సంపులో పడి చిన్నారి మృతి | child died in water well | Sakshi
Sakshi News home page

సంపులో పడి చిన్నారి మృతి

Published Sun, Oct 20 2013 12:44 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

child died in water well

 ఘట్‌కేసర్,న్యూస్‌లైన్: రెండు రోజుల్లో గృహ ప్రవేశానికి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలోని వారి కూతురు సంపులో పడి దుర్మరణం చెందింది. ఈ విషాదకర సంఘటన శనివారం రాత్రి మండల పరిధిలోని అన్నోజిగూడ లక్ష్మీనరసింహ కాలనీలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలోనిగువ్వల మురళీ, లత దంపతులు ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరికి కూతురు రమ్య (4) ఉంది. దంపతులు ఇటీవలే అదే కాలనీలో ఓ ఇల్లు కొనుగోలు చేశారు.
 
 రెండు రోజుల్లో గృహ ప్రవేశం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రం ఇంటికి రంగులు వేసే పనుల్లో కుటుంబీకులు నిమగ్నమయ్యారు. అనంతరం చిన్నారి రమ్య కోసం గాలించినా ఆమె జాడ కనిపించలేదు. చివరగా ఇంటి ఆవరణలో ఉన్న సంపులో చూడగా రమ్య మృతదేహం తేలియాడుతూ కనిపించింది. బాలిక మృతితో తల్లిదండ్రులు గుండెలుబాదుకుంటూ రోదించసాగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీయించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement