water well
-
4 గంటలు మట్టిలో ఇరుక్కుని
శాయంపేట: మంచినీటి బావి ఓడలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటి స్థానంలో కొత్తవి పోసేందుకు ఓ యువకుడు మట్టిని తీస్తుండగా ఒక్కసారిగా కుంగిపోయి లోతుకు జారిపోయాడు. పోలీసులు నాలుగు గంటలపాటు శ్రమించి ఆ యువకుడిని క్షేమంగా బయటకు తీశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోతుగంటి వెంకటేష్ తన ఇంటి ముందు ఉన్న మంచినీటి బావి ఓడలను మార్చి కొత్తవి వేసేందుకు మట్టిని తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా మట్టి కుంగిపోవడంతో సుమారు ఏడు ఓడల లోతు జారిపోయాడు. గమనించిన అతని భార్య పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే 100కు డయల్ చేయడంతో ఎస్ఐ అక్కినపల్లి ప్రవీణ్‌కుమార్ ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే రెండు జేసీబీలు తెప్పించి మట్టి, ఓడలను తొలగిస్తూ పోయారు. సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి యువ కుడిని బయటకు తీశారు. వెంకటేష్‌ను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్న దృశ్యం ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే వెంకటేష్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. సర్పంచ్ రాజిరెడ్డి, ఉపసర్పంచ్ వలి హైదర్, ఎంపీటీసీ ఐలయ్యలతోపాటు పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
60 కుటుంబాలు.. ఒక జలదేవత
గొడ్డలి నీటిలో పారవేసుకుంటే జలదేవత ప్రత్యక్షమవడం మనకు తెలుసు. కాని ఇక్కడ నీళ్లు లేవు. పారవేసుకోవడానికి పెన్నిధీ లేదు. ఆకలి బతుకుల గిరిజన జీవితం తప్ప. ఒరిస్సా అడవిలో అరవై కుటుంబాలు. ఎవరికి పడతాయి. తాగడానికి నీళ్లు లేక గొంతెండిపోతున్నాయి. అప్పుడు మాలతి సిసా వచ్చింది. ఏకంగా నీరు తగిలేంత లోతు బావి తవ్వింది. ‘వాటర్ గర్ల్’ అని మీడియా అంటోంది. జలదేవతే సరైన పదం. ఇది అచ్చు సినిమాల్లో జరిగినట్టే జరిగింది. 25 ఏళ్ల మాలతి భువనేశ్వర్‌లోని కళింగ యూనివర్సిటీలో ఎం.ఏ ఎకనామిక్స్ చేసి మల్కన్‌గిరి జిల్లాలోని తన గ్రామం బోండాఘాటీకి చేరుకుంది రెండు నెలల క్రితం. బోండాఘాటి అడవి ప్రాంతం. అక్కడ బోండులు అనే గిరిజన తెగ జీవిస్తూ ఉందని 1950 వరకూ భారత ప్రభుత్వం గుర్తించలేదు. గుర్తించాక కూడా వారి కోసం జరిగింది తక్కువ. ఇంకా చెప్పాలంటే మాలతి ఆ ఊరి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి అమ్మాయి. అంటే ఇన్నేళ్లు అక్కడ వారి అభివృద్ధికి ఏ మేరకు పని జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సరే, అభివృద్ధి పెద్దమాట. తాగడానికి నీళ్లు ప్రాణాధారం కదా. చిన్నప్పటి నుంచి చూస్తున్నట్టే ఇప్పుడూ తన కుటుంబం నీళ్ల కోసం అవస్థ పడటం మాలతి గమనించింది. ఊళ్లో ఉండే బోరింగులు పాడయ్యాయి. కుళాయిలు పని చేయవు. నీళ్లు కావాలంటే తల్లి, తన ముగ్గురు చెల్లెళ్లు కిలోమీటరు మేర బిందెలు తల మీద పెట్టుకుని బయలుదేరాల్సిందే. ఇంతకు ముందు ఇదంతా మామూలు మాలతికి. కాని ఇప్పుడు తను చదువుకుంది. తనకు జరుగుతున్న అన్యాయం ఏమిటో... తమ వారి పరిస్థితులు ఏమిటో... బయట లోకం ఎలా ఉందో చూసింది. ఈ కష్టాలు మనమే తీర్చుకోవచ్చు అని తల్లిదండ్రులకు చెప్పింది. ‘మనమే బావి తవ్వుదాం’ అంది. ఇలా ఊళ్లో ఎవరూ ముందుకు వచ్చిన దాఖలా లేదు. మాలతి తండ్రి ధబులు, తల్లి సమరి కూతురికి సపోర్ట్ చేయాలనుకున్నారు. మాలతి ముగ్గురు చెల్లెళ్లు సుక్రి, లిలీ, రంజిత... ‘అక్కా... మేము నీకు సాయం పడతాం’ అన్నారు. ‘ఈ బావి మన కోసం మాత్రమే కాదు... ఊళ్లో ఉన్న 60 కుటుంబాల కోసం’ అంది మాలతి. వెంటనే బావి తవ్వే పని మొదలైంది. మాలతి, ఆమె ముగ్గురు చెల్లెళ్లు పలుగూ పారా తీసుకుని నాలుగైదు అడుగుల వెడల్పు ఉన్న చుట్టు బావి తవ్వడం మొదలెట్టారు. తలా కొంచెం తవ్వి పోస్తున్నారు. 14 అడుగుల లోతుకు వెళ్లాక నీళ్లు పడ్డాయి. కాని సహజంగానే అవి బురద నీరు. ఆ నీటిని తోడి పోస్తూ మరి కాస్త లోతుకు వెళితే తేట నీరు వస్తాయి. ‘నా దగ్గర డబ్బు లేదు. అయినా నీ కోసం ప్రయత్నిస్తా’ అని తండ్రి అటు తిరిగి ఇటు తిరిగి 7 వేలు తెచ్చి మాలతికి ఇచ్చాడు. మాలతి దాంతో మోటరు కొని బురద నీళ్లు బయటకు తోలించింది. మళ్లీ బావి తవ్వింది. ఇప్పుడు తేట నీళ్లు వచ్చాయి. తియ్యటి నీళ్లు. దాహం తీర్చే నీళ్లు. ఊళ్లోని అందరూ వచ్చి ఈ నీళ్లు చూసి మాలతిని పట్టుకుని మెటికలు విరిచారు. ‘మా తల్లే మా తల్లే’ అన్నారు. మాలతిని చూసి ఇంకో రెండు మూడు యువ బృందాలు మరో రెండు మూడు బావులు తవ్వుతున్నాయి. అవి పూర్తవుతున్నాయి కూడా. ఈ సంగతి తెలిసిన మీడియా మాలతి మీద కథనాలు రాసి ఆమెను ‘వాటర్ గర్ల్’గా వ్యాఖ్యానించాయి. అధికారులు కదిలారు. ‘మీ బావి ఖర్చు, కూలి ఖర్చు ఇస్తాం’ అంటున్నారు. ‘వాటి సంగతి తర్వాత నా బావికి సిమెంటు రింగులు లేవు అవి వేయించండి’ అంటోంది మాలతి. మాలతి తల్లిదండ్రులు చాలా సంతోషిస్తున్నారు. ‘మా అమ్మాయి గొప్ప పని చేసింది’ అంటున్నారు. మాలతి ఇంతటితో ఆగాలని అనుకోవడం లేదు. గూడెంలో పిల్లలకు చదువు చెప్పాలని అనుకుంటోంది. అందరి కోసం పని చేయాలని అనుకుంటోంది. అంతా కలిసి 25 వేల జనాభా కూడా ఉండదు బోండులది. అరుదైన తెగ అది. దానిని కాపాడుకుని సంతోషంగా ఉండేలా చూడటం కూడా చేయడం లేదు ప్రభుత్వాలు. వారి కళ్లు తెరుచుకోవాలంటే ఇంటికో మాలతి అవసరమే. -
బావిలో శిశువు.. స్పందించిన స్థానికులు
అనంతపురం: ఇంకా తెల్లవారలేదు... చిన్నారి శిశువు గుక్కపట్టి ఏడుస్తుంది. మన ఇంట్లో కాదులే అని అనుకున్నారంతా... కానీ ఎంత సేపటికి శిశువు ఏడుపు ఆపడం లేదు. దాంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూశారు. ఎక్కడ ఎవరు కనిపించలేదు. దాంతో ఏడుపు ఎక్కడ నుంచి వస్తుందంటూ పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. బావిలో నుంచి అని గుర్తించిన స్థానికులు. ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే బావిలోకి దిగి గోనె సంచిని వెలికి తీశారు. అందులోని శిశువును బయటకు తీశారు. శిశువు శరీరం మొత్తం రక్తంతో నిండి ఉండటం.. ఇంకా బొడ్డు కూడా తెగకపోవడంతో శిశువును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. -
మీకు తెలుసా..?
బ్రిటీష్ వారు 124 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన బావి నేటికీ ప్రజల దాహార్తి తీరుస్తోంది. గని కార్మికుల కోసం 1890 సంవత్సరంలో బ్రిటీష్ దొరలు మండల పరిధిలోని కొత్తపూసపల్లి గ్రామంలో తాగునీటి బావి ఏర్పాటు చేశారు. గ్రామంలో నివాసముంటున్న సుమారు 130 కుటుంబాలకు ఇప్పటికీ ఆ బావినీరే సరఫరా అవుతోందని స్థానికులు చెబుతున్నారు. వేసవిలోనూ ఇప్పటి వరకూ ఎలాంటి నీటి ఎద్దడి ఎదుక్కోలేదని అంటున్నారు. - ఇల్లెందుఅర్బన్ -
సంపులో పడి చిన్నారి మృతి
ఘట్కేసర్,న్యూస్‌లైన్: రెండు రోజుల్లో గృహ ప్రవేశానికి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలోని వారి కూతురు సంపులో పడి దుర్మరణం చెందింది. ఈ విషాదకర సంఘటన శనివారం రాత్రి మండల పరిధిలోని అన్నోజిగూడ లక్ష్మీనరసింహ కాలనీలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలోనిగువ్వల మురళీ, లత దంపతులు ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరికి కూతురు రమ్య (4) ఉంది. దంపతులు ఇటీవలే అదే కాలనీలో ఓ ఇల్లు కొనుగోలు చేశారు. రెండు రోజుల్లో గృహ ప్రవేశం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రం ఇంటికి రంగులు వేసే పనుల్లో కుటుంబీకులు నిమగ్నమయ్యారు. అనంతరం చిన్నారి రమ్య కోసం గాలించినా ఆమె జాడ కనిపించలేదు. చివరగా ఇంటి ఆవరణలో ఉన్న సంపులో చూడగా రమ్య మృతదేహం తేలియాడుతూ కనిపించింది. బాలిక మృతితో తల్లిదండ్రులు గుండెలుబాదుకుంటూ రోదించసాగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీయించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సంపులో పడి చిన్నారి మృతి
యుర్నగూడెం (దేవరపల్లి), న్యూస్‌లైన్ : యుర్నగూడెంలో వుూడేళ్ల చిన్నారి పాండ్రాకుల నాగదేవిశ్రీ(లక్కీ) శుక్రవారం ఇంటి వద్దగల నీటి తొట్టె(సంపు)లో ప్రమాదవశాత్తు పడిపోయి వుృతి చెందింది. పాండ్రాకుల సత్యనారాయుణ, వివుల దంపతులకు ఐదేళ్ల వయసు కువూరుడు, మూడేళ్ల వయసు లక్కీ ఉన్నారు. ఆ బాలిక శుక్రవారం ఇంటి వద్ద ఆడుకొంటూ నీటి తొట్టెలో పడిపోయింది. వుధ్యాహ్నానికి కూడా కుమార్తె కనిపించకపోవటంతో వివుల చుట్టుపక్కల ఇళ్ల వద్ద వెతికింది. అరుునా కనిపించక పోవటంతో సంపు వద్దకు వెళ్లి చూడగా అప్పటికే లక్కీ నిర్జీవంగా కనిపించింది. అల్లారు ముద్దుగా చేసుకుంటున్న లక్కీ వుృతితో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వూజీ ఎమ్మెల్యే తానేటి వనిత ఆ ఇంటికి వెళ్లి బాలిక వుృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులను ఓదార్చారు