కొత్తపూసపల్లి వాసులకు నీటిని సరఫరా చేస్తున్న బ్రిటీష్ కాలంనాటి బావి ఇదే
బ్రిటీష్ వారు 124 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన బావి నేటికీ ప్రజల దాహార్తి తీరుస్తోంది. గని కార్మికుల కోసం 1890 సంవత్సరంలో బ్రిటీష్ దొరలు మండల పరిధిలోని కొత్తపూసపల్లి గ్రామంలో తాగునీటి బావి ఏర్పాటు చేశారు.
గ్రామంలో నివాసముంటున్న సుమారు 130 కుటుంబాలకు ఇప్పటికీ ఆ బావినీరే సరఫరా అవుతోందని స్థానికులు చెబుతున్నారు. వేసవిలోనూ ఇప్పటి వరకూ ఎలాంటి నీటి ఎద్దడి ఎదుక్కోలేదని అంటున్నారు.
- ఇల్లెందుఅర్బన్