నీటి సంపులో పడి చిన్నారి
Published Fri, Jan 13 2017 3:41 PM | Last Updated on Fri, Oct 19 2018 7:59 PM
దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండలో విషాద సంఘటన వెలుగు చూసింది. పండుగకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ చిన్నారి నీటి సంపులో పడి మృతిచెందాడు. చండూరుకు చెందిన యాదయ్య, యాదమ్మ దంపతులు సంక్రాంతి పండుగకు దేవరకొండ హనుమాన్‌నగర్‌లోని అత్తగారింటికి వెళ్లారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులంత పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో యాదయ్య యాదమ్మ దంపతుల రెండున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీటిసంపులో పడ్డాడు. ఎవరు గుర్తించకపోవడంతో నీట మునిగి మృతిచెందాడు. దీంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Advertisement