రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గతంలో నిర్దేశించిన పరిమాణంలో కావేరి జలాలను ఇవ్వలేమంటూ ...
బెంగళూరు : రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గతంలో నిర్దేశించిన పరిమాణంలో కావేరి జలాలను ఇవ్వలేమంటూ తమిళనాడు ప్రభుత్వానిక రాష్ట్ర ప్రభుత్వం సోమవారం లేఖ రాసింది. కావేరి జలాల పంపకానికి సంబంధించి ఈ ఏడాది 198 టీఎంసీల నీటిని తమిళనాడుకు వదలాల్సి ఉంది.
ఈ నీరు విడుదలలో కర్ణాటక ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ కేంద్రానికి తమిళనాడు ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం గమనార్హం. ఈ నెల 4 వరకు 68 టీఎంసీల నీరు విడుదల చేసినట్లు వర్షాలు పడని కారణంగా ఇకపై నీటిని వదలడం కుదరదంటూ స్పష్టం చేసింది.