మేము చేసిన చిత్రమిది’ అని డైరెక్టర్ రాజేశ్ నెల్లూరు అన్నారు.‘అబ్బాయిల ప్రవర్తన బాగుంటే అమ్మాయిలు సేఫ్ గా ఉంటారు. తమపై దాడులు జరిగినప్పుడు అమ్మాయిలు ధైర్యంగా ఎదుర్కోవాలి అనే అంశాలను ఈ మూవీలో చూపిస్తున్నాం. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా చూడాల్సిన చిత్రమిది’ అని నిర్మాత షేక్ అల్లాబకాషు అన్నారు. -
కావేరికి దారేది?
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానంపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) విఫలమవుతోంది. దీంతో ఏడేళ్లుగా ఈ ప్రతిపాదనలో ఒక్క అడుగూ ముందుకు పడని పరిస్థితి. నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలను ఎన్‌డబ్ల్యూడీఏ తీసుకోకుండా గోదావరి–కావేరి అనుసంధానం ప్రతిపాదన రూపొందించడమే దానికి కారణమని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.తొలుత అకినేపల్లి.. ఆ తర్వాత జానంపల్లి.. ఇప్పుడు ఇచ్ఛంపల్లి నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించేలా డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను ఎన్‌డబ్ల్యూడీఏ సిద్ధం చేసింది. తమ కోటా నీటిని కావేరికి ఎలా తరలిస్తారని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఇచ్ఛంపల్లి నుంచి అనుసంధానానికి అంగీకరించే ప్రశ్నే లేదని తెలంగాణ సర్కార్ చెబుతోంది.బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలంటే పోలవరం నుంచి కావేరికి గోదావరి జలాలను తీసుకెళ్లేలా ప్రతిపాదనలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడంలో ఎన్‌డబ్ల్యూడీఏ విఫలమవుతున్న నేపథ్యంలో కావేరితో గోదావరి అనుసంధానం కష్టమేనని నిపుణులు తేల్చిచెబుతున్నారు. ఏకపక్షంగా ప్రతిపాదన.. గోదావరిలో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీలకు 107 టీఎంసీల మిగులు జలాలను జతచేసి 248 టీఎంసీలను అకినేపల్లి నుంచి కావేరికి తరలించేలా 2017లో ఎన్‌డబ్ల్యూడీఏ డీపీఆర్‌ను రూపొందించింది. దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా జానంపేట నుంచి 248 టీఎంసీల గోదావరి జలాలను కావేరికి తరలించేలా 2018లో డీపీఆర్‌లో మార్పులు చేసింది. దీనిపై కూడా మూడు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.ఛత్తీస్‌గఢ్ ససేమిరా అంటున్నాగోదావరిలో మిగులు జలాలే లేవని.. నీటి లభ్యతే లేనప్పుడు అనుసంధానం ఎలా చేపడతారని 2020లో ఏపీ ప్రభుత్వం ఎన్‌డబ్ల్యూడీఏను నిలదీసింది. ఆంధ్రప్రదేశ్ హక్కులకు విఘాతం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేసింది. దాంతో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీలను ఇచ్ఛంపల్లి నుంచి కావేరికి తరలించేలా 2022లో డీపీఆర్‌లో ఎన్‌డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఇచ్ఛంపల్లి నుంచి అనుసంధానం చేపడితే దేవాదుల, సీతారామ ఎత్తిపోతల తదితర ప్రాజెక్టుల కింద ఆయకట్టు ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దిగువ రాష్ట్రం హక్కులను పరిరక్షించాలంటే పోలవరం నుంచే కావేరికి గోదావరి జలాలను తీసుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ కోటా నీటిని కావేరికి తరలించడానికి అనుమతించే ప్రశ్నే లేదని.. కాదూ కూడదని అనుసంధానం చేపడితే న్యాయపోరాటం చేస్తామని ఛత్తీస్‌గఢ్ సర్కార్ స్పష్టం చేసింది. కానీ.. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్ఛంపల్లి నుంచే ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని నీటిని కావేరికి తరలించే ప్రతిపాదననే ఎన్‌డబ్ల్యూడీఏ మళ్లీ తెరపైకి తేవడంపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. -
గొట్టిముక్కల ఎగువన రెండు జలాశయాలు
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా గొట్టిముక్కలకు ఎగువన లోయ తరహాలో ఉన్న ప్రాంతాల్లో రెండు జలాశయాలను నిర్మించాలని జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)ను తెలంగాణ కోరింది. ఈ ప్రాజెక్టు ద్వారా తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలను కేటాయించారని.. కానీ ఆ నీటితో ప్రతిపాదించిన 5.30 లక్షల ఎకరాల ఆయకట్టులో ఇప్పటికే 3 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ–2 ద్వారా నీళ్లు అందుతున్నాయని వివరించింది. అందువల్ల ఈ 45 టీఎంసీల నీటిని స్థానిక అవసరాల ఆధారంగా రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకునేలా వీలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ 45 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి రెండు జలాశయాలను నిర్మించాలని కోరింది.గోదావరి–కావేరి అనుసంధానంపై శుక్రవారం జలసౌధలో తెలంగాణతో ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశం నిర్వహించింది. ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, సీఈ దేవేందర్‌రెడ్డి, ఈఈ శ్రీనివాస్, రాష్ట్రం తరఫున నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) అనిల్‌కుమార్ పాల్గొన్నారు. భేటీలో రాహుల్ బొజ్జా మాట్లాడుతూ.. అనుసంధానం ప్రాజెక్టుపై రాష్ట్రానికి ఉన్న అభ్యంతరాలను వివరించారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు సాగునీటి సరఫరా కోసం 250 టీఎంసీలు అవసర మని చెప్పారు. అందువల్ల ప్రాజెక్టు ద్వారా తరలించే నీటిలో 50 శాతాన్ని తెలంగాణకు కేటాయించాలని కోరారు.రాష్ట్రం చేసిన విజ్ఞప్తులు, డిమాండ్లు ఇవీ..⇒ నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా నీటి తరలింపు కోసం ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని మా అధ్యయనంలో తేలింది. సమ్మక్క బరాజ్ నుంచే నీళ్లను తరలించాలి. రాష్ట్ర అవసరాల కోసం సమ్మక్క బరాజ్‌లో 83 మీటర్ల వరకు నిల్వలను సంరక్షిస్తూ ఆపై నిల్వలను మాత్రమే తరలించాలి. తెలంగాణకు సీతమ్మసాగర్ ప్రాజెక్టు కింద 70 టీఎంసీలు, సమ్మక్క ప్రాజెక్టు కింద 50 టీఎంసీలు, దేవాదుల కింద 38 టీఎంసీలు కలిపి మొత్తం 158 టీఎంసీల అవసరాలు ఉన్నాయి. వాటిని సంరక్షించాలి. సీతమ్మ ప్రాజెక్టులో విద్యుదుత్పత్తికి అవసరమైన కనీస నిల్వలను కాపాడాలి.⇒ సమ్మక్క బరాజ్‌లో 87 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేస్తే ఛత్తీస్‌గఢ్‌లో జరిగే ముంపు విషయంలో ఆ రాష్ట్రాన్ని ఒప్పించే బాధ్యతను ఎన్‌డబ్ల్యూడీఏ తీసుకోవాలి. ఛత్తీస్‌గఢ్ వాడుకోకపోవడంతో మిగిలే 148 టీఎంసీల గోదావరి జలాలను గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా తరలించనున్న నేపథ్యంలో.. ఈ అంశంపై ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పించి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై ఆ తర్వాతే సంతకాలు చేస్తాం.⇒ అనుసంధానం ప్రాజెక్టులో కాల్వలు, సొరంగాల కోసం సేకరించాల్సిన భూముల్లో రెండు పంటలు పండే ఆయకట్టు భూములున్నాయి. రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రం నిర్మించనున్న కాల్వల వ్యవస్థనే అనుసంధానం ప్రాజెక్టు అవసరాలకూ వాడుకోవాలి.⇒అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నీటిని నాగార్జునసాగర్‌కు ఎత్తిపోసి.. అక్కడి నుంచి కావేరికి తరలించాలని ప్రతిపాదించారు. అయితే కీలకమైన కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు వచ్చే వరకు సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకోరాదు. సాగర్ నిర్వహణ ప్రొటోకాల్‌తోపాటు ఏపీ, తెలంగాణలకు నీటి కేటాయింపులపై స్పష్టత వచ్చాకే ఈ విషయంలో ముందుకు వెళ్లాలి.50 శాతం వాటా మినహా మిగతావి ఓకే: ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్ సింగ్అనుసంధానం ప్రాజెక్టు ద్వారా తరలించే జలాల్లో తెలంగాణకు 50 శాతం కేటాయించాలనే డిమాండ్ విషయంలో పట్టువీడాలని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్ సింగ్ కోరారు. రెండు కొత్త జలాశయాల నిర్మాణం, సమ్మక్క బరాజ్ నుంచే నీటి తరలింపు, ఛత్తీస్‌గఢ్ నుంచి సమ్మతి తీసుకోవడం తదితర అంశాలన్నింటి పట్ల సానుకూలంగా ఉన్నామని తెలిపారు. తదుపరి చర్చల్లో ఈ అంశాలపై మరింత పురోగతి సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పెద్ద మనసుతో ముందుకొచ్చి ఎంఓయూ చేసుకోవాలని కోరారు.గౌరవెల్లి కాల్వల పనులకు అనుమతిసాక్షి, హైదరాబాద్: శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు–ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ (ఐఎఫ్ఎఫ్సీ) ప్రాజెక్టులోని ప్యాకేజీ– 7లో భాగంగా గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీళ్లను తరలించే కాల్వల నిర్మాణం కోసం రూ.431.30 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనాపరమైన అనుమ తులు జారీ చేస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. హుస్నాబాద్, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల పరిధి లోని 1,06,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ఈ పనులు చేపట్టనున్నారు. భూసేకరణలో పురోగతితో సంబంధం లేకుండా మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. -
సమ్మక్క నుంచే అనుసంధానం!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరీ నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద కొత్త బరాజ్ నిర్మించాలనే ప్రతిపాదనలకు బదులుగా ఇప్పటికే నిర్మించిన సమ్మక్క సాగర్ బరాజ్ నుంచే నీళ్లను తరలించాలని తెలంగాణ చేసిన విజ్ఞప్తిపై సోమవారం జరగనున్న నేషనల్‌వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశంలో చర్చించనున్నారు. సమావేశం ఎజెండాలో ఈ అంశాన్ని సైతం చేర్చినట్టు ఎన్‌డబ్ల్యూడీఏ రాష్ట్రానికి సమాచారం ఇచి్చంది. అలాగైతే అన్నీ సమస్యలే: తెలంగాణ ఆరు నెలల కిందట గోదావరి–కావేరీ అనుసంధానం ప్రాజెక్టు డీపీఆర్‌ను తెలంగాణకు అందించిన ఎన్‌డబ్ల్యూడీఏ దానిపై అభిప్రాయాన్ని కోరింది. ఇచ్చంపల్లి వద్దే బరాజ్ నిర్మిస్తామని ఇందులో ప్రతిపాదించింది. అయితే ఇచ్చంపల్లి బరాజ్ నిర్మిస్తే నదుల అనుసంధానం ప్రాజెక్టుకి, ఇచ్చంపల్లి దిగువన ఉన్న తమ ప్రాజెక్టుల అవసరాలకు ఏకకాలంలో నీళ్లను తరలించడం సాధ్యం కాదంటూ తెలంగాణ అభ్యంతరం తెలిపింది. సమ్మక్క సాగర్ బరాజ్‌కి బ్యాక్‌వాటర్ సమస్య ఏర్పడుతుందని, వరదల నిర్వహణ ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.ఇచ్చంపల్లి వద్ద కొత్త బరాజ్ కడితే, దానికి దిగువన తమ రాష్ట్రానికి ఉన్న 158 టీఎంసీల నీటి అవసరాలకు సైతం నష్టం కలుగుతుందని పేర్కొంది. ఇచ్చంపల్లికి దిగువన ఉన్న ప్రాజెక్టులైన దేవాదులకు 38 టీఎంసీలు, సీతారామకు 70 టీఎంసీలు, తుపాకులగూడెంకు 50 టీఎంసీలు కలిపి మొత్తం 158 టీఎంసీలు తమకు అవసరమని తెలంగాణ పేర్కొంటుండగా, ఈ నీటి వినియోగం లెక్కలను సమరి్పంచాలని గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ కోరింది.దీంతో సమ్మక్కసాగర్ బరాజ్‌కి ఎగువన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన మేడిగడ్డ బరాజ్ నుంచి ఏ మేరకు నీటిని పంపింగ్ చేయనున్నారు? సమ్మక్క సాగర్ నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకానికి, శ్రీరాంసాగర్ రెండో దశ ప్రాజెక్టుకు తరలించనున్న నీటి లెక్కలతో పాటు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా తరలించనున్న 70 టీఎంసీల నీటి వినియోగం లెక్కలను తెలంగాణ అందించింది.ఈ లెక్కల ఆధారంగా సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించి ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణం విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ తెలియజేసింది. మరోవైపు ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి తెలంగాణ అంగీకారం లభించే పరిస్థితి లేకపోవడంతో సమక్కసాగర్ నుంచే నీటిని తరలించే అంశాన్ని ఎన్‌డబ్ల్యూడీఏ సోమవారం నిర్వహించే సమావేశంలో పరిశీలించే అవకాశం ఉంది. సిమ్యులేషన్ స్టడీకి కేంద్రం ఓకే గోదావరి నీళ్లను తెలంగాణ ప్రాంతానికి తరలించడానికి వీలుగా ఇచ్చంపల్లి వద్ద 118 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మించడానికి 1980లోనే బచావత్ ట్రిబ్యునల్ అనుమతినిచి్చంది. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అభ్యంతరాలతో దీని ఎత్తును తొలుత 112 మీటర్లకు, మళ్లీ 1986–88లో 108 మీటర్లకు, కాలక్రమంలో 105 మీటర్లకు తగ్గించారు. తాజాగా నదుల అనుసంధానంలో భాగంగా 87 మీటర్ల ఎత్తుకు కుదించారు.అయినా ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. ఇక ఇచ్చంపల్లికి 24 కిలోమీటర్ల దిగువలోనే సమ్మక్క బరాజ్ ఉంది. ఇచ్చంపల్లి నుంచి అకస్మికంగా వరదను విడుదల చేస్తే సమ్మక్క బరాజ్ వద్ద వరదలు పోటెత్తి నిర్వహణ కష్టంగా మారుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వరదల తీవ్రతపై సిమ్యులేషన్ స్టడీ చేయాలన్న తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం అంగీకరించడంతో సమ్మక్క సాగర్ బరాజ్ నుంచే గోదావరి– కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా నీళ్లను తరలించే అవకాశాలు మెరుగయ్యాయి. -
‘సమ్మక్క’ నుంచే అనుసంధానం?
సాక్షి, హైదరాబాద్: గోదావరి –కావేరీ నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ కడితే, దానికి దిగువన తమ రాష్ట్రానికి ఉన్న 158 టీఎంసీల నీటి అవసరాలకు నష్టం కలుగుతుందని తెలంగాణ చేసిన అభ్యంతరాలతో నేషనల్‌వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ) పునరాలోచనలో పడింది. తమ రాష్ట్రం నిర్మించిన సమ్మక్క బ్యారేజీ నుంచే నీటిని తరలించాలని తెలంగాణ చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఇచ్చంపల్లికి దిగువన ఉన్న ప్రాజెక్టులైన దేవాదులకు 38 టీఎంసీలు, సీతారామకు 70 టీఎంసీలు, తుపాకులగూడెంకు 50 టీఎంసీలు కలిపి మొత్తం 158 టీఎంసీలు తమకు అవసరమని తెలంగాణ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎగువన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఏ మేరకు నీటిని పంపింగ్ చేయనున్నారు? సమ్మక్క సాగర్ నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకానికి, శ్రీరాంసాగర్ రెండో దశ ప్రాజెక్టుకు తరలించనున్న నీటి లెక్కలతో పాటు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా తరలించనున్న 70 టీఎంసీల నీటి వినియోగం లెక్కలు అందించాలని ఎన్‌డబ్ల్యూడీఏ తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ లెక్కల ఆధారంగా సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించి ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తెలంగాణ అభ్యంతరం నాలుగు నెలల క్రితం గోదావరి–కావేరీ అనుసంధానం ప్రాజెక్టు డీపీఆర్‌ను అందించిన ఎన్‌డబ్ల్యూడీఏ..దీనిపై తెలంగాణ అభిప్రాయాన్ని కోరింది. ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ నిర్మిస్తామని ఇందులో ప్రతిపాదించింది. అయితే ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మిస్తే నదుల అనుసంధానం ప్రాజెక్టుకి, ఇచ్చంపల్లి దిగువన ఉన్న తెలంగాణ ప్రాజెక్టుల అవసరాలకు ఏకకాలంలో నీళ్లను తరలించడం సాధ్యం కాదని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. అలాగే దిగువన ఉన్న సమక్క సాగర్ బ్యారేజీకి బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందని, వరదల నిర్వహణ సమస్యగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 1980లోనే ఇచ్చంపల్లి ప్రతిపాదనలు గోదావరి నీళ్లను తెలంగాణ ప్రాంతానికి తరలించడానికి వీలుగా ఇచ్చంపల్లి వద్ద 118 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించడానికి 1980లోనే బచావత్ ట్రిబ్యునల్ అనుమతిని చ్చింది. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అభ్యంతరాలతో దీని ఎత్తును తొలుత 112 మీటర్లకు, మళ్లీ 1986–88 లో 108 మీటర్లకు, కాలక్రమంలో 105 మీటర్లకు తగ్గించారు. తాజాగా నదుల అనుసంధానంలో భాగంగా 87 మీటర్ల ఎత్తుకు కుదించారు. అయినా ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. ఇక ఇచ్చంపల్లికి 24 కిలోమీటర్ల దిగువలోనే సమ్మక్క బ్యారేజీ ఉంది. ఇచ్చంపల్లి నుంచి అకస్మికంగా వరదను విడుదల చేస్తే సమ్మక్క బ్యారేజీ వద్ద వరదలు పోటెత్తి నిర్వహణ కష్టంగా మారుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాగా వరదల తీవ్రతపై సిమ్యులేషన్ స్టడీ చేయాలనే తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం అంగీకారం తెలుపడంతో సమ్మక్క బ్యారేజీ నుంచే గోదావరి– కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా నీళ్లను తరలించే అవకాశాలు మెరుగైనట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. -
గోదావరి–కావేరి అనుసంధానం.. ఇచ్చంపల్లి నుంచైతే కష్టమే!
సాక్షి, అమరావతి: ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేయాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) చేసిన ప్రతిపాదన ఆచరణ సాధ్యంకాదని న్యాయ, సాగునీటిరంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మధ్య 1975, డిసెంబర్ 19న కుదిరిన ఒప్పందం ప్రకారం ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలకు మించి ఉమ్మడి రాష్ట్రం వాడుకోవడానికి వీల్లేదు. ఇదే అంశాన్ని గోదావరి ట్రిబ్యునల్ అవార్డు స్పష్టంచేసింది. గోదావరి–కావేరి అనుసంధానం తొలిదశలో ఇచ్చంపల్లి నుంచి 141.3 టీఎంసీలు తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనను అమలుచేస్తే మూడు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం, గోదావరి ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘించినట్లవుతుందని న్యాయ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ఏర్పాటైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తుండడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన మేరకు పోలవరం నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. తక్కువ వ్యయంతో పనులు పూర్తిచేయవచ్చునని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన ఇదీ.. ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్‌గఢ్ (అప్పటి మధ్యప్రదేశ్)కు గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన నీటిలో వాడుకోని 141.3 టీఎంసీలకు 106 టీఎంసీల వరద జలాలను జతచేసి.. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా), గ్రాండ్ ఆనకట్ట (కావేరి) వరకూ నీటిని తరలించడం ద్వారా గోదావరి–కావేరి అనుసంధానం చేయాలని ఎన్‌డబ్ల్యూడీఏ తొలుత ప్రతిపాదించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు అభ్యంతరం చెప్పాయి. గోదావరి నికర జలాల్లో మిగులులేదని.. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే అనుసంధానం చేపట్టాలని డిమాండ్ చేశాయి. దీంతో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానం తొలిదశలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ మళ్లీ ప్రతిపాదించింది. ఆవిరి ప్రవాహ నష్టాలుపోనూ ఆంధ్రప్రదేశ్‌కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలను అందించాలని ప్రతిపాదించింది. దీనిపై ఛత్తీస్‌గఢ్ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. మా కోటాలో నీటిని తరలిస్తే న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పింది. గోదావరి, ఉప నదులలోని నికర జలాల్లో ఎగువ రాష్ట్రాలకు కేటాయించగా మిగిలిన నీరు, వరద జలాలపై పూర్తి హక్కును దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ట్రిబ్యునల్ ఇచ్చింది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఎన్‌డబ్ల్యూడీఏకు పలుమార్లు కోరింది. పోలవరం నుంచైతేనే కావేరికి గోదావరి.. గోదావరి బేసిన్లో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఏ రాష్ట్రం హక్కులకు విఘాతం కలగదు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రస్తావిస్తూ.. పోలవరం నుంచి గోదావరి–కావేరి అనుసంధానాన్ని చేపట్టాలని సూచించారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు చేరిన గోదావరి జలాలను కృష్ణా నదీ ప్రవాహానికి వ్యతిరేక దిశలో పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలంలోకి ఎత్తిపోసి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సోమశిలకు అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించేలా పనులు చేపట్టాలని సూచిస్తున్నారు. దీనివల్ల భూసేకరణ, నిర్వాసితుల సమస్య తప్పుతుందని.. తక్కువ వ్యయంతో గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టవచ్చునన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను న్యాయ, సాగునీటిరంగ నిపుణులు బలపరుస్తున్నారు. మూడు రాష్ట్రాల మధ్య ఒప్పందం ఇదీ.. గోదావరిపై ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం 1975, డిసెంబర్ 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం మేరకు ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలను మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవచ్చు. రిజర్వాయర్ నుంచి 3 టీఎంసీలు మధ్యప్రదేశ్, 4 టీఎంసీలు మహారాష్ట్ర, 5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ఎత్తిపోతల ద్వారా వినియోగించుకోవచ్చు. మిగతా నీటిని విద్యుదుత్పత్తికి వినియోగించాలి. ఉత్పత్తయ్యే విద్యుత్‌లో మధ్యప్రదేశ్ 38 శాతం, మహారాష్ట్ర 35 శాతం, ఆంధ్రప్రదేశ్ 27 శాతం వాడుకోవాలి. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 78.10 శాతం ఆంధ్రప్రదేశ్, 10.50 శాతం మహారాష్ట్ర, 11.40 శాతం మధ్యప్రదేశ్ భరించాలి. ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నిర్వహించాలి. -
మా హక్కులను పరిరక్షించాకే అనుసంధానం చేపట్టాలి
సాక్షి, అమరావతి: గోదావరి నదిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి.. తమ రాష్ట్ర హక్కులను పరిరక్షించాకే కావేరికి గోదావరి నీటిని తరలించాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)కు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా కర్ణాటకలో బెడ్తి–వరద నదుల అనుసంధానం చేపట్టనున్న తరహాలోనే రాష్ట్రంలోనూ నదుల అనుసంధానాన్ని చేపట్టాలని కోరింది. ఈ అంశంపై చర్చించడానికి విజయవాడలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ చేసిన సూచనకు కేంద్రం అంగీకరించింది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన ఎన్‌డబ్ల్యూడీఏ 72వ పాలకమండలి సమావేశం వర్చువల్ విధానంలో బుధవారం జరిగింది. ఇందులో ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరాతోపాటు అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రం తరఫున అంతర్ రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ శ్రీనివాస్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో సాగు, తాగునీటి కొరతను అధిగమించే లక్ష్యంతో చేపట్టటనున్న గోదావరి–కావేరి అనుసంధానానికి అంగీకరిస్తూ అవగాహన ఒప్పందం(ఎంవోయూ)పై సంతకాలు చేస్తే పనులు ప్రారంభిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ బేసిన్ పరిధిలోని రాష్ట్రాలకు సూచించారు. గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా (నికర జలాలు) మిగులు జలాలు లేవని సీడబ్ల్యూసీ తేల్చిన నేపథ్యంలో అనుసంధానం ఎలా చేపడతారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలని డిమాండ్ చేశాయి. నికర జలాల్లో మిగిలిన జలాలు, వరద జలాలపై దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి ట్రిబ్యునల్ పూర్తి హక్కులు ఇచ్చిందని.. వాటిని పరిరక్షిస్తూ అనుసంధానం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అనుసంధానంపై బేసిన్‌లోని రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలని ఎన్‌డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ అధికారులను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ముందుకొస్తేనే గోదావరి–కావేరి చేపడతామని స్పష్టం చేశారు. -
గోదావరి–కావేరిపై సమ్మతి!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై చిన్న ముందడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి సమ్మతి తెలుపుతూ పరస్పర అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేసేందుకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. కేంద్ర జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో నదుల అనుసంధానంపై సంప్రదింపులు, టాస్‌్కఫోర్స్ సమావేశాలను నిర్వహించింది. టాస్క్‌ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరామ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీల్లో ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌సింగ్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఇతర రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేసి రాష్ట్రాలకు అందజేస్తామని, అప్పటి నుంచి 15 రోజుల్లోగా అన్ని రాష్ట్రాల సీఎంలు ఎంఓయూపై సంతకాలు చేయాలని వెదిరె శ్రీరామ్ సూచించారు. ఈ భేటీల నిర్ణయాలను ఈనెల 22న ఢిల్లీలో నిర్వహించనున్న ఎన్‌డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశంలో ఆమోదిస్తామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి(గోదావరి)–మూసీ–నాగార్జునసాగర్–సోమశిల– గ్రాండ్ ఆనికట్ (కావేరి)లను అనుసంధానం చేస్తామని తెలిపారు. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ వద్దు: తెలంగాణ గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు రక్షణ కల్పిస్తే అనుసంధానం ప్రాజెక్టుకు సమ్మతి తెలుపుతామని సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ సి.మురళీధర్ స్పష్టంచేశారు. ప్రాజెక్టు ద్వారా తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 50శాతం కేటాయించాలని కోరారు. గోదావరి జలాల్లో రాష్ట్రాల వారీగా వాటాలను నిర్థారించి, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు జరగకుండా ఫ్రీజ్ చేయాలన్నారు. గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద కాకుండా కొంత ఎగువన బ్యారేజీ నిర్మించి నీటిని తరలించాలని.. లేకుంటే దిగువన ఉన్న సమ్మక్క బ్యారేజీ నిర్వహణలో సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఇచ్చంపల్లి వద్దే నిర్మిస్తాం: వెదిరె శ్రీరాం తెలంగాణ సహా ఏ రాష్ట్ర వాటా నీటికీ నష్టం కలిగించమని వెదిరే శ్రీరామ్ సమాధానమిచ్చారు. భౌగోళికంగా ఉన్న ప్రతికూలతల దృష్ట్యా ఛత్తీస్‌గఢ్, ఇతర ఎగువ రాష్ట్రాలు వాడుకోలేకపోతున్న గోదావరి జలాలనే తరలిస్తామని స్పష్టం చేశారు. గోదావరిలో మిగులు జలాల లభ్యత లేదని నిర్థారించిన నేపథ్యంలో వాటిని సైతం వినియోగించబోమని హామీ ఇచ్చారు. తెలంగాణకు 50శాతం వాటా కేటాయింపును పరిశీలిస్తామన్నారు. తొలి విడత ప్రాజెక్టుకు కేవలం 400 హెక్టార్ల భూసేకరణ మాత్రమే అవసరమని చెప్పారు. ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ నిర్మాస్తామని, సమ్మక్క బ్యారేజీకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మా వాటా పూర్తిగా వాడుకుంటాం: ఛత్తీస్‌గఢ్ గోదావరిలో తమ రాష్ట్ర వాటాను పూర్తిగా వాడుకుంటామని సమావేశంలో ఛత్తీస్‌గఢ్ చీఫ్ ఇంజనీర్ కుబేర్‌సింగ్ గురోవర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సర్వేలు పూర్తిచేసి, సీడబ్ల్యూసీ నుంచి ప్రాథమిక స్థాయి అనుమతులు పొందామని చెప్పారు. దీంతో ఛత్తీస్‌గఢ్ తన వాటా జలాలను వాడుకోవడం ప్రారంభించిన వెంటనే గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టు ద్వారా నీటి తరలింపును నిలుపుదల చేస్తామని వెదిరె శ్రీరామ్ హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్ ప్రాజెక్టులు పూర్తి కావడానికి మరో 10 ఏళ్లకు పైగా పట్టవచ్చని, ఆలోగా మహానది–గోదావరి అనుసంధానం పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం నుంచే అనుసంధానం జరపాలి: ఏపీ గోదావరి–కావేరి అనుసంధానాన్ని పోలవరం ప్రాజెక్టు నుంచి చేపట్టాలని ఏపీ తరఫున శశిభూషణ్‌కుమార్ కోరారు. గోదావరిలో ఛత్తీస్‌గఢ్ వాడుకోని జలాలను సాంకేతికంగా నిర్ధారించాలని కోరారు. గోదావరిలో 75శాతం లభ్యత ఆధారంగా నికర జలాల లభ్యత లేదని తేల్చుతూ సీడబ్ల్యూసీ ఇ చ్చిన నివేదికలో తారతమ్యాలు ఉన్నాయని, మరింత స్పష్టత కల్పిoచాలని సూచించారు. బెడ్తి–వార్ధా నదుల అనుసంధానం ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని హెచ్ఎల్సీ ప్రాజెక్టుకు నీళ్లు కేటాయించాలన్నారు. ఎగువ రాష్ట్రాల వినియోగంతో గోదావరిలో దిగువ చివరి రాష్ట్రం ఏపీ వాటాకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని.. ఇందుకోసం ఏపీతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఎన్‌డబ్ల్యూడీఏను కోరారు. దీనిపై స్పందించిన వెదిరె శ్రీరామ్.. తొలివిడతలో ఇచ్చంపల్లి నుంచి అనుసంధానం చేపడతామని, తదుపరి దశల్లో ఇతర ప్రాంతాల నుంచి సైతం గోదావరి జలాల తరలింపును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ వాటాలకు రక్షణ కల్పించే విషయంలో రాజీపడబోమని భరోసా ఇచ్చారు. నాగార్జునసాగర్, సోమశిల జలాశయాల కింద ఇప్పటికే ఉన్న ఆయకట్టుతోపాటు నదుల అనుసంధానం ప్రాజెక్టు కింద ప్రతిపాదిస్తున్న కొత్త ఆయకట్టుకు సైతం సాగునీటిని సరఫరా చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. -
గోదావరి–కావేరి అనుసంధానంపై మళ్లీ కదలిక
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు విషయంలో ముందడుగు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ 3న హైదరాబాద్‌లో ఇందుకు సంబంధించిన రెండు కీలక సమావేశాలను నిర్వహించతలపెట్టింది. ఉదయం 11.30 గంటలకు నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ) డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ ఆధ్వర్యంలో గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై వేసిన స్టాండింగ్ కమిటీ ఐదో సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం కూడా చైర్మన్ వెదిరే శ్రీరామ్ అధ్యక్షతన జరగనుంది. ఉదయం జరిగే సమావేశంలో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయూ)ముసాయిదాను ఆయా రాష్ట్రాలకు అందజేయనున్నారు. చివరిసారిగా జరిగిన 4వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో గోదావరిపై ఎక్కడ బ్యారేజీ నిర్మించి నీళ్లను తరలించాలనే అంశంపై ఎన్‌డబ్ల్యూడీఏ ఆధ్వర్యంలో అధ్యయనం జరపా లని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి వద్దే గోదావరిపై బ్యారేజీ నిర్మించాలని తాజాగా ఎన్‌డబ్ల్యూడీఏ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై నవంబర్ 3న జరగనున్న స్టాండింగ్ కమిటీ, టాస్క్‌ఫోర్స్ సమావేశాల్లో విస్తృతంగా చర్చించి అన్ని రాష్ట్రాల సమ్మతి పొందాలని ఎన్‌డబ్ల్యూడీఏ భావిస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వినియోగించుకోని 141 టీఎంసీల గోదావరి జలా లను గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా తరలించాలని గతంలో నిర్ణయం తీసుకోగా, తాజాగా ఆ పరిమాణాన్ని 151 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కర్ణాటక కోటాను 19 టీఎంసీలకు పెంచనున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వాడుకోని 151 టీఎంసీల నీళ్లను తరలించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిరభ్యంతర పత్రం జారీ చేస్తేనే ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లాలని ఇప్పటికే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు కోరాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 3న జరగనున్న సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోనన్నది ఆసక్తికరంగా మారింది. -
టైరు పేలి.. మంటలు చెలరేగి..
మిర్యాలగూడ అర్బన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం నార్కట్‌పల్లి–అద్దంకి రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ నుంచి 26 మంది నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలోని దర్గాను దర్శించుకునేందుకు వేమూరి కావేరి ట్రావెల్ బస్సును బుక్ చేసుకుని గురువారం రాత్రి బయల్దేరారు. శుక్రవారం తెల్లవారుజామున మిర్యాలగూడ హనుమాన్‌పేట ప్లైఓవర్ వద్దకు చేరుకోగానే బస్సు వెనుక టైర్ ఒక్కసారిగా పేలిపోయి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కకు నిలిపాడు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులను బస్సు నుంచి దింపి వేశారు. బస్సులోని మూడు బకెట్లతో నీటిని చల్లినా మంటలు అదుపులోకి రాకపోగా.. క్షణాల్లో డీజిల్ ట్యాంక్‌కు మంటలు వ్యాపించి బస్సు మొత్తం కాలిపోయింది. ఎస్ఐ కృష్ణయ్య అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శకటం వచ్చేలోపు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ బస్సు.. రోడ్డు పక్కన నిలిపిఉన్న ఉల్లిగడ్డల లోడు లారీ పక్కనే ఆగిపోయింది. దీంతో లోడుపై కప్పిన టార్పాలిన్ సహా లారీకి కూడా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులోని 26 మందిని కిందకు దింపడంతో ప్రాణ నష్టం తప్పింది. -
పట్టుబట్టి ఎస్ఐ కొలువు సాధించి..
తాండూరు టౌన్: పేదరికాన్ని లెక్క చేయని యువతి కష్టపడి ఉన్నత కొలువును సాధించింది. లక్ష్య సాధనకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది. ఇటీవల విడుదలైన ఎస్ఐ ఫలితాల్లో తాండూరు పట్టణం పసారీ వార్డుకు చెందిన వీరేశం, నిర్మల దంపతుల కూతురు దూది కావేరి ఎస్సై (సివిల్) ఉద్యోగం సాధించింది. తండ్రి పట్టణ శివారులోని ఓ స్పిన్నింగ్ మిల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. చిన్ననాటి నుంచి చదువుపై మక్కువ చూపే కావేరి పదో తరగతి స్థానిక శ్రీ సరస్వతీ శిశుమందిర్, ఇంటర్మీడియెట్ తాండూరు చైతన్య కళాశాలలో, డిగ్రీ ఓపెన్‌లో చదివింది. డీఎడ్ చదివి డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న ఆమె.. హైదరాబాద్‌లో ఎస్సై పరీక్ష కోసం శిక్షణ తీసుకుంది. పట్టుదలతో ఎస్సై కొలువు సాధించింది. దీంతో కావేరిని కుటుంబసభ్యులు, స్నేహితులు అభినందనలతో ముంచెత్తారు. -
బిడ్డ జ్ఞాపకార్థం.. గుర్తుగా లైబ్రరీ..
నిర్మల్: అల్లారుముద్దుగా పెంచిన బిడ్డ అర్ధంతరంగా దూరమైంది. తనలాగే సమాజానికి వైద్యసేవలందిస్తుందని డాక్టర్‌ను చేస్తే.. తానే ముందుగా వెళ్లిపోయింది. ఆ బిడ్డను మర్చిపోని తండ్రి ఓ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన బిడ్డలా పేద విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని, సామాజిక సేవలో భాగమయ్యారు. తన కుమార్తె ‘కావేరి’ పేరిట జిల్లాకేంద్రానికి చెందిన పిల్లల వైద్యుడు అప్పాల చక్రధారి అధునాతన లైబ్రరీ ఏర్పాటు చేశారు. తన బిడ్డను తలచుకుంటూ ఎంతోమంది విద్యార్థులకు సేవలందిస్తున్నారు. 2017 నుంచే గ్రంథాలయం.. జిల్లాకేంద్రంలోని డాక్టర్స్లైన్, తిరుమల థియేటర్ ఎదురుగా గల తన నివాసంలోనే 2017లో కావేరి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. దినపత్రికలు, ఇతర పుస్తకాలతో పాటు పోటీపరీక్షలకు సంబంధించిన మెటీరియల్ మొత్తం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతూ వచ్చారు. ఆన్లైన్ ద్వారా సమాచారం తెలుసుకునేందుకు ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్లు అందుబాటులో ఉంచారు. దాదాపు ఆరేళ్ల కాలంలో ఇక్కడ ప్రిపేరవుతున్న వారిలో పదులసంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉందని చక్రధారి చెబుతున్నారు. మరింత అధునాతనంగా.. తన కూతురు ఎప్పుడూ నిర్మల్‌లో అన్నిరకాల సౌకర్యాలతో ఆస్పత్రి, లైబ్రరీ ఇలా అన్నీ ఉండాలని కోరుకునేదని డాక్టర్ చక్రధారి పేర్కొన్నారు. ఆమె కోరిక మేరకే ఆస్పత్రి, కావేరి కుటీరాన్ని నిర్మించారు. ఈమేరకు అధునాతన లైబ్రరీని సిద్ధం చేశారు. ఏడాది క్రితం తన ఇంటిని పూర్తిగా కూల్చేశారు. అందులో ఉన్న లైబ్రరీని డాక్టర్స్లైన్లోనే వేరే భవనంలో కొనసాగించారు. అదేస్థానంలో అధునాతనంగా, పూర్తిసౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మించారు. విద్యార్థులు, అభ్యర్థులకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో తను ఉండాల్సిన ఇల్లు కంటే ముందే లైబ్రరీ భవనాన్ని పూర్తిచేయించారు. నూతన గ్రంథాలయ భవనాన్ని గురువారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇవీ.. సౌకర్యాలు రాష్ట్రంలోనే పూర్తి ఉచితంగా అధునాతన సౌకర్యాలతో ఉన్న ఏకై క లైబ్రరీగా కావేరి గ్రంథాలయాన్ని చె బుతుంటారు. ఇందులో విశాలమైన గదుల్లో రీడింగ్ రూములున్నాయి. అన్ని దినపత్రికలు, పోటీపరీక్షల పూర్తి మెటీరియల్ ఉంది. పాఠకులు, అభ్యర్థులు కో రితే వెంటనే సంబంధిత మెటీరియల్ తెప్పించి ఇ స్తారు. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా రీడింగ్ రూములు న్నాయి. మాక్‌టెస్టులు, ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడానికి హైస్పీడ్ ఇంటర్నెట్తో అధునాతన కంప్యూటర్ల గది ఉంది. పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషన్ క్లాసుల కోసం ప్రత్యేకంగా ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు. పాఠకులు, అభ్యర్థులు భోజనం చేయడానికి ప్రత్యేకంగా డైనింగ్‌హాల్ నిర్మించారు. చాలా సంతృప్తినిస్తోంది నా బిడ్డ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయం ద్వారా ఎంతోమంది విద్యార్థులు, అభ్యర్థులు లబ్ధి పొందడం, ఉద్యోగాలు సాధించడం చాలా సంతృప్తినిస్తోంది. ప్రిపరేషన్ కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని అధునాతన సౌకర్యాలు కల్పించాం. అభ్యర్థులకు ఎప్పటికప్పుడు కొత్త మెటీరియల్ తెప్పిస్తున్నాం. – డాక్టర్ చక్రధారి, కావేరి లైబ్రరీ చైర్మన్ -
కావేరికి ‘గోదారే’!
సాక్షి, అమరావతి : గోదావరి–కావేరి అనుసంధానానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై నీటిపారుదలరంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సర్కార్ అంగీకరించకున్నా.. ఆ రాష్ట్ర వాటాలో వాడుకోని 141.3 టీఎంసీలను తరలించాలని ప్రతిపాదించడాన్ని వారు తప్పుపడుతున్నారు. మా నీళ్లను కావేరికి ఎలా తరలిస్తారంటూ ఛత్తీస్‌గఢ్ సర్కార్ అభ్యంతరం తెలపడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ 141.3 టీఎంసీలపై ఛత్తీస్‌గఢ్ సర్కార్ హక్కులను వదులుకోవడానికి అంగీకరించినా ఆ జలాలను కావేరికి తరలించడానికి న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని స్పష్టంచేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ వదులుకున్న 141.3 టీఎంసీలను పునఃపంపిణీ చేయాలని గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) పరిధిలోని రాష్ట్రాలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశం ఉంటుందని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) మాజీ చైర్మన్ ఏబీ మొహిలే చెబుతున్నారు. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి.. బేసిన్ పరిధిలోని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధిస్తేనే గోదావరి–కావేరి అనుసంధానం సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలకు 106 టీఎంసీల మిగులు జలాలను జతచేసి.. 247 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట (కావేరి)కి తరలించేలా 2018లో ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన రూపొందించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులకు తలా 80 టీఎంసీలను కేటాయించాలని ప్రతిపాదించారు. ఆదిలోనే సీడబ్ల్యూసీ అభ్యంతరం.. గోదావరి–కావేరి అనుసంధానానికి ఎన్‌డబ్ల్యూడీఏ రూపొందించిన ప్రతిపాదనపై ఆదిలోనే సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తంచేసింది. గోదావరిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే మిగులు జలాలు లేవని సీడబ్ల్యూసీ స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో 106 టీఎంసీలను ఎలా తరలిస్తారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఎన్‌డబ్ల్యూడీఏను నిలదీశాయి. దాంతో గోదావరి–కావేరి అనుసంధానంలో ఎన్‌డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీల గోదావరి జలాలను తరలించేలా డీపీఆర్‌ను రూపొందించింది. ఆవిరి ప్రవాహ నష్టాలుపోనూ ఆంధ్రప్రదేశ్‌కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలు అందిస్తామని పేర్కొంది. దీనిపై బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో గత మార్చి 6న టాస్క్‌ఫోర్స్ కమిటీ సంప్రదింపులు జరిపింది. ఛత్తీస్‌గఢ్ అభ్యంతరం చెబుతున్నా.. టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్వహించిన ఈ సమావేశానికి ఛత్తీస్‌గఢ్ సర్కార్‌ను ఆహ్వానించలేదు. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రస్తావిస్తూ.. ఛత్తీస్‌గఢ్ సర్కార్‌ను ఆహ్వానించకుండా, ఆ రాష్ట్ర కోటా నీటి తరలింపుపై ఎలా చర్చిస్తామని టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రశ్నించాయి. ఛత్తీస్‌గఢ్ సర్కార్‌తో ఉన్నతస్థాయిలో చర్చించి.. ఆ రాష్ట్ర కోటా నీటిని తరలించడానికి అంగీకరింపజేస్తామని కమిటీ చెప్పుకొచ్చింది. కానీ, ఇది ఆచరణ సాధ్యంకాదని సీడబ్ల్యూసీ చైర్మన్ ఏబీ మొహిలే స్పష్టంచేశారు. గోదావరి ట్రిబ్యునల్ కేటాయించని జలాలపై పూర్తి హక్కు తమకుందని.. తమ నీటిని ఎలా తరలిస్తారని ఛత్తీస్‌గఢ్ సర్కార్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో.. గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ ఎలా ముందడుగు వేస్తుందన్నది వేచిచూడాల్సిందే. -
హ్యాట్సాఫ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. చిమ్మచీకట్లో సాహాసోపేతంగా 121 మందిని..
ఢిల్లీ: అదొక చిన్న రన్‌వే ఉన్న ఎయిర్‌స్ట్రిప్. కమ్యూనికేషన్లో భాగంగా.. నావిగేషనల్ అప్రోచ్ సహకారం లేదు. అక్కడ ఫ్యూయల్ సౌకర్యమూ లేదు. రాత్రి పూట ల్యాండ్ చేయడానికి ఏమాత్రం అనుకూలంగా లేని చోటు అది. ల్యాండింగ్ లైట్లు కూడా లేని చోటు నుంచి జనాల్ని తరలించే ఆపరేషన్ సక్సెస్‌గా పూర్తి చేసింది భారత వైమానిక దళం. తద్వారా ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేపట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేసే దమ్ము ఉందని మరోసారి నిరూపించుకుంది. సూడాన్ నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పించే ‘ఆపరేషన్ కావేరి’ వేగవంతంగా సాగుతోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి వందకు పైగా మందిని తరలించే క్రమంలో తెగువ ప్రదర్శించారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లు. జెడ్డాకు చేరుకునే క్రమంలో పోర్ట్ ఆఫ్ సూడాన్‌కు 121 మందితో కూడిన భారతీయ పౌరుల బృందం చేరుకోవాల్సి ఉంది. అయితే.. చేరుకునే మార్గం లేక వాడి సయ్యద్నా చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న ఏఐఎఫ్ రంగంలోకి దిగింది. వాళ్లను తరలించేందుకు C-130J హెర్క్యులస్‌తో బయల్దేరింది. అయితే.. వాడి సయ్యద్నాలో ఉన్న చిన్న ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండింగ్‌కు అనుకూలంగా లేని పరిస్థితి. దీంతో.. పైలట్లు సమయస్ఫూర్తి ప్రదర్శించారు. నైట్ విజన్ గాగుల్స్ (Night Vision Goggles) సాయంతో ఏమాత్రం తప్పిదం లేకుండా ఎయిర్‌ఫోర్స్ పైలెట్లు ఎయిర్‌క్రాఫ్ట్‌ను చాకచక్యంగా ల్యాండ్ చేశారు. ఎలక్ట్రో-ఆప్టికల్/ఇన్ఫ్రా-రెడ్ సెన్సార్లను ఉపయోగించి ఎలాంటి ఆటంకాలు లేవని ధృవీకరించుకున్న తర్వాతే.. అంత చిన్న రన్‌వేలో ఎయిర్‌క్రాఫ్ట్ దించగలిగారు. ల్యాండింగ్ అయ్యాక కూడా ఇంజిన్లను ఆన్‌లోనే ఉంచి.. అక్కడున్నవాళ్లను, వాళ్ల లగేజీలను విమానంలోకి ఎక్కించారు. ఆ సమయంలో ఎయిర్‌ఫోర్స్ స్పెషల్ యూనిట్ గరుడకు చెందిన ఎనిమిది మంది కమాండోలు ప్యాసింజర్ల భద్రతను పర్యవేక్షిస్తూనే.. సురక్షితంగా ఎక్కించారు. విమానం ఎలాగైతే దిగిందో.. అదే తరహాలో ఎన్వీజీ ఉపయోగించి టేకాఫ్ చేశారు. అలా రెండున్నర గంటలపాటు ఈ రిస్కీ ఆపరేషన్ కొనసాగింది. కల్లోల రాజధాని ఖార్తోమ్కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఇదంతా చోటుచేసుకోవడం గమనార్హం. అంతా జెడ్డాకు సురక్షితంగా చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆపరేషన్ కావేరి ద్వారా ఇప్పటిదాకా 1,360 మందిని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చింది కేంద్రం. ఇదీ చదవండి: ఎన్నాళ్లకెన్నాళ్లకు! 110 ఏళ్ల తర్వాత.. -
నికర జలాల మిగులు తేలాక కావేరికి గోదావరి
ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన: ఇచ్చంపల్లి నుంచి 141.3 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జున సాగర్‌లోకి ఎత్తిపోసి.. సాగర్ కుడి కాలువకు సమాంతరంగా తవ్వే కాలువ ద్వారా వాటిని సోమశిల, కండలేరుకు తరలించి.. అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తీసుకెళ్లాలి. ఆవిరి ప్రవాహ నష్టాలుపోను ఆంధ్రప్రదేశ్‌కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలను అందించాలి. దీని ప్రకారం పనులు చేపట్టాలంటే తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఏపీలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సారవంతమైన భూములను సేకరించాలి. ఇది ఖర్చుతోనూ కూడుకున్నది. సారవంతమైన భూములను సేకరించడం అతి పెద్ద సవాల్. సీఎం జగన్ చేసిన ప్రతిపాదన: పోలవరం ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోసి.. అక్కడి నుంచి కృష్ణా నది మీదుగా రివర్స్ పంపింగ్ చేస్తూ శ్రీశైలం జలాశయంలోకి తరలించి.., పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ మీదుగా తెలుగు గంగ ప్రధాన కాలువ ద్వారా సోమశిల, కండలేరు జలాశయాలకు తరలించి.. అక్కడి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించాలి. దీని ప్రకారం పనులు చేపట్టడానికి తెలంగాణలో అతి తక్కువ భూమిని సేకరిస్తే సరిపోతుంది. ఏపీలో భూమిని సేకరించాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతో గోదావరి–కావేరి అనుసంధానం చేయడమే కాదు దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయవచ్చు. సాక్షి, అమరావతి: గోదావరి నదిలో నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి.. 75 శాతం లభ్యత (నికర జలాలు) ఆధారంగా మిగులు జలాలు ఉన్నాయని తేల్చాకే కావేరికి గోదావరి జలాలను తరలించాలని టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ వెదిరె శ్రీరామ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. నదుల అనుసంధానంపై కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన టాస్క్‌ఫోర్స్ 17వ సమావేశంలో జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి వర్చువల్‌గా పాల్గొన్నారు. కేసీ కెనాల్ ద్వారా తుంగభద్ర–పెన్నా, తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా కృష్ణా – పెన్నాలను అనుసంధానం చేసి దేశంలో నదుల అనుసంధానికి ఏపీ మార్గదర్శకంగా నిలిచిందని శశిభూషణ్‌కుమార్ గుర్తు చేశారు. గోదావరి – కావేరి నదుల అనుసంధానంలో దిగువ రాష్ట్రమైన తమ హక్కులకు విఘాతం కలగకుండా చూడాలని సూచించారు. కేంద్రం నిధులు ఇచ్చి సహకరిస్తే పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి కుడి కాలువ ద్వారా దేశంలో అతి పెద్ద నదులైన గోదావరి, కృష్ణాను అనుసంధానం చేసి, 80 టీఎంసీలను తరలిస్తామని చెప్పారు. దీనిపై టాస్క్‌ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరాం సానుకూలంగా స్పందించారు. సత్వరమే పోలవరాన్ని పూర్తి చేయడానికి సరిపడా నిధులు విడుదల చేయాలని కేంద్రానికి సూచిస్తానని హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్ అనుమతి తీసుకున్నాకే ఇచ్చంపల్లి వద్ద గోదావరిలో నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రతినిధులు పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా తరలిస్తామని వెదిరె శ్రీరామ్ చెప్పారు. ఈ సమావేశానికి ఛత్తీస్‌గఢ్ ప్రతినిధులను ఆహ్వానించకుండా ఆ రాష్ట్ర కోటా నీటిని వాడుకుంటామని ప్రతిపాదించడంపై ఏపీ, తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఛత్తీస్‌గఢ్ అనుమతి తీసుకున్నాకే అనుసంధానం చేపట్టాలని స్పష్టంచేశారు. కోటా నీటిని ఛత్తీస్‌గఢ్ వాడుకునే సమయానికి గోదావరికి మహానది జలాలను తరలిస్తామని, వాటిని కావేరికి తీసుకెళ్తామని వెదిరె శ్రీరామ్ చెప్పారు. ఈ అంశంపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ చర్చలు జరుపుతారని తెలిపారు. పోలవరం నుంచి గోదావరి తరలింపు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పోలవరం ప్రాజెక్టు జలవిస్తరణ ప్రాంతం నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను వెదిరె శ్రీరామ్ దృష్టికి ఏపీ అధికారులు తీసుకెళ్లారు. సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదన మేరకు అనుసంధానం చేపడితే.. భూసేకరణ సమస్య లేకుండా, అతి తక్కువ వ్యయంతో కావేరికి గోదావరి జలాలను తరలించవచ్చని వివరించారు. దీనివల్ల ఐదు రాష్ట్రాలకు గరిష్ట ప్రయోజనం చేకూర్చవచ్చని చెప్పారు. సమ్మక్క (తుపాకులగూడెం) బ్యారేజ్ నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించాలని తెలంగాణ అధికారులు సూచించారు. ఈ రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తామని వెదిరె శ్రీరామ్ చెప్పారు. అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయంతోనే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని వెదిరె శ్రీరాం చెప్పారు. -
చేపల్లాంటి పిల్లలు... కడలిని ఈదేస్తున్నారు
జీవితమంటేనే కష్ట సుఖాల కలయిక. కొంతమంది జీవితాల్లో సుఖాలకంటే కష్టాలే ఎక్కువగా ఉంటాయి. వాటిలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొందరు. కానీ కొందరు తమ కష్టాలకు ప్రతిభను జోడించి అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే జియారాయ్, కావేరి ధీమార్‌లు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనేక సమస్యలను కడలికి ఎదురీదుతూ తమ వయసు కంటే ఎక్కు సంఖ్యలో మెడల్స్‌ను సాధిస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. ఇండియన్ పారా స్విమ్మర్ జియారాయ్ నేవీ అధికారి మదన్ రాయ్, రచన దంపతుల ముద్దుల కూతురు. సొంత ఊరు యూపీ అయినప్పటికీ మదన్ ఉద్యోగ రీత్యా ముంబైలో ఉండడంతో జియా అక్కడే పెరిగింది. పుట్టి ఏడాదిన్నర దాటినా జియా చిన్న చిన్న మాటలు కూడా సరిగా పలకలేక పోతోంది. తల్లిదండ్రులు కంగారు పడి డాక్టర్లకు చూపించారు. ఆటిజం అని తెలిసింది. మిగతా పిల్లల్లా ఏదీ సులభంగా నేర్చుకునేది కాదు. ఏదైనా పదేపదే చెబితే కోపం వచ్చేది. నేర్చుకోకపోగా విపరీతంగా అరిచేది. ఒకరోజు మదన్ జియాను స్విమ్మింగ్ పూల్‌లో దించగానే అమె నీళ్లను ఇష్టపడుతూ బాగా ఆడుకుంది. డాక్టర్లు కూడా వాటర్ స్పోర్ట్స్ ఆడిస్తే జియాలో త్వరగా మార్పులు కనిపిస్తాయని సూచించారు. వాటర్ థెరపీలో భాగంగా వాటర్ గేమ్స్ ఆడుతూ జియాకు స్విమ్మింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. దీంతో స్విమ్మింగ్ సాధన చేయడం ప్రారంభించింది. ఎన్నో సమస్యలున్నా అన్నిటినీ తల్లిదండ్రుల సాయంతో ఎదుర్కొని మంచి స్విమ్మర్‌గా ఎదిగింది జియా. అనేక జాతీయ స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని వయసుకంటే ఎక్కువ సంఖ్యలో బంగారు పతకాలను గెలుచుకుంది. అంతేగాక ఇప్పటిదాకా స్విమ్మింగ్‌లో అనేక జాతీయ రికార్డులను బద్దలు కొట్టి, 22 గోల్డ్ మెడల్స్‌ను సాధించింది. రెండు వందల మీటర్ల ఫ్రీస్టైల్, వంద మీటర్ల బ్యాక్ స్ట్రోక్, బటర్‌ఫ్లై స్విమ్మింగ్‌లో అనేక మెడల్స్‌ను సాధించింది. 14 కిలోమీటర్లను మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల ముప్పై సెకన్లలో ఈది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. అంతేగాక 2022 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌ను అందుకుంది. తాను సాధించిన అనేక విజయాల రికార్డులను ఆటిజంపై అవగాహన కల్పించడానికి అంకితం చేస్తోంది జియా. కనీసం మాట్లాడడం కూడా రాని జియా ఈ స్థాయికి ఎదగడానికి ఎంతో కష్టపడి సాధన చేసింది. ఉదయం నాలుగున్నర గంటలకు నిద్రలేచి ఐదు గంటల వరకు వ్యాయామం చేస్తుంది. ఎనిమిదింటి నుంచి పదింటి వరకు స్విమ్మింగ్ సాధన చేస్తుంది. తరువాత స్కూలుకు వెళ్తుంది. స్కూలు అయ్యాక సాయంత్రం నాలుగు గంటలకు మళ్లీ స్విమ్మింగ్ సాధన. ఎనిమిదో తరగతి చదువుతోన్న జియా రోజూ ఇదే దిన చర్యను పాటిస్తూ గోల్డ్ మెడల్స్‌ను సాధించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో జియా విజయాలను పొగడడం విశేషం. తాజాగా శ్రీలంకలోని తలైమన్నార్ సెటిల్మెంట్ నుంచి తమిళ నాడులోని ధనుష్కోటి వరకు ఉన్న 29 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల్లో ఈది మరో కొత్త రికార్డును నెలకొల్పింది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో ‘యంగెస్ట్ స్విమ్మర్’గా నిలిచిన జియాకు అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫిలిప్స్ రోల్ మోడల్. అతని లాగే ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. చేప పిల్ల.. కావేరీ ధీమార్.. 2017 వరకు ఈమెవరో ప్రపంచానికి తెలియదు. ఆమెలోని ప్రతిభ పాటవాలు సుదూర శిఖరాలను అధిరోహించేలా చేసి జాతీయ రికార్డుల్లో తనకంటూ స్థానం సంపాదించుకుని ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది. భోపాల్‌లోని కోస్తా జిల్లాలోని మండి గ్రామం కావేరిది. ఏడుగురు అక్కాచెల్లెళ్ళు,ఇద్దరు తమ్ముళ్ల మధ్య ఐదో అమ్మాయి కావేరి ధీమార్. జాలరుల కుటుంబం కావడంతో చేపలను వేటాడితేగానీ వారి కడుపులు నిండని పరిస్థితి. ఇది తప్ప వారికి ఆదాయం వచ్చే మరో మార్గం లేదు. కుటుంబ ఖర్చులతోపాటు తండ్రి అప్పులు కూడా పెరిగాయి. అప్పులు తీర్చడానికి తన అక్కచెల్లెళ ్లతో కలిసి కావేరి కూడా చేపల వేటకు వెళ్లేది. వేటలో ఎంతో చురుకుగా దూసుకుపోయేది కావేరి. ఈ విషయం ఆనోటా ఈ నోటా మధ్యప్రదేశ్ వాటర్ స్పోర్ట్స్’ అకాడమీకి తెలిసింది. వెంటనే కావేరీని అకాడమీలో చేర్చుకుని పడవలను నడపడడంలో శిక్షణ ఇచ్చారు. దీంతో నీళ్లమీద పడవలను పరిగెత్తిస్తూ ఇండియాలోనే టాప్ కెనోయిర్‌గా నిలిచింది. పొల్గొన్న ప్రతిపోటీలోనూ పతకాన్ని ఖాయం చేసుకొస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ కనోయింగ్ ఈవెంట్స్‌లో పాల్గొని 12 స్వర్ణపతకాలను గెలుచుకుంది. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న జరుగుతున్న ‘ఏషియన్ చాంపియన్‌షిప్స్’ లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహిస్తోంది. ప్రతిభ ఉండి కలిసొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోగల నేర్పరితనం ఉండాలేగాని పేద, గొప్ప అనే తేడా లేకుండా ఎదగవచ్చనడానికి కావేరి జీవితం ఉదాహరణగా నిలుస్తోంది. -
అధ్యయనం తర్వాతే అనుసంధానం
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: గోదావరిలో నీటి లభ్యత తేల్చాకే గోదావరి – కావేరి అనుసంధానాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)లతో అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి కావేరికి జలాలను తరలించాలని ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రతిపాదనపైనా కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీనిపై అధ్యయనం చేయిస్తామని తెలిపింది. గోదావరి– కావేరి అనుసంధానంపై శుక్రవారం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి అధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ మోహన్‌కుమార్, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి అధికారులు పాల్గొన్నారు. మిగులు జలాలపై పూర్తి హక్కు ఏపీదే ఇచ్చంపల్లి వద్ద 324 టీఎంసీల నీరు ఉందని, అందులో 247 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా మళ్లిస్తామన్న కేంద్రం ప్రతిపాదనపై ఏపీ, తెలంగాణ అభ్యంతరం తెలిపాయి. గోదావరిలో మిగులు జలాలు అంత లేవని ఏపీ స్పష్టంచేసింది. మిగులు జలాలపై పూర్తి హక్కును ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిందని గుర్తు చేసింది. తమ అవసరాలను కేంద్రం తక్కువగా అంచనా వేయడంపై అభ్యంతరం తెలిపింది. ఇచ్చంపల్లి వద్ద ఉన్న జలాలన్నీ ఇప్పటికే నిర్మాణంలో ఉన్న, నిర్మాణం చేయనున్న ప్రాజెక్టులకే సరిపోతాయని తెలంగాణ తెలిపింది. ఉభయ రాష్ట్రాల అవసరాలు పోను మిగిలి ఉన్న జలాలను మాత్రమే తరలించాలని తెలుగు రాష్ట్రాలు కోరాయి. గోదావరిలో మిగులు జలాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సూచించాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం.. సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏలతో సంయుక్తంగా అధ్యయనం చేస్తామని తెలిపింది. చదవండి: (ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం) ఛత్తీస్‌గఢ్ నుంచి 147 టీఎంసీలు గోదావరి నుంచి మళ్లిస్తామన్న 247 టీఎంసీలలో 147 టీఎంసీలు చత్తీస్‌గఢ్ నుంచి, మరో 100 టీఎంసీలు తెలంగాణ నుంచి తీసుకోవాలన్న కేంద్రం ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. తెలంగాణ పరిధిలో మిగులు జలాలు లేవని స్పష్టం చేసింది. దాంతో.. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 147 టీఎంసీలను తొలి దశలో మళ్లిద్దామని కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకు ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పించాలని సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏలకు పంకజ్‌కుమార్ చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నీటిలో ఏ రాష్ట్రాలు ఎంత వాడుకోవాలన్నది చర్చించి నిర్ణయిద్దామని జల్ శక్తి శాఖ సూచించింది. మళ్లించే జలాల్లో రాష్ట్రాలకు కేటాయించిన నీటిపై కర్ణాటక అభ్యంతరాలు తెలిపింది. గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే మళ్లింపు జలాల్లో కర్ణాటకకు వాటా ఉంటుందని చెప్పింది. కృష్ణా నుంచి కావేరికి నీటిని తరలించే 84 టీఎంసీల్లోనూ కర్ణాటకకు వాటా ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. కావేరికి మళ్లించే గోదావరి జలాల్లో కేటాయింపులు పెంచాలని తమిళనాడు కోరింది. కెన్–బెత్వా తరహాలోనే నిధులు గోదావరి–కావేరి అనుసంధానం ఖర్చులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు భరించాలన్న కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదనపై అన్ని రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి. కెన్–బెత్వా అనుసంధానానికి ఇస్తున్న తరహాలోనే 90 శాతం నిధులను కేంద్రం ఇవ్వాలని, మిగతా పది శాతం తాము భరిస్తామని అన్ని రాష్ట్రాలు తేల్చిచెప్పాయి. పోలవరం నుంచే కావేరికి గోదావరి మిగులు జలాలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా) – సోమశిల (పెన్నా) – కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కి తరలించడంపై ఏపీ అభ్యంతరం చెప్పింది. నాగార్జున సాగర్, సోమశిల రిజర్వాయర్లలోని జలాలు వాటి కింద ఆయకట్టుకే సరిపోవడంలేదని చెప్పింది. ఈ రెండు రిజర్వాయర్ల ద్వారా కావేరికి గోదావరిని తరలించడం సాధ్యం కాదని స్పష్టంచేసింది. చెన్నైకి తాగు నీటి కోసం ఎగువ రాష్ట్రాలు ఇవ్వాల్సిన నీటిని వరద సమయంలో ఇచ్చేశామని ఆ రాష్ట్రాలు చెబుతున్నాయని, దాంతో శ్రీశైలంలో ఉన్న తమ రాష్ట్రం కోటా నీటినే చెన్నైకి ఇవ్వాల్సి వస్తోందని కేంద్రానికి ఏపీ గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి జలాలను బొల్లాపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించి.. చెన్నైకి సరఫరా చేస్తున్న మార్గంలోనే కావేరికి తరలించాలని ప్రతిపాదించింది. పోలవరం దిగువ నుంచి వెళ్లే నీరంతా వృధాగా సముద్రంలోకి కలుస్తుంది కాబట్టి ఆ నీటిని మళ్లిస్తే అధిక ప్రయోజనం ఉంటుందని వివరించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం, ఈ అలైన్‌మెంట్‌పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామంది. -
నదుల అనుసంధాన వ్యయంపై కేంద్రం మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానంపై కీలక చర్యగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. నదుల అనుసంధానానికి అయ్యే వ్యయంలో 60 శాతాన్ని కేంద్రం భరిస్తుందని, మిగతా 40 శాతం నిధులను ప్రయోజనం పొందే రాష్ట్రాలు తమ వాటాగా సమకూర్చాలని పేర్కొంది. ఆయకట్టు, నీటి వినియోగం ఆధారంగా దామాషా పద్ధతిలో ఆయా రాష్ట్రాలు వాటా నిధులను అందజేయాలని సూచించింది. గతంలో నదుల అనుసంధానానికి అయ్యే వ్యయంలో 90 శాతం నిధులను అందచేస్తామని కేంద్రంప్రకటించినా తాజాగా తన వాటాను కుదించింది. కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 32 శాతాన్ని రాష్ట్రాలకు వాటాగా అందజేయాలని 13వ ఆర్థిక సంఘం ప్రతిపాదించగా 14వ ఆర్థిక సంఘం దీన్ని 42 శాతానికి పెంచింది. దీనివల్ల తమ వద్ద నిధుల లభ్యత తగ్గినందున అనుసంధానం వ్యయంలో తన వాటాలో కోత విధించినట్లు కేంద్రం సమర్థించుకుంటోంది. ఈశాన్య రాష్ట్రాలకు పాత విధానంలోనే... ► ఈశాన్య రాష్ట్రాల్లో నదుల అనుసంధానం పనులకు మాత్రం పాత విధానం ప్రకారం కేంద్రం 90 శాతం నిధులను అందచేస్తుంది. ► ఏకాభిప్రాయం వ్యక్తమైన నదుల అనుసంధానం పనులు చేపట్టేందుకు కేంద్ర జల్ శక్తి శాఖకు అనుమతి ఇచ్చింది. విదేశీ రుణాల రూపంలో నిధులు సమకూర్చేందుకు కసరత్తు చేస్తోంది. ► గోదావరి(జానంపేట, కృష్ణా (నాగార్జునసాగర్), పెన్నా(సోమశిల)కావేరీ(గ్రాండ్ ఆనకట్ట) అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తే ఆ పనులకు కొత్త విధానం (60: 40) ప్రకారం నిధులు కేటాయిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఇటీవల జరిగిన సమావేశంలో తెలిపారు. – సుప్రీం ఆదేశాలతో.. ► 2003–04 ధరల (ఎస్ఎస్ఆర్) ప్రకారం ద్వీపకల్ప నదుల అనుసంధానానికి రూ.1.85 లక్షల కోట్లు, హిమాలయ నదుల అనుసంధానానికి 3.75 లక్షల కోట్లు.. వెరసి రూ. 5.60 లక్షల కోట్లు అవసరమని కేంద్రానికి ఎన్‌డబ్ల్యూడీఏ నివేదిక ఇచ్చింది. ► దేశంలో దుర్భిక్షాన్ని రూపుమాపేందుకు నదుల అనుసంధానం చేపట్టాలని కోరుతూ 2014లో సామాజికవేత్తలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని వివరణ కోరింది. సుప్రీం ఆదేశాల మేరకు అదే ఏడాది సెప్టెంబరు 23న అనుసంధానంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఇప్పటివరకూ 17 సార్లు రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించింది. మూడు సార్లు ప్రత్యేక సమావేశాలను నిర్వహించినా అధిక శాతం రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. దుర్భిక్ష ప్రాంతాలకే తొలి ప్రాధాన్యం.. ► ప్రస్తుతం ధరలు, పునరావాస కార్యక్రమాల వ్యయం భారీగా పెరిగినందున అనుసంధానం ఖర్చు రూ.5.60 లక్షల కోట్ల నుంచి రూ.20 లక్షల కోట్లకుపైగా చేరుకునే అవకాశం ఉంటుందని కేంద్ర జల్ శక్తి శాఖ అంచనా వేస్తోంది.ఈ నేపథ్యంలో కరువు ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ► ఉత్తరాదితో పోలిస్తే తరచూ కరువు కోరల్లో చిక్కుకుంటున్న దక్షిణాది రాష్ట్రాల్లో మిగులు జలాలున్న నదీ పరివాహక ప్రాంతం నుంచి నీటి లభ్యత లేని నదులకు జలాలను తరలించేలా అనుసంధానం పనులు చేపట్టాలని నిర్ణయించింది. ► గోదావరి–కావేరి అనుసంధానం పనులపై కేంద్రం ప్రధానంగా దృష్టిసారించింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుల్లో దుర్భిక్ష పరిస్థితులను కొంతవరకూ అధిగమించవచ్చని భావిస్తోంది. -
అనుసంధానం ఏకపక్షం!
చర్చించకుండానే ‘నదుల’పై ముందుకు వెళ్తున్న ఎన్‌డబ్ల్యూడీఏ సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియలో జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. అనుసంధాన ప్రక్రియపై ఎలాంటి నిర్ణయాలు చేసినా, కొత్త ప్రతిపాదనలు తెచ్చినా ముందుగా రాష్ట్రంతో సంప్రదింపులు చేయాలని కోరుతున్నా పట్టనట్లే వ్యవహరిస్తోంది. ఇప్పటికే ప్రతిపాదించిన అకినేపల్లి విషయంలో అభిప్రాయాలు తీసుకోని ఎన్‌డబ్ల్యూడీఏ, తాజాగా జనంపేట్ నుంచి నీటిని తరలించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి ఎలాంటి సంప్రదింపులు, చర్చలు లేకుండానే టెండర్లు పిలవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పిస్తోంది. పలుమార్లు అభ్యంతరాలు... ఒడిశాలోని మహానది మొదలు తెలంగాణ, ఏపీలోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ, తమిళనాడు, కర్ణాటకలోని కావేరి వరకు నదుల అనుసంధానాన్ని చేపట్టిన కేంద్రం, ఇప్పటికే దానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మహానదిలో 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలున్న దృష్ట్యా, ఇందులో 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరికి తరలించాలని ప్రతిపాదించింది. అయితే దీనిపై తెలంగాణ పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గోదావరిలో తెలంగాణకు హక్కుగా 954 టీఎంసీల కేటాయింపు ఉందని, అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఆ మేరకు నీటిని వాడుకునే అవకాశం దక్కలేదని తెలిపింది. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు సైతం చేపట్టడంతో ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తెలంగాణకు 1,600 టీఎంసీలు కావాల్సి ఉందని తెలిపింది. ఈ నీటి వినియోగానికి వీలుగా కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, ఎల్లంపల్లి, ప్రాణహిత, దేవాదుల ఎత్తిపోతల వంటి పథకాలు చేపట్టామని వెల్లడించింది. ఈ పథకాలకు అవసరమయ్యే నీటిని పక్కనపెట్టి, అంతకుమించి నీటి లభ్యత ఉంటే దానిని నదుల అనుసంధానం ప్రక్రియకు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. జాతీయ ప్రయోజనాల కోసం తెలంగాణ సహకరిస్తుందని, అయితే రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం అందుకు పణంగా పెట్టలేమని చెప్పింది. 110 యేళ్ల సరాసరి సరికాదు... అలాగే గోదావరిపై అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి నీటిని మళ్లించాలన్న కేంద్రం ప్రతిపాదనతో దాదాపు 45 గ్రామాలు, 48వేల ఎకరాలు ముంపునకు గురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సీఎస్ ఎస్కే జోషి సైతం ఇటీవల ఎన్‌డబ్ల్యూడీఏకు లేఖ రాశారు. కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టుల అనుమతికి సంబంధించి నీటి లభ్యత అంశంలో 40 సంవత్సరాల సరాసరి ప్రాతిపదికగా తీసుకున్న కేంద్ర జల సంఘం, నదుల అనుసంధానం ప్రతిపాదనలో మాత్రం 110 సంవత్సరాల సరాసరి తీసుకోవడం సరికాదని చెప్పారు. అనుసంధానంపై రాష్ట్రాలతో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సైతం కోరారు. రాష్ట్ర అభ్యంతరాల నేపథ్యంలో ఎన్‌డబ్ల్యూడీఏ కొత్తగా ఖమ్మం జిల్లాలోని జనంపేట్ నుంచి గోదావరి నీటిని మళ్లించడానికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకు అవసరమైన డీపీఆర్ తయారు చేయడానికి టెండర్లు పిలిచింది. ఇప్పటికే మిగులు జలాలు లేవని స్పష్టంగా చెబుతున్నా, మళ్లీ ఎన్‌డబ్లు్యడీఏ ఏకపక్షంగా ముందుకెళుతోంది. నీటిని తీసుకెళ్లే మార్గాల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, రాష్ట్రంతో సంప్రదింపులు జరపకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తూ ఇటీవలే మరోమారు ఎన్‌డబ్ల్యూడీఏకు లేఖ రాసింది. రాష్ట్రాలతో సంప్రదింపులు కొనసాగించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు చేస్తే ప్రతిపాదనలకు తుది రూపం ఇవ్వలేరని స్పష్టం చేసింది. తాజా లేఖ నేపథ్యంలో అయినా ఎన్‌డబ్ల్యూడీఏ స్పందిస్తుందా? లేక యథావిధిగా తనపని తాను చేసుకుపోతుందా వేచి చూడాలి. -
‘గోదావరి–కావేరి’ అనుసంధానించండి
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో నదుల అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేసేలా కేం ద్రంపై తమిళనాడు ఒత్తిడి పెంచుతోంది. లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీటితోపాటు పరీవాహక ప్రాంతాల వారికి తాగునీరు, పరిశ్రమల నీటి అవ స రాలను తీర్చేలా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) రూపొందించిన ప్రణాళికల ను అమల్లోకి తేవాలంటోంది. ఇందులో భాగంగా గోదావరి, కావేరి నదులను అనుసంధానించాలని కేంద్రాన్ని పట్టుబడుతోంది. దీనిపై ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీలకు ఏఐడీఎంకే ఎంపీ ఆర్.గోపాల్‌కృష్ణన్ లేఖ రాశారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానం అంశాన్ని ఎంఐడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కారణంగా దీనిపై వచ్చే పార్లమెంట్ ఎన్నికలనాటికి ఓ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ద్వీపకల్ప నదుల పథకంలో భాగంగానే.. కేంద్రం ద్వీపకల్ప నదుల పథకంలో భాగంగా ఒడిశా లోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ని గోదావరి, కృష్ణా, తమిళనాడు, కర్ణాటకలోని కావేరి వరకు ఈ నదుల అనుసంధానాన్ని చేపట్టింది. అదనపు నీటిలభ్యత ఉన్న నదుల నుంచి ఇతర నదులకు నీటిని తరలించాలని నిర్ణయించింది. మహానదిలో 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలున్నట్లుగా అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో 247 టీఎంసీల నీటిని కృష్ణా, కావేరిలకు తరలించాలన్నది కేంద్ర ప్రయత్నం. గోదావరి నుంచి కృష్ణాకు 247 టీఎంసీలు తరలిస్తే, అటు నుంచి పెన్నాకు 143 టీఎంసీలు, పెన్నా నుంచి కావేరికి 88.83 టీఎంసీలు తరలించేలా కేం ద్రం ప్రణాళిక రూపొందించింది. అయితే, ఈ ప్రణాళికపై తెలంగాణసహా అనేక రాష్ట్రాలు అభ్యంతరాలు లేవనెత్తుతుండటంతో మరోమారు కేంద్రం అధ్యయనం చేయిస్తోంది. పొరుగు రాష్ట్రాలపై ఆధారపడుతున్నాం.. తక్కువ వర్షపాతం కల్గిన రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటని, దీంతో నీటి కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోందని తమిళనాడు చెబుతోంది. గతం లో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం గోదావరి నుంచి కావేరికి 175 టీఎంసీల నీటిని తరలించాలని కోరు తోంది. ఆవిరి నష్టాలు 17.50 టీఎంసీలు, దారి పొడువునా చెరువులు నింపేందుకు మరో 57.50 టీఎంసీలు అవసరమవుతాయిని తమిళనాడు చెబుతోంది. ఇక 100 టీఎంసీలతో 4.01 లక్షల హెక్టార్లకు నీరందే అవకాశం ఉందని ఎంపీ గోపాల్‌కృష్ణన్ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ అను సంధానంతో వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమల ద్వారా ఏటా రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. గోదావరి నుంచి కావేరికి నీటిని తరలించే విషయంలో ఉన్న ఆటంకాలు, అభ్యంతరాలు తెలపాలని కేంద్రం కోరగా, దీనిపై తెలంగాణ తన వివరణను సిద్ధం చేసే పనిలో పడింది. దక్షిణాది నదుల అనుసంధానంతో రాష్ట్రానికి పెద్దగా ఉపయోగం లేదని, ముంపు సమస్య ఎక్కువగా ఉంటుందని తెలిపింది ఇదివరకే కేంద్రానికి తన అభిప్రాయాన్ని తెలిపింది. ఇదే విషయాన్ని మరోమారు తెలిపే అవకాశం ఉంది. -
భారీ వర్షాలు: పర్యాటక ప్రాంతాల మూసివేత
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఎగువ ప్రాంతల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దిగువన ఉన్న తమిళనాడు కావేరి నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రమాదస్థాయిలో వరద నీరు పోటెత్తుతోంది. కృష్ణరాయసాగర్ ఆనకట్ట నుంచి భారీగా వరద నీరు కిందకు వదలడంతో తమిళనాడులోని కావేరి పరివాహక ప్రాంతాల్లో ప్రమాదస్థితి నెలకొంది. ప్రధానంగా ధర్మపురి జిల్లాలోని హొగెనేకల్ జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. ఎక్కడా లేని విధంగా హొగెనేకల్‌కు నిమిషానికి పదివేల ఘనపుటడుగుల నీరు చేరుతోంది. దీంతో తమిళనాడులోని దిగువ ప్రాంతాలకు వరదనీరు వెళుతుండటంతో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. కావేరి పరివాహక ప్రాంతాల్లోని దాదాపు ఆరు జిల్లాల ప్రజలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం హొగెనికల్ లోని పర్యాటక ప్రాంతాలన్నీ మూసివేసి పోలీసుల భద్రతను ఏర్పాటు చేసింది. ఎవరూ కావేరి పరివాహక ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరికలు, నిషేదాజ్ఞలు జారీ చేసింది. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. -
‘అనుసంధానం’పై కొత్త ఆలోచన!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారత నదుల అనుసంధానంపై మరో కొత్త ఆలోచన తెరపైకి వస్తోంది. గోదావరి నుంచి మిగులు జలాలను కావేరికి తరలించే అంశంలో తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలో.. గోదావరిలో వినియోగంలో లేని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర వాటా నీటిని కావేరికి తరలించాలని కేంద్రం యోచిస్తోంది. గోదావరిలో ఛత్తీస్‌గఢ్‌కు 350 టీఎంసీల మేర వాటా ఉండగా.. అందులో 250 టీఎంసీల వరకు కావేరి గ్రాండ్‌కు తరలించినా అనుసంధాన ప్రక్రియ విజయవంతం అవుతుందనే భావిస్తోంది. ఇటీవల జరిగిన జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో దీనిపై సమాలోచనలు జరిగినట్టు తెలిసింది. తొలి ప్రతిపాదనపై తెలంగాణ వ్యతిరేకత ఒడిశాలో మణిభద్ర ప్రాజెక్టును, తెలంగాణ, ఏపీల మధ్య ఇచ్చంపల్లి ప్రాజెక్టును నిర్మించలేని పరిస్థితిలో గోదావరి–కావేరి అనుసంధానం ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి పెట్టింది. తొలుత అకినేపల్లి వద్ద బ్యారేజీ ప్రతిపాదన తెచ్చింది. ఇచ్చంపల్లికి 74 కిలోమీటర్ల దిగువన ఇంద్రావతి ఉపనది గోదావరిలో కలిశాక అకినేపల్లి వద్ద సుమారు 716 టీఎంసీల లభ్యత జలాలు ఉంటాయని లెక్కించింది. అందులో తెలంగాణ, ఏపీలు వినియోగించుకోగా 324 టీఎంసీల మేర మిగులు జలాలు ఉంటాయని.. దీనిలోంచి 247 టీఎంసీలను అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి నాగార్జునసాగర్‌కు తరలించాలని కేంద్రం ప్రణాళిక వేసింది. ఈ 247 టీఎంసీలలో తెలంగాణ వాటా మిగులు 170 టీఎంసీలుకాగా.. ఛత్తీస్‌గఢ్ వాటా 77 టీఎంసీలు. ఈ అనుసంధానం ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు 247 టీఎంసీలు తరలించి... దాని నుంచి పెన్నాకు 143 టీఎంసీలు, పెన్నా నుంచి కావేరికి 88.83 టీఎంసీలు తరలించాలని భావించింది. కానీ ఆ ప్రతిపాదనపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహానది నుంచి గోదావరికి మిగులు జలాలు తెచ్చాకే కావేరి అనుసంధానం చేపట్టాలని కోరింది. గత నెలలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కృష్ణాలో ఇప్పటికే నీటి కొరత ఏర్పడిందని, ప్రాజెక్టుల్లో నీటి కొరతను అధిగమించడానికి గోదావరిపైనే ఆధారపడే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ నీటిపై దృష్టి.. గోదావరి లభ్యత జలాలపై పూర్తిస్థాయి స్టడీ చేసి నీటి లెక్కలు తేల్చడం, ఆ ప్రక్రియ పూర్తయినా బేసిన్ రాష్ట్రాలు ఒప్పుకొనే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఛత్తీస్‌గఢ్ వాటా నీటిపై కేంద్రం దృష్టి సారించింది. ఛత్తీస్‌గఢ్‌కు ఉన్న 350 టీఎంసీల వాటాలో ఇప్పటికే 77 టీఎంసీలను అనుసంధాన ప్రతిపాదనలో చేర్చగా.. వినియోగంలో లేని మరో 170 టీఎంసీలు కలిపి 250 టీఎంసీల మేర కావేరికి తరలించాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ కొత్త ఆలోచన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, ఛత్తీస్‌గఢ్ స్పందించే తీరును బట్టి ప్రతిపాదనల అమల్లోకి వస్తుందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. -
కర్ణాటకకు మరో 14.75 టీఎంసీలు
న్యూఢిల్లీ/చెన్నై/బెంగళూరు: తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న కావేరీ నదీ జలాల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. 2007లో కావేరీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (సీడబ్ల్యూడీటీ) కేటాయించిన నీటి వాటాల్లో మార్పులు చేస్తూ కర్ణాటకకు మరో 14.75 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశమిచ్చింది. అంతే పరిమాణంలో తమిళనాడుకు కోత విధించింది. కేటాయింపుల్లో తాగు నీటికే తొలి ప్రాధాన్యత అని సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ తేల్చింది. బెంగళూరుకు ఉన్న ‘ప్రపంచ స్థాయి నగరం’ హోదాను దృష్టిలో పెట్టుకుని తాజా కేటాయింపులు చేస్తున్నామంది. 14.75 టీఎంసీల్లో బెంగళూరు నగర అవసరాలకోసం 4.75 టీఎంసీల నీటిని కేటాయించింది. ఈ తీర్పుతో ఇరు రాష్ట్రాల సరిహద్దులోని బిలిగుండ్లు నుంచి తమిళనాడుకు కర్ణాటక 177.25 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. ‘బెంగళూరు విస్తీర్ణంలో మూడింట ఒక వంతు మాత్రమే కావేరీ నదీ పరీవాహక ప్రాంతంలో ఉండటంతోపాటు అక్కడ 50 శాతం తాగునీటి అవసరాలు భూగర్భజలాల ద్వారానే తీరుతాయనే ఊహాజనిత కారణాలతో ట్రిబ్యునల్ కర్ణాటకకు కేటాయింపులను తగ్గించింది’ అని ధర్మాసనం తీర్పు చెప్పింది. జాతీయ ఆస్తి.. రాష్ట్రాల సొత్తు కాదు అంతర్జాతీయ నదీ జలాల సమాన పంపకాలకు సంబంధించిన హెల్సింకి, కాంపియన్, బెర్లిన్ నిబంధనలను తాజా తీర్పులో ఉటంకించిన కోర్టు.. నదులు జాతీయ ఆస్తులనీ, ఏ రాష్ట్రం కూడా ఒక నది పూర్తిగా తనకే చెందుతుందని చెప్పుకోజాలదని స్పష్టం చేసింది. ప్రకృతి వరప్రసాదాలైన నదీ జలాలను బాధ్యతాయుతంగా వాడుకునే హక్కు ఆ నది పారుతున్న ప్రతి రాష్ట్రానికీ ఉంటుందని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 363 ప్రకారం ఈ కేసును సుప్రీంకోర్టు విచారించకూడదన్న కేంద్రం వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కావేరీ జలాల వివాదం విషయమై 2016లో కర్ణాటక, తమిళనాడుల్లో ఘర్షణలు జరిగాయి. తమిళనాడుకు 404.25, కర్ణాటకకు 284.75 సీడబ్ల్యూడీటీ 2007లో తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలకు వరుసగా 419, 270, 30, 7 టీఎంసీల నీటిని కేటాయించింది. తాజా తీర్పుతో తమిళనాడుకు 404.25, కర్ణాటకకు 284.75 టీఎంసీల నీళ్లు దక్కనున్నాయి. కేరళ, పుదుచ్చేరిల కేటాయింపుల్లో మాత్రం సుప్రీంకోర్టు ఎలాంటి మార్పులూ చేయలేదు. అలాగే నదీ పరీవాహక ప్రాంతం నుంచి 10 టీఎంసీల భూగర్భ జలాలను తోడుకునేందుకు తమిళనాడుకు అనుమతినిచ్చింది. తీర్పును అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించేందుకు కేంద్రానికి ధర్మాసనం ఆరు వారాల గడువిచ్చింది. 15 ఏళ్ల వరకు ఈ కేటాయింపులు అమలవుతాయని ధర్మాసనం తెలిపింది. తమిళనాడులో ఆందోళనలు తీర్పు కర్ణాటకకు అనుకూలంగా ఉండటంతో తమిళనాడులో నిరసనలు, ఆందోళనలు మొదలయ్యాయి. అవాంఛిత ఘటనలను నివారించేందుకు ప్రభుత్వం ముందుజాగ్రత్తగా పలుచోట్ల పోలీసులు, భద్రతా దళాలను మోహరించింది. ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ సుప్రీంకోర్టు కేటాయించిన 177.25 టీఎంసీల నీటిని తీసుకొచ్చేందుకు అంకితభావంతో కృషిచేస్తామన్నారు. తమిళనాడు ప్రభుత్వం అసమర్థతతో కోర్టులో సరైన ఆధారాలు సమర్పించకపోవడం వల్లే తీర్పు కర్ణాటకకు అనుకూలంగా వచ్చిందని ప్రతిపక్ష డీఎంకే పార్టీ ఆరోపించింది. తీర్పు తనకు చాలా అసంతృప్తిని కలిగించిందని నటుడు రజనీకాంత్ అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలూ గొడవలకు దిగకుండా సామరస్యంగా మెలగాలని నటుడు కమల్ హాసన్ సూచించారు. తమ వాదనలకు అనుగుణంగా తీర్పు లేకపోయినప్పటికీ రాష్ట్రానికి కొంత ఊరట లభించిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. 1881 నుంచి వివాదం ► 1881వ సంవత్సరంలో కావేరీ నదిపై డ్యామ్ నిర్మించాలన్న అప్పటి మైసూర్ సంస్థానం ప్రయత్నాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ అడ్డుకోవటంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. ఆ తర్వాత నదీ జలాల పంపిణీపై రెండు ప్రభుత్వాలు 1892, 1924వ సంవత్సరాల్లో వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకోవటంతో వివాదం పరిష్కారమయింది. ఈ ఒప్పందాల కాల పరిమితి 1974లో ముగిసింది. ► 1990 – తమిళనాడు కోరిక మేరకు కేంద్రం కావేరీ జల వివాద ట్రిబ్యునల్(సీడబ్ల్యూడీటీ)ను ఏర్పాటు చేసింది. ► 1991 – అత్యవసర సాయంగా కొంతనీరు విడుదల చేయాలన్న తమిళనాడు వినతిని సీడబ్ల్యూడీటీ తిరస్కరించింది. దీంతో తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం సూచనల మేరకు.. తమిళనాడుకు 205 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సీడబ్ల్యూడీటీ కోరగా కర్ణాటక పట్టించుకోలేదు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా కర్ణాటక దిగిరాలేదు. ఈ పరిణామంతో కేంద్రం సీడబ్ల్యూడీటీ మధ్యంతర ఉత్తర్వులను గెజిట్‌లో ప్రచురించింది. ► 1998 – సీడబ్ల్యూడీటీ మధ్యంతర ఉత్తర్వులను అమలు పరిచేందుకు ప్రత్యేకంగా కేంద్రం కావేరి నదీ ప్రాధికార సంస్థ(సీఆర్ఏ)ను ఏర్పాటు చేసింది. ► 2007 – ఏర్పాటైన 17 ఏళ్ల తర్వాత కావేరి జలాల పంపిణీ తుది అవార్డును సీడబ్ల్యూడీటీ ప్రకటించింది. నదీ జలాల పంపిణీపై 1892, 1924 సంవత్సరాల్లో కుదిరిన ఒప్పందాల అమలే సరైన పరిష్కారమని అందులో పేర్కొంది. ► 2013 – కావేరి యాజమాన్య బోర్డు(సీఎంబీ) ఏర్పాటు చేయాలని తమిళనాడు కోరడంతో ఆ మేరకు కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ► 2013 మే 28 – సీడబ్ల్యూడీటీ ఆదేశాలను అమలు చేయనందుకు తనకు కలిగిన రూ.2,480 కోట్ల నష్టాన్ని కర్ణాటక చెల్లించాలంటూ తమిళనాడు సుప్రీంకు వెళ్లింది. ► 2013 – నీటి విడుదలపై సీడబ్ల్యూడీటీ ఆదేశాలను అమలు చేయాలన్న తమిళనాడు డిమాండ్ సహేతుకం కాదని కావేరీ పర్యవేక్షక కమిటీ పేర్కొంది. ► 2016 సెప్టెంబర్ 11 – కావేరి నీటి విడుదలపై ఉత్తర్వులను సవరించాలని కర్ణాటక వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ చెన్నైలో ఆందోళన చేస్తున్న నిరసనకారులు. చెన్నైలో కర్ణాటక బస్సుకు రక్షణగా వెళ్తున్న పోలీసులు -
కావేరి జలవివాదంపై నేడు సుప్రీంలో విచారణ
-
సిన్సియర్ ప్రేమ
‘‘శీనుగాడి ప్రేమ’ సినిమా పాటలు, టీజర్ బాగున్నాయి. నటీనటులు కొత్తవారైనా అనుభవం ఉన్నవారిలా నటించారు. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఆర్.కేని దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీనివాసరావు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘శీనుగాడి ప్రేమ’. ‘సిన్సియర్ రా మామా’ అన్నది ట్యాగ్ లైన్. ప్రణవి, కావేరి, చాందిని కథానాయికలు. రమణ సాకే స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. నేను డైలాగ్స్ చెప్పే విధానం చూసిన డైరెక్టర్ హీరోగా నటించమన్నారు. కథ కూడా బాగుండటంతో నటించి, నేనే నిర్మించాను’’ అన్నారు. ‘‘శీను పేరున్న వారికి కనెక్టయ్యే కథాంశంతో ఈ సినిమా చేశాం. లవ్, కామెడీ, ఎమోషన్.. ఇలా ఆడియన్స్‌కు కావాల్సిన అన్ని అంశాలుంటాయి’’ అన్నారు ఆర్.కె.