బావిలో శిశువు.. స్పందించిన స్థానికులు | Newborn baby in Water well in anantapur district | Sakshi
Sakshi News home page

బావిలో శిశువు.. స్పందించిన స్థానికులు

Published Wed, Jun 24 2015 12:54 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

బావిలో శిశువు.. స్పందించిన స్థానికులు - Sakshi

బావిలో శిశువు.. స్పందించిన స్థానికులు

అనంతపురం: ఇంకా తెల్లవారలేదు... చిన్నారి శిశువు గుక్కపట్టి ఏడుస్తుంది. మన ఇంట్లో కాదులే అని అనుకున్నారంతా... కానీ ఎంత సేపటికి శిశువు ఏడుపు ఆపడం లేదు. దాంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూశారు. ఎక్కడ ఎవరు కనిపించలేదు. దాంతో ఏడుపు ఎక్కడ నుంచి వస్తుందంటూ పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు.

బావిలో నుంచి అని గుర్తించిన స్థానికులు. ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే బావిలోకి దిగి గోనె సంచిని వెలికి తీశారు. అందులోని శిశువును బయటకు తీశారు. శిశువు శరీరం మొత్తం రక్తంతో నిండి ఉండటం.. ఇంకా బొడ్డు కూడా తెగకపోవడంతో శిశువును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement