Bengaluru sees another spell of heavy rain and hailstorm in many areas - Sakshi
Sakshi News home page

బెంగళూరులో భారీ వర్షం.. వరద నీటిలో చిక్కుకున్న కారు

Published Sun, May 21 2023 5:37 PM | Last Updated on Sun, May 21 2023 6:58 PM

Bengaluru Sees Another Spell Of Heavy Rain - Sakshi

బెంగళూరు: నగరంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా కేఆర్‌ సర్కిల్‌ అండర్‌ పాస్‌ నీటితో నిండిపోయింది. ఇందులో ఏపీకి చెందిన కృష్ణా జిల్లా కారు ఒకటి చిక్కుకుపోయింది. కారులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉండగా వారిని సహాయక సిబ్బంది రక్షించింది. కారు పూర్తిగా నీటిలో మునిగిపోయిన క్రమంలో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని సెయింట్‌ మార్తాస్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా,  పరిస్థితి విషమించడంతో భానురేఖ అనే మహిళ మృతిచెందింది. ఈమెది కృష్ణాజిల్లాలోని తేలప్రోలు.

కబ్బన్‌ పార్క్‌ చూసేందుకు కృష్ణా జిల్లాకు చెందిన ఒక కుటుంబం కారులో వచ్చింది. ఈ క్రమంలోనే కేఆర్‌ సర్కిల్‌ అండర్‌ పాస్‌ వద్ద కారు నీటిలో చిక్కుకుపోగా, దానిపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది కారును ఎట్టకేలకు బయటకు తీశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement