సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఎగువ ప్రాంతల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దిగువన ఉన్న తమిళనాడు కావేరి నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రమాదస్థాయిలో వరద నీరు పోటెత్తుతోంది. కృష్ణరాయసాగర్ ఆనకట్ట నుంచి భారీగా వరద నీరు కిందకు వదలడంతో తమిళనాడులోని కావేరి పరివాహక ప్రాంతాల్లో ప్రమాదస్థితి నెలకొంది.
ప్రధానంగా ధర్మపురి జిల్లాలోని హొగెనేకల్ జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. ఎక్కడా లేని విధంగా హొగెనేకల్‌కు నిమిషానికి పదివేల ఘనపుటడుగుల నీరు చేరుతోంది. దీంతో తమిళనాడులోని దిగువ ప్రాంతాలకు వరదనీరు వెళుతుండటంతో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది.
కావేరి పరివాహక ప్రాంతాల్లోని దాదాపు ఆరు జిల్లాల ప్రజలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం హొగెనికల్ లోని పర్యాటక ప్రాంతాలన్నీ మూసివేసి పోలీసుల భద్రతను ఏర్పాటు చేసింది. ఎవరూ కావేరి పరివాహక ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరికలు, నిషేదాజ్ఞలు జారీ చేసింది. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment